హైదరాబాద్(నేరేడ్‌మెట్): కారును ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం హైదరబాద్‌లోని మౌలాలిలో చోటుచేసుకుంది. మౌలాలీ జెడ్‌టీసీ క్రాస్ రోడ్డు వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.