'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..' | Hyderabad Ghatkesar Two Youth Leave Not Studying Well | Sakshi
Sakshi News home page

'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..'

Published Sun, Feb 26 2023 7:59 AM | Last Updated on Sun, Feb 26 2023 8:07 AM

Hyderabad Ghatkesar Two Youth Leave Not Studying Well - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అమ్మానాన్న క్షమించండి.. చదువులో వెనుకబడ్డాను.. నేను వెళ్లిపోతున్నాను.. మీ ఆశయాలను నెరవేర్చలేకపోతున్నాను.. అక్కను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ బీ ఫార్మసీ విద్యార్థి ఉరి వేసుకొని, అదే గదిలో అతడి స్నేహితుడు గుర్తుతెలియని మందుతాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ అశోక్‌రెడ్డి వివరాల ప్రకారం.. 

మేడ్చల్‌ మండలం ఘనాపూర్‌కు చెందిన తొంపాల నివాస్‌(19) చౌదరిగూడ విజయపురి కాలనీ ప్రిన్స్‌టన్‌ బీ ఫార్మసీ కళాశాలలో మూడో సంవత్సరం విద్యార్థి. స్థానిక ఎంజేఆర్‌ మాల్‌లో పనిచేసే భద్రాచలం కోరుకొండకు చెందిన గురుగుల సాయిగణేశ్‌(21) స్నేహితులు. వీరిద్దరూ కళాశాల సమీపంలో విజయపురి కాలనీలో ఓ అద్దె గదిలో ఉంటున్నారు. మొదటి ఏడాది కళాశాల వసతి గృహంలో ఉన్న నివాస్‌ అనంతరం అద్దె గదిలో స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. పరీక్షలో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు తరచూ స్నేహితులతో అంటుండేవాడు.

కాగా శనివారం కళాశాలకు వెళ్లకుండా ఇద్దరు స్నేహితులు గదిలోనే ఉన్నారు. నివాస్‌ కోసం స్నేహితులు వెళ్లిచూడగా గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా.. సాయి గణేశ్‌ వాష్‌రూంలో గుర్తు తెలియని మందు తాగి మృతి చెంది ఉన్నాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా నివాస్‌ జేబులో సూసైడ్‌ నోట్‌ లభించింది. 

చదువులో వెనుకబడ్డానని, తల్లిదండ్రులు క్షమించాలని అందులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. సాయిగణేశ్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. నివాస్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని మృతుడి సోదరుడు తెలిపాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి నివాస్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రేమ విఫలం, ఆరి్థక సమస్యలు, చదువులో వెనుకబడిపోవడం తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement