తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని మల్యాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని మల్యాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మౌలాలిలోని రాఘవేంద్రకాలనిలో నివాసముంటున్న స్వర్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో వెళ్లి శనివారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు తీసి, బీరువా పగలగొట్టి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 14 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.