సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ ముఖ్య సమాచారం అందించింది. కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా బుధవారం (ఆగస్టు 16) నుంచి పునరిద్దరించినట్లు తెలిపింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపిందని పేర్కొంది.అయితే తాజాగా ఆ రూట్‌లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపింది.
కాగా ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు టీఆఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
చదవండి: వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది.… pic.twitter.com/FiJZjyxUiy
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 16, 2023
Comments
Please login to add a commentAdd a comment