afjalgunj
-
హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ ముఖ్య సమాచారం అందించింది. కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా బుధవారం (ఆగస్టు 16) నుంచి పునరిద్దరించినట్లు తెలిపింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపిందని పేర్కొంది.అయితే తాజాగా ఆ రూట్లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపింది. కాగా ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. చదవండి: వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది.… pic.twitter.com/FiJZjyxUiy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 16, 2023 -
హైదరాబాద్: అప్జల్‌గంజ్ పరిదిలోని గౌలిగూడలో కెమికల్ పేలుడు
-
హైదరాబాద్: గౌలిగూడలో కెమికల్ పేలుడు, ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తోంది. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటర్‌తో కెమికల్ రియాక్ట్ అవ్వడం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. కెమికల్ బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్గా (తండ్రి)గా గుర్తించారు. -
టైలరింగ్ ట్రైనింగ్కని వెళ్లింది.. కుష్బూ జాడేది..?
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌గంజ్ ఉస్మాన్‌షాహి ప్రాంతానికి చెందిన కుష్బూ కుమారి అశోక్ బజార్‌లోని టైలరింగ్ సెంటర్‌కు ట్రైనింగ్ నిమిత్తం వెళ్లేది. శుక్రవారం టైలరింగ్‌కు వెళ్లిన కుష్బూ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇక్కడ స్నానం చేయకూడదు అన్నందుకే తలపై..
సాక్షి, హైదరాబాద్(అఫ్జల్‌గంజ్): అ చేతి పంపు వద్ద స్నానం చేయ వద్దన్నందుకు ఓ వ్యక్తిని రోకలితో మోది హత్య చేసిన సంఘటన మంగళవారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నారాయణపేట జిల్లా, జలాల్పూర్ ప్రాంతానికి చెందిన పురుషోత్తం రెడ్డి (35) గత కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాడు. చాదర్‌ఘాట్ వద్ద ఉన్న సాయి బాబా దేవాలయం వద్ద ఉంటూ ప్రసాదాలు, దాతలు ఇచ్చే ఆహారం తింటూ ఫుట్‌పాత్‌పై నివాసం ఉండేవాడు. కాగా మంగళవారం దేవాలయం సమీపంలో ఉన్న చేతి పంపు వద్ద నేపాల్‌కు చెందిన బహద్దూర్ (30) చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన పురుషోత్తం రెడ్డి ఇక్కడ చేతులు కడుక్కోవద్దని అభ్యంతరం చెప్పాడు. ఈ విషయమై ఇరువురి మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన బహద్దూర్ పురుషోత్తం రెడ్డిపై రోకలిబండతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్సై మాన్సింగ్, క్లూస్ టీం, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీ టీవి పుటేజీని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అత్తతో తగాదా.. అశ్లీల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ -
హైదరాబాద్: అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అఫ్జల్‌గంజ్‌లోని కేంద్ర గ్రంథాలయం ఎదురుగా ఉన్న పెట్రోల్ పంప్ వెనుక ఓ పాత టైర్ల గోదాములో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి అక్కడ భారీగా నిల్వ చేసిన పాత టైర్లకు అంటుకోవడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో టైర్లు కాలి బూడిదయ్యాయి. అఫ్జల్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో చాలాసేపు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, వాహనదారులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఉస్మాన్‌షాహీ ప్రాంతానికి చెందిన కొంతమంది పాత టైర్ల వ్యాపారులు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖకు, అఫ్జల్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న పెట్రోల్ పంప్‌ను మూసివేయించారు. దాదాపు 15 ఫైరింజన్లతో సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు రూ.4.5 లక్షల విలువ చేసే పాత టైర్లు దగ్ధమయ్యాయని తెలుస్తోంది. పోలీసుల పనితీరుపై స్థానికుల ప్రశంసలు అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంటలను ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సత్వరమే చర్యలు చేపట్టారు. దీంతో పోలీసుల పనితీరును స్థానికులు ప్రశంసించారు. పక్కనే గుడి సెల్లో నివాసముండే కొంతమంది పాతటైర్లను కాల్చి అందులో ఉండే తీగలను తీసే క్రమంలో ప్రమాదం జరిగిందా, చిత్తు కాగితాలు ఏరుకునే వారు తాగిన మైకంలో పాత వైర్లను కాల్చే క్రమంలో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల అఫ్జల్‌గంజ్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ఛాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చదవండి: నోట్లకట్టలు గ్యాస్‌స్టవ్‌పై పెట్టి నిప్పుపెట్టిన మధ్యవర్తి -
ఉస్మానియా ఆసుపత్రిలో పాపం పసిపాప!
సాక్షి, అఫ్జల్‌గంజ్: పసిపాపను ఓతల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఓ తల్లి వెన్నుముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పసిపాపను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తీసుకు వచ్చింది. వైద్యులు పాపను మెరుగైన చికిత్స నిమిత్తం ఏఎంసీ వార్డుకు తరలించారు. వార్డుకు చేరుకున్న కొద్ది సేపటి తర్వాత ఇప్పుడే వస్తాను, పాపను చూడండి అని ప్రక్క బెడ్‌పై ఉన్న పేషంట్‌కు చెప్పి సదరు మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపకు ఉన్న వ్యాధి కారణంగా వదిలి వెళ్లారా? ఆడపిల్ల అని వదిలి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స అనంతరం పాపను శిశు విహార్‌కు తరలిస్తామని తెలిపారు. చదవండి: అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
ఎట్టకేలకు తల్లి చెంతకు..
ఈ నెల 14న ఇమ్లీబన్ బస్టాండ్‌లో కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వేగవంతంగా స్పందించిన పోలీసులు దాదాపు 10 గంటల్లోనే కిడ్నాపర్లను గుర్తించి బాలిక అవంతికను రక్షించారు. కొండాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగార్జున భార్య లక్ష్మితో కలిసి తమ సొంతూరు బళ్లారికి వెళ్లేందుకు శనివారం ఇమ్లీబన్‌కు వచ్చారు. ఈ క్రమంలో వారి మూడేళ్ల కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయగా అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు ఏడు టీంలుగా ఏర్పడి..సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంగమోడి శివుడు, పార్వతమ్మలు కిడ్నాప్‌కు పాల్పడినట్లు గుర్తించి... మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కేసు ఛేదన కోసం పోలీసులు ఎంతో శ్రమకోర్చినందుకు సీపీ అంజనీకుమార్ వారిని ప్రశంసించారు. హిమాయత్‌నగర్: మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కేవలం 10 గంటల్లోనే బాలిక ఆచూకీని గుర్తించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం నగర పోలీసు అంజనీకుమార్ వెల్లడించారు. తక్కువ వ్యవధిలోనే కేసును కొలిక్కి తెచ్చిన పోలీసులను ఆయన అభినందించారు. సీపీ అంజనీ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నాగార్జున, లక్ష్మి దంపతులు వాచ్మెన్లు. వీరికి మూడేళ్ల కుమార్తె అవంతిక ఉంది. ఈ నెల 14న కర్ణాకటలోని బళ్లారి వెళ్లేందుకుకు నగరంలోని మహాత్మాగాంధీ బస్సుస్టాండ్ (ఎంజీబీఎస్)కు వచ్చారు. వీరితో పాటు లక్ష్మి అక్క జయలక్ష్మి కూడా ఉన్నారు. ఎంజీబీఎస్‌లో బళ్లారి బస్సెక్కారు. ఈ క్రమంలో నాగార్జునకు బళ్లారి వెళ్లేందుకు ఆసక్తి లేక బస్సు దిగేశాడు. నాగార్జునను బుజ్జగించేందుకు భార్య లక్ష్మి కూడా రావడంతో.. కొద్ది నిమిషాలకు జయలక్ష్మి కూడా కిందకు దిగింది. తనతో ఉన్న అమ్మ, నాన్న, పెద్దమ్మ ఎవరూ కనిపించకపోవండంతో.. వారిని వెతుకుతూ బాలిక అవంతిక వెళ్లింది. ఏడ్చుకుంటూ తిరుగుతున్న చిన్నారిని మహబూబ్‌నగర్ జిల్లా సంగినాయిపల్లి వాసులు సంగమోడి శివుడు, పార్వతమ్మలు తమ వెంట తీసుకుని పరారయ్యారు. చదవండి: రాష్ట్రంలో కిడ్నాప్‌ల కలకలం ఆచూకీ ఇలా.. తమ కూతురు అవంతిక కనిపించకపోవడంతో నాగార్జున, లక్ష్మి దంపతులు అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ కె.మురళీధర్ సుల్తాన్‌బజార్ ఏసీపీ పి.దేవేందర్‌లు రంగంలోకి దిగారు. ఎస్హెచ్ఓ ఎం.రవీందర్‌రెడ్డి, డీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మాన్‌సింగ్‌లు 7 జట్లుగా ఏర్పడ్డారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చారు. కేవలం 10 గంటల్లో మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాట్సప్ గ్రూప్స్‌తో.. పోలీసులు ఎంజీబీఎస్, పురానాపూల్ ప్రాంతాల్లో వైపు వచ్చిన బస్సులను తనిఖీ చేశారు. ఆ రూట్లో బళ్లారి, మహబూబ్‌నగర్ వెళ్లే బస్సు డ్రైవర్, కండక్టర్లతో కలిసి ఎస్సై మాన్సింగ్ ఓ వాట్సప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారు. ఈ గ్రూపులో కనీసం 50– 60మంది ఉన్నారు. ఎంజీబీఎస్‌లో సంగమోడి శివుడు, పార్వతమ్మలు చిన్నారి అవంతికను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీ వీడియోను పోస్ట్ చేశారు. వారి ఆచూకీని గుర్తించిన బస్సు డ్రైవర్, కండక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు అఫ్జల్‌గంజ్ పోలీసులు. సీసీ ఫుటేజీల ఆధారంతో నిందితులను పట్టుకున్నారు. అయిదు కేసుల్లో జైలుకు.. సంగమోడి శివుడు, పార్వతమ్మలు కూలిపనులు చేస్తుంటారు. వివాహమై ఆరేళ్లయినా వీరికి సంతానం కలగలేదు. ఇదే క్రమంలో శివుడు సెల్ఫోన్లు చోరీ చేసి 22 నెలల పాటు, భువనగిరి పోలీసు స్టేషన్ పరిధిలో మరో సెల్‌ఫోన్ చోరీ కేసులో 6 నెలల పాటు మొత్తం 28 నెలలపాలు జైలులో ఉండి ఇటీవల విడుదలయ్యాడు. తమకు పిల్లలు లేకపోవడంతో అవంతికను కిడ్నాప్ చేసినట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ కె.మురళీధర్ తెలిపారు. -
'శభాష్.. గణేష్'
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న 15 తులాల బంగారు నగలను పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఆటో డ్రైవర్ మెరుగు గణేష్. అఫ్జల్‌గంజ్ పోలీస్ ష్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ పిజి రెడ్డి తెలిపిన మేరకు.. చాంద్రయాణగుట్ట ప్రాంతానికి చెందిన వ్యాపారి మహ్మద్ ఇబ్రహీం (45) శనివారం సాయంత్రం షాపింగ్ చేసి ఆటో ఎక్కి పుత్లీబౌలీలో దిగాడు. ఆటో దిగే సమయంలో జోరుగా వర్షం కురుస్తుండడంతో బంగారు ఆభరణాలు ఉన్న పాలిథిన్ కవర్‌ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు. తరువాత కవర్‌ను మర్చిపోయానని గ్రహించిన ఇబ్రహీం ఆటో కోసం వెతకగా ఫలితం లేకపోవడంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవి ఫుటేజ్ ఆధారంగా, స్థానికుడు ఇస్మాయిల్ ఇచ్చిన సమాచారంతో ఆటో డ్రైవర్ మలక్‌పేట్‌కు చెందిన మెరుగు గణేష్‌గా గుర్తించారు. అతని కోసం గాలిస్తున్న క్రమంలో అతనే స్వయంగా ఆదివారం మధ్యాహ్నం పోలీసు ష్టేషన్కు వచ్చి తన ఆటోలో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడంటూ ఆభరణాలు గల కవర్‌ను అందజేశాడు. సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి బాధితుడిని పిలిచి ఆభరణాలను అందజేయడంతో పాటు ఆటో డ్రైవర్ గణేష్‌ను, సహకరించిన ఇస్మాయిల్‌ను ఘనంగా సత్కరించారు. -
ఆఫ్జల్‌గంజ్‌లో విషాదం
-
వైద్యం కోసం ఉస్మానియాకు.. మహిళపై దారుణం!
సాక్షి, హైదరాబాద్ : భర్త కొట్టాడని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. వైద్యం కోసం పోలీసులు నిర్లక్ష్యంగా ఆమెను ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రి పంపించడంతో.. కీచకులు బాధితురాలిపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. భర్త తనను కొట్టాడంతో ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైద్యం కోసం బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లడంతో.. అక్కడ తనపై వార్డ్బాయ్ నాగరాజు, హోంగార్డ్ ఒమర్ లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
నిజాయితీ చాటుకున్న యువకుడు
అఫ్జల్‌గంజ్: ఏటీఎం సెంటర్లో దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడో యువకుడు. అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన మల్లయ్య, సత్తమ్మ దంపతులు గౌలిగూడ చమన్ ప్రాంతంలో కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనెల 23న గౌలిగూడలోని శంకర్‌షేర్ హోటల్ సమీపంలో ఉన్న ఏటీఎం నుంచి సత్తమ్మ పేరున ఉన్న ఎస్బీహెచ్ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా చేసేందుకు మల్లయ్య యత్నించాడు. అయితే, డబ్బు రాకపోవడంతో పక్కనే ఉన్న ఐసీఐసీఐ ఏటీఎం నుంచి రూ.5 వేలు డ్రా చేశాడు. అదే సమయంలో మొదటి ఏటీఎంలోకి వెళ్లిన యాకుత్‌పురాకు చెందిన ఇమ్రాన్‌కు అక్కడ ఏటీఎంలో రూ.10 వేలు దొరికాయి. ఆ డబ్బుకు సంబంధించిన వారు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేçÙన్లో అందజేశాడు. ఆ తర్వాత పాస్‌బుక్ అప్డేట్ చేయించుకొనేందుకు బ్యాంకుకు వెళ్లిన మల్లయ్యకు సత్తమ్మ అకౌంట్లో రూ.15 వేలు డ్రా చేసినట్టు బ్యాంక్ సిబ్బంది చెప్పారు. దీంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఏటీఎం సెంటర్లో దొరికిన నగదు స్టేషన్లో ఉండటంతో ఇన్స్పెక్టర్ అంజయ్య ఆ డబ్బు వారిదేనని నిర్ధారించుకొని వారికి అప్పగించారు. దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ఇమ్రాన్‌ను సీఐ అభినందిచారు. -
నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
అఫ్జల్‌గంజ్: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ సి. అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మనీష్ (35), సాహిల్ (34) వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి, ఒక్కోటి రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నారు. మనీష్ కాచిగూడలో ఉంటూ ఉస్మాన్‌గంజ్‌లో రత్న స్టడీ సొల్యూషన్స్ పేరిట ఓ స్టడీ సెంటర్‌ను నెలకొల్పాడు. ఇందులో చైతన్యపురికి చెందిన అనిల్, శిల్ప, హరీశ్ పని చేస్తున్నారు. ఈ స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, వివిధ రకాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. ఇతనికి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న సాహిల్ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సత్యప్రకాశ్ అనే వ్యక్తి మనీష్, అనిల్‌ల వద్ద నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లను, ల్యాప్‌టాప్‌ను, ప్రింటర్లను, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన సాహిల్ ను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. శిల్ప, హరీశ్ పరారీలో ఉండగా మనీష్, అనిల్, సత్యనారాయణలను రిమాండ్‌కు తరలించారు. -
అఫ్జల్‌గంజ్‌లో వ్యక్తి దారుణహత్య
హైదరాబాద్ : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పరిధిలో గురువారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది అతి కిరాతకంగా చంపేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.