ఘట్‌కేసర్ నుంచి మౌలాలి వరకు కొత్త ట్రాక్
సాక్షి, ఘట్‌కేసర్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా 2వ దశలో సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదన చేశారు. 2013లో పనులు ప్రారంభించి మౌలాలి–ఘట్‌కేసర్ మధ్య ఉన్న 12.20 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. ఒప్పందం ప్రకారం కేంద్రం 1/3, రాష్ట్ర ప్రభుత్వం 2/3 నిధులతో పనులు చేపట్టాలి. గతంలో ఘట్‌కేసర్‌లో ఎంఎంటీఎస్ పనులు పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2018 డిసెంబర్ నాటికి ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కాని మూడేళ్లయినా ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకపోవడంతోనే ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యం అవుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.
ఘట్‌కేసర్‌లో ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం
నిరాశలో స్థానికులు..
ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం.. తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపుతారని భావించారు. ప్రజలు సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు దూరం ట్రాఫిక్ బాధను భరించలేక రైలు ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. బస్సులోనైతే గంటన్నర సమయం పడుతుండగా రైలులో కేవలం 35 నిమిషాల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకోవచ్చు.
చదవండి: కూతురి మరణం జీర్ణించుకోలేకే.. నిందితుడిని కాల్చి చంపారా?
ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి..
స్థానికంగా ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, కొత్త కాలనీలు వెలుస్తున్నందున ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో యంనంపేట్, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ పరిధిలో రైల్వే స్టేషన్లు ఏర్పడి రవాణ సౌకర్యం మెరుగు పడుతుంది. సంబంధిత అధికారులు స్పందించి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకులకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటలోకి తేవాలని కోరుతున్నారు.
ఎంఎంటీఎస్ బండి.. ఎంతకాలం ఆగాలండి.!
మేడ్చల్‌రూరల్: సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులు చేపట్టింది. ఈ పనులు చేపట్టి ఏళ్లు గడిచినా మేడ్చల్ ప్రజలకు నేటికి ఎంఎంటీఎస్ కల నెరవేరలేదు.
మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్ కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రాక్
సికింద్రాబాద్ – బొల్లారం – మేడ్చల్
సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. దీంతో మేడ్చల్ వరకు ప్రత్యేక రైల్యే ట్రాక్, విద్యుత్ లైన్, నూతన ప్లాట్‌ఫార్మ్ నిర్మాణ పనులను చేపట్టారు.
ప్రారంభం కాని రెండోదశ పనులు..
ఏళ్ల పాటు సాగిన పనులకు కరోనా అడ్డంకిగా మారింది. అదేవిధంగా అధికారుల అలసత్వం వల్ల నేటికి పనులు పూర్తి కాక మరింత ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు తొలగినా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటికి తోడు నిధుల లేమి కూడా కారణంగా మారడంతో ఎక్కడి పనులను అక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీకి వెళ్లి అనుమతి తెచ్చి..
మేడ్లల్ పట్టణంలోని మేడ్చల్ – గిర్మాపూర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ – గుండ్లపోచంపల్లి రోడ్డులో రైల్వే గేట్లు ఉండటంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్థాని క నేతలు అండర్‌పాస్‌ల ఏర్పాటు చేయాలని ఢిల్లీకి వె ళ్లి రైల్వేశాఖ మంత్రికి పరిస్థితిని వివరించారు. ఆయన ఆదేశాలతో అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment