
సాక్షి, హైదరాబాద్: నగరంలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. మౌలాలీ ప్రాంతంలో ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానస్పందంగా ఉన్న వీరిని ఈనెల 23న విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనుషా, అన్నపూర్ణ, భవాని అనే ముగ్గురు మావోయిస్టులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు వారు ప్రకటించారు. ఇదివరకే వీరిపై పాడేరు పోలీస్ స్టేషన్‌లో పలుకేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారితో పాటు కుర్రా కామేశ్వరరావు అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వారు వీరేనా..
విశాఖలో సంచలనం రేపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము ఎన్‌కౌంటర్‌లో వీరి పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం రావాల్సిఉంది. మావోయిస్టు కీలక నేత రామకిృష్ణ (ఆర్‌కే) ఆధ్వర్యంలో పలు ఎన్‌కౌంటర్లలలో వీరు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో అనుషా దళకమాండర్‌గా పలు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో ముగ్గురు మావోయిస్టులు పట్టుపడటం సంచలనంగా మాదిన నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్టయింది.