moulali
-
హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ ముఖ్య సమాచారం అందించింది. కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా బుధవారం (ఆగస్టు 16) నుంచి పునరిద్దరించినట్లు తెలిపింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపిందని పేర్కొంది.అయితే తాజాగా ఆ రూట్లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపింది. కాగా ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. చదవండి: వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది.… pic.twitter.com/FiJZjyxUiy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 16, 2023 -
తల్లీ కూతురు హత్య.. వ్యక్తికి జీవితాంత ఖైదు
చిత్తూరు అర్బన్: తల్లీ, కూతురిని హతమార్చి.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తికి మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన సయ్యద్ మౌలాలి(47) అనే వ్యక్తి వృత్తిరీత్యా చెరువులను లీజుకు తీసుకుని చేపలు పట్టి విక్రయించే వ్యాపారం చేసేవాడు. మండలంలోని గిరిజన తాండాకు చెందిన సరళమ్మ(37)కు భర్త మరణించాడు. ఆమెతో మౌలాలి కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, తల్లి ఉన్నారు. సరళమ్మ వేరే మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెతో రాత్రి పొలం వద్ద గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఆమెను కర్రతో తలపై కొట్టాడు. ఆమె చనిపోవడంతో పెద్దేరు ప్రాజెక్టులో వేసేశాడు. శవం పైకి తేలకుండా చీరకు రాళ్లు కట్టిపడేశాడు. మరుసటి రోజు ఆమె తల్లి గంగులమ్మ తన కుమార్తె ఎక్కడని మౌలాలిని నిలదీసింది. నీ కుమార్తె ఉదయానికల్లా వస్తుందని నమ్మబలికాడు. ఆమెకు మద్యం అలవాటు ఉండడంతో మద్యం తెచ్చి ఇచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో చీరకొంగుతో గొంతుకు బిగించి చంపేశాడు. శవాన్ని ఓ చెరువులోకి తీసుకెళ్లాడు. శవం పైకి లేవకుండా ఆమె చీరను నీటిలోని ఓ చెట్టు మొదలుకు కట్టివేశాడు. ఆ మరుసటిరోజు సరళమ్మ కుమార్తెలు తమ అమ్మ, అవ్వ ఎక్కడని మౌలాలీని నిలదీశారు. వారికి కరోనా రావడంతో మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించానని వారిని నమ్మించాడు. వారితో కలసి అక్కడే పడుకునే వాడు. వారిలో పెద్ద అమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితో చంపేస్తానని బెదిరించాడు. ఇలా నెల రోజులు గడిచాక ఆ పిల్లలు ముగ్గురిని కర్ణాటక గౌనిపల్లెలోని ఓ ఇంట్లో ఉంచాడు. బంధువుల ఫిర్యాదు సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మ, కుమార్తె కనపడకపోవడంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సయ్యద్ మౌలాలిని అరెస్టు చేసి.. బాలికలను అతడి నుంచి విడిపించారు. నిందితుడు చెప్పిన వివరాలతో చెరువులో పడున్న తల్లీ, కుమార్తె మృతదేహాలను బయటకు తీశారు. అతనిపై పలు హత్యలు, అత్యాచారం, అట్రాసిటీ, అపహరణ కేసులు నమోదు చేశారు. నిందితుడిపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువుకావడంతో.. అతను మరణించేంత వరకు జైల్లో ఉండాలని, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి సోమవారం తీర్పునిచ్చారు. బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచిస్తూ తీర్పులో పేర్కొన్నారు. -
2018 నాటికే ప్రారంభం అన్నారు.. నాలుగేళ్లవుతున్నా ఊసే లేదు!
సాక్షి, ఘట్కేసర్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా 2వ దశలో సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదన చేశారు. 2013లో పనులు ప్రారంభించి మౌలాలి–ఘట్కేసర్ మధ్య ఉన్న 12.20 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. ఒప్పందం ప్రకారం కేంద్రం 1/3, రాష్ట్ర ప్రభుత్వం 2/3 నిధులతో పనులు చేపట్టాలి. గతంలో ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ పనులు పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2018 డిసెంబర్ నాటికి ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కాని మూడేళ్లయినా ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకపోవడంతోనే ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యం అవుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం నిరాశలో స్థానికులు.. ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం.. తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపుతారని భావించారు. ప్రజలు సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు దూరం ట్రాఫిక్ బాధను భరించలేక రైలు ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. బస్సులోనైతే గంటన్నర సమయం పడుతుండగా రైలులో కేవలం 35 నిమిషాల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకోవచ్చు. చదవండి: కూతురి మరణం జీర్ణించుకోలేకే.. నిందితుడిని కాల్చి చంపారా? ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి.. స్థానికంగా ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, కొత్త కాలనీలు వెలుస్తున్నందున ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో యంనంపేట్, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ పరిధిలో రైల్వే స్టేషన్లు ఏర్పడి రవాణ సౌకర్యం మెరుగు పడుతుంది. సంబంధిత అధికారులు స్పందించి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకులకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటలోకి తేవాలని కోరుతున్నారు. ఎంఎంటీఎస్ బండి.. ఎంతకాలం ఆగాలండి.! మేడ్చల్‌రూరల్: సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులు చేపట్టింది. ఈ పనులు చేపట్టి ఏళ్లు గడిచినా మేడ్చల్ ప్రజలకు నేటికి ఎంఎంటీఎస్ కల నెరవేరలేదు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రాక్ సికింద్రాబాద్ – బొల్లారం – మేడ్చల్ సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. దీంతో మేడ్చల్ వరకు ప్రత్యేక రైల్యే ట్రాక్, విద్యుత్ లైన్, నూతన ప్లాట్ఫార్మ్ నిర్మాణ పనులను చేపట్టారు. ప్రారంభం కాని రెండోదశ పనులు.. ఏళ్ల పాటు సాగిన పనులకు కరోనా అడ్డంకిగా మారింది. అదేవిధంగా అధికారుల అలసత్వం వల్ల నేటికి పనులు పూర్తి కాక మరింత ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు తొలగినా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటికి తోడు నిధుల లేమి కూడా కారణంగా మారడంతో ఎక్కడి పనులను అక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీకి వెళ్లి అనుమతి తెచ్చి.. మేడ్లల్ పట్టణంలోని మేడ్చల్ – గిర్మాపూర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ – గుండ్లపోచంపల్లి రోడ్డులో రైల్వే గేట్లు ఉండటంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్థాని క నేతలు అండర్‌పాస్‌ల ఏర్పాటు చేయాలని ఢిల్లీకి వె ళ్లి రైల్వేశాఖ మంత్రికి పరిస్థితిని వివరించారు. ఆయన ఆదేశాలతో అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. -
ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేస్తున్న మఠా
మౌలాలి: రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన షేక్ యామిన్ అలియాస్ సలీం (39), మహరాష్ట్రకు చెందిన ఉస్మాన్, నిజామాబాద్‌కు చెందిన లక్ష్మణ్, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 16, సైబరాబాద్ పరిధిలో 01, జోగుళాంబ గద్వాల్లో 09, మహబూబ్‌నగర్‌లో 01, కామారెడ్డి, 01, మెదక్‌లో 04, నల్గొండలో 03, నిజామాబాద్‌లో 05 చొప్పున మొత్తం 41 చోట్ల రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. ఇటీవల ప్రధాన నిందితుడు షేక్ యామిని అలియాస్ సలీంను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అదుపులోని తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 18 లక్షల 20 వేల విలువ గల 350 గ్రాముల బంగారు అభరణాలు, లక్షా రూపాయల విలువగల కిలోన్నర వెండి, లక్షా 50 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్‌తోపాటు మొత్తం రూ. 23 లక్షల 80 వేల విలుగల నగదు, నగలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు షేక్ యామిన్ అలియాస్ సలీంను రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. -
మౌలాలి రైల్వేస్టేషన్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మౌలాలి రైల్వేస్టేషన్లో మరిన్ని రైళ్ల నిలుపుదలకు అవకాశం లభించింది. పెద్ద ఎత్తున చేపట్టిన రైల్వేస్టేషన్ విస్తరణ, ప్లాట్‌ఫామ్‌ల పొడిగింపు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రైళ్ల నిర్వహణకు అనుగుణంగా స్టేషన్ అందుబాటులోకి రానుంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కోసం లూప్లైన్ల ఏర్పాటు చేశారు. అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికుల రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించనున్నాయి. సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రద్దీ నివారణకు అనుగుణంగా మౌలాలి స్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మేరకు సరుకు రవాణా లైన్లను లూప్‌లైన్లుగా మార్పు చేశారు. మరోవైపు రెండు రైల్వే లైన్ల పొడవును విస్తరించారు. దీంతో ఈ రైల్వేస్టేషన్లో 18 బోగీలు ఉన్న ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగనుంది. (క్లిక్: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం) ఈ సదుపాయంతో మౌలాలి స్టేషన్లో మరిన్ని రైళ్లు నిలిపేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రయాణికుల రైళ్లను నిలిపేందుకు ఇప్పుడు ఉన్న రెండు ప్లాట్‌ఫామ్‌లతో పాటు మరొకటి అదనంగా అందుబాటులోకి రానుంది. రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కూడా మెరుగుపడనుందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. (క్లిక్: ఐఎస్బీ విద్యార్థులకు భలే బొనాంజా) -
ఘట్కేసర్–మౌలాలి మధ్య ఫోర్‌లేన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రధాన రవాణా మార్గాల్లో ఒకటిగా ఉన్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టు రెండో దశలో కీలక మార్గంలో కొంత భాగం అందుబాటులోకి వచ్చింది. సనత్‌నగర్–ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడిపే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో పనులను చేర్చారు. ఘట్కేసర్ నుంచి మౌలాలి మీదుగా మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ, ఫిరోజ్‌గూడ, సుచిత్ర కూడలి, నేరెడ్మెట్ మీదుగా 35 కిలోమీటర్ల మేర ఈ మార్గం కొనసాగుతుంది.కీలకమైన ఘట్కేసర్–మౌలాలి మధ్య తాజా గా డబుల్ లేన్ నిర్మించారు. ఇప్పటికే ఆ మార్గంలో డబుల్ లేన్ ఉండగా, దానికి అదనంగా కొత్తగా రెండు వరసల మార్గం అందుబాటులోకి వచ్చింది. దానికి ఎలిక్ట్రిఫికేషన్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి కావటంతో సాధారణ రైళ్లు నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ పచ్చజెండా ఊపటంతో బుధవారం నుంచి రైళ్లను నడుపుతున్నారు. మౌలాలి నుంచి సనత్‌నగర్ వరకు ఎంఎంటీఎస్ మార్గం పూర్తి కావాల్సి ఉన్నందున వాటిని నడిపేందుకు ఇంకా సమయం పట్టనుంది. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం నిర్మించిన ఈ కొత్త డబుల్‌లేన్ మీదుగా రైళ్లు దూసుకెళ్లేందుకు కొంతకాలం నిరీక్షించక తప్పని దుస్థితి నెలకొంది. ఘట్కేసర్ నుంచి మౌలాలి వరకు రూపుదిద్దుకున్న కొత్త డబుల్‌లేన్, అక్కడి నుంచి సనత్‌నగర్‌కు మళ్లాల్సి ఉంది. ఆ డైవర్షన్ మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా అమ్ముగూడ మార్గంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ లేన్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. సనత్‌నగర్ మీదుగా సుచిత్ర, రామకృష్ణాపురం, నేరెడ్మెట్ మీదుగా ప్రస్తుతం సాగుతున్న ఆ సింగిల్లేన్ను కేవలం గూడ్సు రైళ్లు నడిపేందుకే పరిమితం చేశారు. దానిని అనుసంధానిస్తూ కొత్తగా డబుల్‌లేన్ రూపొందించాల్సి ఉంది. కానీ మధ్యలో కొంత భాగం రక్షణ శాఖ స్థలాలున్నాయి. వాటిని స్వాధీనం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎంతో ఊరట సికింద్రాబాద్–కాజీపేట ప్రధాన మార్గంలో ఉన్న ఘట్కేసర్–మౌలాలి స్టేషన్ల మధ్య అందుబాటులోకి వచ్చిన కొత్త డబుల్ లేన్ ఇప్పుడు రైళ్ల రద్దీతో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఎంతో ఊరటనివ్వబోతోంది. సికింద్రాబాద్, కాజీపేట, నడికుడి (గుంటూరు), సనత్‌నగర్ (బైపాస్)లను అనుసంధానిస్తుంది. ఈ 12.2 కి.మీ. మేర రెండు వరసలతో ట్రాక్ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చయింది. -
ఇన్నాళ్లూ నవ్వించి..ఇప్పుడు ఏడిపిస్తున్నాడు
అనారోగ్యంతో బుధవారం మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ స్థానికులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని మౌలాలీ వాసులు గుర్తు చేసుకున్నారు. ఆయన గత 25 ఏళ్లుగా స్థానిక పెద్దలు, చిన్న పిల్లలకు సన్నిహితులని పేర్కొన్నారు. డివిజన్లో జరిగే ప్రతి పండగలోను వేణుఉత్సాహంగా పాల్గొనేవారని, తోటివారితో సందడి చేవారని వారు పేర్కొన్నారు. కుషాయిగూడ: అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ స్థానికులతో కలివిడిగా.. ఎంతో అప్యాయంగా ఉండేవారు. 25 సంవత్సరాలుగా మౌలాలి ప్రాంతంలో నివసిస్తున్న ఆయన పెద్దలతో పాటుగా చిన్నపిల్లలకు సుపరిచితుడిగా మారారు. స్థానికంగా నిర్వహించే పండుగలు, ఉత్సవాలలో పాల్గొంటూ తన హాస్యంతో అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు గుర్తుచేసుకున్నారు. నా గెలుపులో భాగస్వామి జీహెచ్ఎంసీ ఎన్నికలలో నాకు అన్ని విధాలా అండగా నిలిచాడు. ఎన్నికల ప్రచారంలో సొంత మనిషిలా నాకు మద్దతుగా ప్రచారం చేసి నా గెలుపులో భాగస్వామి అయ్యాడు. నేను తలపెట్టే ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యారు. వేణుమాధవ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. – గొల్లూరి అంజయ్య, కార్పొరేటర్ 1997 నుంచి స్నేహితులం వేణు మాధవ్ హెచ్‌బీకాలనీకి వచ్చిన తరువాత 1997లో మా స్నేహం మొదలైంది. ఆయనతో పాటు పది సంవత్సరాలుగా సినిమా రంగంలో పనిచేశాను. ఈ క్రమంలో మా స్నేహం కాస్తా మరింత బలపడి కుటుంబ స్నేహితులుగా మారాం. తన సమస్యలు నాతో చర్చించేవాడు. గొప్ప మిత్రుడిని కోల్పోడం బాధగా ఉంది. – శ్రావణ్‌కుమార్‌గౌడ్ ప్రతి ఫంక్షన్‌కు వచ్చేవాడు కొద్ది కాలం క్రితం పరిచయమైన వేణన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారాడు. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడు. ఎక్కడైనా కలిశాడంటే చాలు నవ్వులు పండించేవాడు. అతనితో గడిపినంత సేపు సమయం గుర్తుకు వచ్చేది కాదు. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి కుటుంబ సమేతంగా హజరై సంతోష పరిచేవాడు. అలాంటి వ్యక్తి మరణించాడన్న వార్త మా కుటుంబ సభ్యులందరినీ బాధలో ముంచేసింది. – వంజరి ప్రవీణ్ అందరిలో జోష్ నింపేవాడు మా కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమానికీ ఆయనను ఆహ్వానించేవాళ్లం. ముఖ్యంగా బోనాలకు ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని మా అందరిలో జోష్ నింపేవాడు. ఎలాంటి సాయం కోరినా తనవంతు సాయం చేసేవాడు. – సురేష్ నమ్మలేకున్నాం హాస్యనటుడు వేణుమాధవ్ హెచ్‌బీకాలనీలో అందరితో కలివిడిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. డివిజన్లో నిర్వహించే అన్ని ఉత్సవాలకు హాజరై ఉత్సహపరిచేవాడు. అలా అందరికి సుపరిచితుడుగా మారిన వేణుమాధవ్ ఇక లేడంటే నమ్మలేకున్నాం. – బోదాస్ రవి (వేణుమాధవ్‌కు ప్రముఖుల నివాళి దృశ్యాల కోసం... క్లిక్ చేయండి) -
ఉర్సుకు సర్వం సిద్ధం
మౌలాలి: హైదరాబాద్ మౌలాలి అంటే తొలుత గుర్తుకు వచ్చేది ‘హజ్రత్ అలీ బాబా దర్గా’నే. ఈ దర్గాకు చారిత్ర నేపథ్యం ఏంతో ఉంది. ఏటా హజ్రత్ అలీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భాగ్యనగరంతో పాటు దేశ విదేశాల నుంచి కులమతాలకు అతీతంగా వచ్చిన ఎందరో హజ్రత్ అలీ బాబాను దర్శించుకుంటారు. చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్థిల్లుతున్న ఈ ప్రదేశానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లతో దర్గాపైకి వెళ్లేందుకు ర్యాంప్ నిర్మించింది. చారిత్రాత్మకం మౌలాలి దర్గా హైదరాబాద్ నగరానికి 11 మైళ్ల దూరంలో ఉత్తర దిశగా 2017 అడుగుల ఎత్తులో గల గుట్టపై మౌలాలి దర్గా ఉంది. దీన్నే ‘కోహి–ఏ–మౌలాలి’ అని కూడా అంటారు. ఇస్లాం దూత హజ్రత్ మేల్లుడు హజ్రత్ అహ్మద్ ముస్తఫా సంస్మరణార్థం దర్గాను నిర్మించినట్లు చరిత్ర కథనం. కులీ కుతుబ్‌షా నవాబ్ 1578లో ఈ దర్గాను నిర్మించినట్లు చెబుతారు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కలకు ప్రతిరూపమని కూడా కథనం ఉంది. ఏటా ఉర్సు ఉత్సవాల్లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అరబ్ దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, కువైట్ తదితర దేశాల భక్తులు సైతం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి మౌలాలి హజ్రత్ అలీ జయంతిని పురస్కరించుకుని ఏటా రజబ్ మాసం(ముస్లిం కాలమానిని ప్రకారం) 17వ రోజు మౌలాలి దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. మౌలాలి దర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలు భాగ్యనగరంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. పాతబస్తీ నుంచి పెద్ద ఎత్తున షియా వర్గానికి చెందిన భక్తులు మార్చి 27 అర్ధరాత్రి తమ నివాసాల్లో హజ్రత్ అలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల తొలిరోజు, ఐదో రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా రోజుల్లో పాతబస్తీ నుంచి వేలాది ముస్లింలు ఒంటెలు, గుర్రాలు, ఏనుగులపై ఊరేగింపుగా సందల్ తీసుకొస్తారు. బాబాను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సీపీ మహేష్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ సందీప్, సీఐ మన్మోహన్, ఎస్ఐ విష్ణువర్ధన్‌రెడ్డి.. దర్గా కమిటీ సభ్యులు, స్థానికులతో సంప్రదింపులు జరిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మౌలాలీలో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. మౌలాలీ ప్రాంతంలో ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానస్పందంగా ఉన్న వీరిని ఈనెల 23న విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనుషా, అన్నపూర్ణ, భవాని అనే ముగ్గురు మావోయిస్టులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు వారు ప్రకటించారు. ఇదివరకే వీరిపై పాడేరు పోలీస్ స్టేషన్లో పలుకేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారితో పాటు కుర్రా కామేశ్వరరావు అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు వీరేనా.. విశాఖలో సంచలనం రేపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము ఎన్కౌంటర్లో వీరి పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం రావాల్సిఉంది. మావోయిస్టు కీలక నేత రామకిృష్ణ (ఆర్కే) ఆధ్వర్యంలో పలు ఎన్‌కౌంటర్లలలో వీరు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో అనుషా దళకమాండర్‌గా పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో ముగ్గురు మావోయిస్టులు పట్టుపడటం సంచలనంగా మాదిన నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్టయింది. -
మౌలాలీలో వ్యక్తి దారుణ హత్య
మౌలాలీ: మౌలాలీ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తి వయసు సుమారు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండవచ్చు. గుర్తుతెలియని దుండగులు సదరు వ్యక్తి తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం రోడ్డు పక్కనున్న కాల్వలో పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ల్యాబ్‌లో గ్యాస్ లీక్: ఇద్దరు మృతి
హైదరాబాద్: మౌలాలీలోని ఓ కెమికల్ ల్యాబ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అవ్వడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులు ధీరజ్, విజయ్‌లుగా గుర్తించారు. -
సిరుల పంట
కరువు నేలపై అన్నదాత వినూత్న ప్రయోగం వరిగల సాగుతో లాభాలు రూ. 2వేలతో ఎకరా పొలంలో సాగు రోగులకూ బలవర్ధక ఆహారం ఒకే రకం పంట సాగుతో వరస నష్టాల చవిచూస్తున్న కరువు జిల్లా రైతులకు వరిగల సాగు లాభాల పంటగా మారుతోంది. సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేపడితే దిగుబడి కూడా అత్యధికంగా వస్తుండడంతో ముదిగుబ్బకు చెందిన రైతు మౌలాలీ ఈసారి తన ఐదెకరాల పొలంలో వరిగల సాగును చేపట్టాడు. వూహించని రీతిలో దిగుబడి రావడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కరువు నేలపై వరిగల సాగు లాభాల వర్షాలను కురిపిస్తుందని అతను నిరూపించాడు. ఐదెకరాల సాగుకు రూ. 10 వేలు ముదిగుబ్బకు చెందిన రైతు మౌలాలీకు ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంది. వర్షాధారంపై ఆధారపడి పంట సాగు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే వరుసగా పంట నష్టాలను చవి చూశాడు. ఇలాంటి తరుణంలో వరిగల సాగు గురించి తెలుసుకున్న అతను తొలిసారిగా ధైర్యం చేసి ఐదు ఎకరాల పొలంలో రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి విత్తు వేశాడు. అదే సమయంలో అంతరపంటగా కంది సాగు చేపట్టాడు. ఆవు గంజు, పేడ మిశ్రమాన్ని పిచికారి చేస్తూ, చీడపీడల నివారణకు తక్కువ మోతాదులో మందులు వాడాడు. 75 రోజుల తర్వాత పంట చేతికి వచ్చింది. ఐదెకరాల్లో 30 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ రూ. 3,260తో అమ్ముడుపోయింది. ఇది కాక అంతరపంటగా సాగు చేసిన కంది ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. ఆనందంగా ఉంది మొట్టమొదటి సారి వరిగల పంట సాగు చేశాను. సేంద్రియ ఎరువుల వాడడం వల్ల అధిక దిగుబడి వచ్చింది. మార్కెట్లో వరిగలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ధర కూడా ఎక్కువగా నే ఉంది. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నష్టాల నుంచి గట్టెక్కవచ్చు అని తెలుసుకున్నాను. – మౌలాలీ, రైతు మధుమేహ రోగులకు మంచి ఆహారం మధుమేహ రోగులకు వరిగలు మంచి పౌష్టికాహారం. ఇందులో ఉన్న ప్రత్యేక గుణాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. వరిగల గింజలతో ఉప్మా, ఇడ్లీలు, అన్నం వండుకుని చేసుకుని తినవచ్చు. పలు కంపెనీలు వరిగలతో బిస్కట్లు, బ్రెడ్లు తయారు చేస్తున్నాయి. ఆరోగ్యపరంగా వరిగల ఉత్పత్తులు తినడం చాలా మంచింది. – శివశంకర్ నాయక్, వ్యవసాయ శాస్త్రవేత్త, కదిరి రైతుల్లో అవగాహన పెంచుతాం సంప్రదాయ వేరుశనగ పంటతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రత్యామ్నాయ పద్దతిలో వరిగలు సాగు చేసేలా రైతుల్లో చైతన్యం తీసుకువస్తాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే పంటల్లో వరిగలు ఒక్కటి. ఈ పంట దిగుబళ్లకు కదిరి, మదనపల్లెల్లో మంచి డిమాండ్ ఉంది. – మల్లేష్‌కుమార్, వ్యవసాయశాఖాదికారి, ముదిగుబ్బ -
మౌలాలీలో తాళం వేసిన ఇంటికి కన్నం
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని మల్యాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మౌలాలిలోని రాఘవేంద్రకాలనిలో నివాసముంటున్న స్వర్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో వెళ్లి శనివారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు తీసి, బీరువా పగలగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 14 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించిన యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలనగర్‌లో నివాసముండే రీనా సిల్వియా రిచర్డ్సన్(23) ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. రీనా డిగ్రీ చదువుతున్న రోజుల్లో మేడిపల్లికి చెందిన డెంజిల్తో పరిచయం ఏర్పడింది. వీరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రీనా పని చేసే సంస్థలోనే డెంజిల్కు ఉద్యోగం ఇప్పించింది. పలుమార్లు రీనా డెంజిల్‌ను వివాహం చేసుకోమని అడిగింది. అతడు రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రీనా మేడిపల్లిలోని డెంజిల్ ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలని గొడవపడింది. ఈ గొడవలో డెంజిల్ తల్లి, తండ్రి, సోదరిలు రీనాను నిలువరించారు. దీంతో మనస్తాపం చెందిన రీనా ఇంటికి వచ్చి సోమవారం ఉదయం తన చావుకు డెంజిల్, అతని తండ్రి బిషప్, తల్లి సునీత, సోదరి డయానాలు కారణమని నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రీనా తల్లి మేరిజాన్ గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు, లారీ ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్(నేరేడ్మెట్): కారును ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం హైదరబాద్‌లోని మౌలాలిలో చోటుచేసుకుంది. మౌలాలీ జెడ్‌టీసీ క్రాస్ రోడ్డు వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
కొత్తగా రెండు భారీ రైలు టెర్మినళ్లు
ఇరుకుగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా.. మౌలాలి, వట్టినాగులపల్లి స్టేషన్లలో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: అటు ఉత్తరాదికి, ఇటు దక్షిణాదికి కీలకంగా మారిన సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుఇరుకుగా మారడం. రైళ్లరద్దీ, ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్రరాజధానిలో మరో రెండు భారీ టెర్మినళ్లు నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్లో స్థానం కల్పించాలని కోరుతూ రైల్వేబోర్డుకు ప్రతిపాదనలను పంపింది. దాదాపు రూ.120 కోట్ల ఖర్చయ్యే ఈ పనులకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నిత్యం దాదాపు 210 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఈ స్టేషన్లో 10 ప్లాట్‌ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. నగరంలో కీలకంగా మారిన ఎంఎంటీఎస్ రైళ్లకు కూడా ఇవే శరణ్యం. దీంతో ప్లాట్‌ఫామ్స్ దొరికేవరకు పలు రైళ్లను మౌలాలి సహా ఇతర శివారు స్టేషన్లలో నిలిపివేస్తున్నారు. కొన్నింటినైతే సుమారు 40 నిమిషాలవరకు ఆపేస్తున్నారు. అందుకే కొత్త టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అవి పూర్తయితే ముఖ్యమైన రైళ్లను మాత్రమే సికింద్రాబాద్ వరకు రప్పిస్తారు. మిగతావాటిని కొత్తస్టేషన్లలోనే నిలిపేస్తారు. దీంతో సికింద్రాబాద్‌పై భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీటీవీలు... భద్రతదృష్ట్యా నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థతోకూడిన సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఈమేరకు నిర్ణయించారు. అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రాధాన్యక్రమంలో పనులు : జీఎం శ్రీవాస్తవ గతంలో మంజూరైన పనులు కూడా చాలావరకు పెం డింగ్‌లో ఉన్నందున ముఖ్యమైన వాటిని ప్రాధాన్యక్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ చెప్పారు. గురువారం ఆయన ప్రధాన విభాగాల అధికారులతో సమావేశమయ్యా రు. రూ.5490 కోట్లతో వివిధ దశల్లో ఉన్న 637 పను పెండింగ్ పనులు, ప్రతిపాదనలను సమీక్షించారు. -
ఫేస్బుక్ కామెంట్ తెచ్చిన తంటా..దంపతుల అరెస్టు
హైదరాబాద్: ఫేస్బుక్లో ఓ బాలిక చేసిన కామెంట్‌తో ఆగ్రహించిన దంపతులు సదరు బాలికపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీ సులు భార్యాభర్తలను అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఎస్ఐ జహంగీర్ కథనం ప్రకారం..కవాడిగూడకు చెందిన ఫిజియోథెరపిస్టు వేముల అనిల్‌కుమార్ (29), స్నేహ(23)లు భార్యాభర్తలు. వీరికి మూ డునెలల కిత్రం వివాహమైంది. స్నేహకు వరుసకు చెల్లెలయ్యే విద్యార్థిని (10) మౌలాలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఫేస్బుక్లో దంపతుల ఫొటోచూసిన సదరు విద్యార్థిని..అనిల్‌కుమార్ బాగాలేడంటూ కామెంట్ పోస్టింగ్ చేసింది. దీంతో పరువుపోయిందని భావించిన భార్యాభర్తలిద్దరూ ఈనెల 2న పాఠశాలకు వచ్చి విద్యార్థినిపై దాడిచేశారు. అంతేకాక, ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి నెట్లో ఉంచుతామని బెదిరించారు. శనివారం విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రహరీ కూలి ఎనిమిది మంది మృతి?