![Afzal Gunj Young Girl Missing After Went Tailoring Training - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/13/wioman.jpg.webp?itok=iH0E8PeJ)
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌గంజ్ ఉస్మాన్‌షాహి ప్రాంతానికి చెందిన కుష్బూ కుమారి అశోక్ బజార్‌లోని టైలరింగ్ సెంటర్‌కు ట్రైనింగ్ నిమిత్తం వెళ్లేది.
శుక్రవారం టైలరింగ్‌కు వెళ్లిన కుష్బూ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment