Women Maoists
-
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వీరిని ఏరియా కమిటీ సభ్యురాలు(ఏసీఎం), భోరందేవ్ కమిటీ కమాండర్ సునీత, విస్తార్ దళానికి చెందిన ఏసీఎం సరితా ఖటియా మోచాగా గుర్తించారు. వీరిద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. వీరి వద్ద తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికిందన్నారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టుల అరెస్ట్
-
మౌలాలీలో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. మౌలాలీ ప్రాంతంలో ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానస్పందంగా ఉన్న వీరిని ఈనెల 23న విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనుషా, అన్నపూర్ణ, భవాని అనే ముగ్గురు మావోయిస్టులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు వారు ప్రకటించారు. ఇదివరకే వీరిపై పాడేరు పోలీస్ స్టేషన్లో పలుకేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారితో పాటు కుర్రా కామేశ్వరరావు అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు వీరేనా.. విశాఖలో సంచలనం రేపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము ఎన్కౌంటర్లో వీరి పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం రావాల్సిఉంది. మావోయిస్టు కీలక నేత రామకిృష్ణ (ఆర్కే) ఆధ్వర్యంలో పలు ఎన్‌కౌంటర్లలలో వీరు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో అనుషా దళకమాండర్‌గా పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో ముగ్గురు మావోయిస్టులు పట్టుపడటం సంచలనంగా మాదిన నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్టయింది. -
మహిళా మావోయిస్టు నాయకత్వంలో తొలి ఆపరేషన్!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పూర్తిగా ఓ మహిళ నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గతంలో ఎక్కడ ఏ ఆపరేషన్ నిర్వహించాలన్నా కేంద్ర కమిటీ లేదా జోనల్, ఏరియా కమిటీ బాధ్యుల నాయకత్వంలోనే జరిగేవి. అందులో పాల్గొనే మావోయిస్టుల్లో కూడా ఎక్కువమంది పురుషులే ఉండేవారు. మహిళా మావోయిస్టులు ఉన్నా నేరుగా వారే ఆపరేషన్‌లో పాల్గొన్న ఘటనలు లేవనే చెప్పాలి. మావోయిస్టు ఆపరేషన్‌లో 150 మంది! తాజా ఘటనలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది మహిళా మావోయిస్టులేనని ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. ఘటనలో 60 నుంచి 70 మంది పాల్గొన్నట్టు చెబుతున్నప్పటికీ ఈ ఆపరేషన్‌లో సుమారు 150 మందికి ఉన్నట్టు సమాచారం. వీరంతా గ్రూపులుగా విడిపోయి కదలికలను పసిగట్టేందుకు వేర్వేరు ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం. ఆజాద్ సోదరి అరుణ నేతృత్వం 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావిస్తున్నారు. అరుణ ఈ ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నప్పటికీ నేరుగా ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. -
ఆ మావోయిస్టులలో 70% మహిళలే!
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో దాడిచేసి, 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న మావోయిస్టులలో.. 70 శాతం మంది మహిళలే ఉన్నారట. భారీ స్థాయిలో ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో కూడిన 300-400 మంది వరకు మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని కాలాపత్తర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ భీకర దాడి మొదలైంది. గిరిజన ప్రాంతాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు రోడ్లు వేస్తున్న బృందానికి రక్షణగా వచ్చిన సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్‌లో 25 మంది మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయారు. మావోయిస్టులకు అనుకూలం చింతగుఫ - బుర్కపాల్ - భేజి ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టుంది. ఇక్కడ గతంలోనూ చాలా దాడులు జరిగి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. భౌగోళికంగా ఆ ప్రాంతం మావోయిస్టులకు అనుకూలంగా ఉంటుంది. రోడ్డు వేస్తున్న ప్రాంతం కొంత దిగువన ఉండటం.. ఎగువన గుట్టలు ఉండటంతో పైనుంచి దాడి చేసేవారికి ఆ గుట్టలు రక్షణగా ఉంటాయి. కింద ఉన్నవాళ్లు సులభంగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నివైపుల నుంచి కమ్ముకున్న మావోయిస్టులు హేండ్ గ్రనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులు చేసినట్లు తెలిసింది. నల్ల యూనిఫాంలు, అత్యాధునిక ఆయుధాలు ముందుగా తాము ఎంతమంది ఉన్నామో తెలుసుకోడానికి గ్రామస్తులను పంపారని, తర్వాత వచ్చినవారిలో ఎక్కువ మంది మహిళా మావోయిస్టులే ఉన్నారని వాళ్లంతా నల్లటి యూనిఫాంలు ధరించి ఏకే సిరీస్, అసాల్ట్ రైఫిళ్ల లాంటి అత్యాధునిక ఆయుధాలు తీసుకొచ్చారని గాయపడిన సీఆర్పీఎఫ్ జవాను ఒకరు చెప్పారు. ఇంతకుముందు సుక్మాకు పొరుగునే ఉన్న దంతేవాడ జిల్లాలో 2010 ఏప్రిల్ 96వ తేదీన జరిగిన దారుణమైన దాడిలో 75 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఒక ఛత్తీస్‌గఢ్ పోలీసు మరణించారు. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు పార్టీ కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గెమ్మెలి చంద్రమ్మ అలియాస్ అఖిలతో పాటు నలుగురు ఆర్ముడ్ మిలీషియా సభ్యులు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఎదుట శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో చంద్రమ్మతో పాటు లాసింగి మచ్చయ్య, కొర్రా లక్ష్మణరావు, కొర్రా సుబ్బారావు, తక్కిరి హెడెబీన్ ఉన్నారు. జీకే వీధి మండలం గూడెం పంచాయతీ, పెదఅగ్రహారం గ్రామానికి చెందిన చంద్రమ్మ 1998 నుంచి గాలికొండ, కోరుకొండ దళాల్లో సభ్యురాలిగా పనిచేసింది. ప్రస్తుతం కలిమెల ఏరియా కమిటీ మెంబర్(ఏసీఎమ్)గా ఉంది. పప్పులూరు దళం (ఒడిశా)లో ఆమె భర్త నాగేశ్వరరావు అలియాస్ సురేష్ పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే చంద్రమ్మకు తల్లిదండ్రులు ఒక తాగుబోతుతో పెళ్లి చేసేం దుకు ప్రయత్నించడంతో మొదలైన ప్రతిఘటన ఆమెను మావోయిస్టు ఉద్య మం వైపు నడిపించింది. 2005లో భర్తతో పాటు చంద్రమ్మను ఒడిశా పోలీసులు అరె స్టు చేశారు. 2007లో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రమ్మ...టెకుపోదార్‌లో టైలరుగా పనిచేస్తూ మావో యిస్టుల దుస్తులు కుట్టేది. అక్కడ పోలీసుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో భయపడి స్వ గ్రామం పెదఅగ్రహారం వచ్చేసింది. ఇక్కడ కూడా పోలీ సులు అరెస్టు చేస్తారనే భయంతో స్వచ్ఛందంగాలొంగిపోయింది. చింతపల్లి మండలం బల పం పంచాయతీ, ఎగువలసపల్లి గ్రామానికి చెందిన లాసింగి మచ్చయ్య కోరుకొండ దళంలో ఆర్ముడ్ మిలీషియా సభ్యునిగా పనిచేస్తున్నాడు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ, సరియావీధి గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మణరావు అలియాస్ విన్‌జు, కొర్రా సుబ్బారావు పెదబయలు దళంలో ఆర్ముడ్ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. -
బస్తర్‌లో ఖాకీ రాజ్యం
-
బస్తర్‌లో ఖాకీ రాజ్యం
హక్కుల ఊసెత్తితే జైలే! ⇒ ఛత్తీస్‌గఢ్ జైల్లో మూడు నెలలుగా తెలంగాణ హక్కుల నేతల బృందం ⇒ ఎన్కౌంటర్లు, అత్యాచారాలపై నిజనిర్ధారణ కోసం పయనం.. ⇒ భద్రాచలంలోనే అరెస్ట్.. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగింత! సాక్షి నాలెడ్జ్ సెంటర్: తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు హక్కుల కార్యకర్తలు గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్ జైల్లో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్)కు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24న ఛత్తీస్‌గఢ్ బయల్దేరింది. అయితే 26వ తేదీన వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్బంధించారు. మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న ఆరోపణలతో కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించి సుక్మా జైలుకు పంపింది. బెయిల్ దరఖాస్తులనూ తిరస్కరించింది. జనవరిలో కూడా వారి బెయిల్ దరఖాస్తులను దంతెవాడ జిల్లా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఎఫ్ఐఆర్ నకలు కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న వస్తువుల వివరాలు, పంచనామా నివేదికలు కానీ డిఫెన్స్ న్యాయవాదులకు ఇవ్వలేదు. ప్రస్తుతం హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. ఎవరు వారు? ఛత్తీస్‌గఢ్ జైల్లో ఉన్నవారిలో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ (36), ఆదివాసీ తుడుం దెబ్బ ఖమ్మం కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య (45), హైదరాబా ద్‌కు చెందిన పాత్రికేయులు బి.ప్రభాకర్ రావు (52), రాజేంద్రప్రసాద్ (28), హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్‌రావు (48), బి.రవీంద్రనాథ్ (42), ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మొహమ్మద్ నిజాం ఉన్నారు. నిజానికి.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఈ బృందాన్ని 25న భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం గ్రామంలో తెలంగాణ పోలీసులే నిర్బంధించారని, తర్వాత వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించారని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. వీరు ఏడుగురూ మావోయిస్టు పార్టీకి సాయం చేస్తున్నారని, వాళ్లు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, రూ.లక్ష విలువైన రద్దు చేసిన నోట్లు, మొబైల్ ఫోన్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆరోపించారు. నక్సలైట్ల కోసం పాత కరెన్సీని మార్చి ఇస్తున్నారని, మావోయిస్టులకు సాయం చేయాలని స్థానికులపై ఒత్తిడి తెస్తు న్నారని అభియోగాలు మోపారు. బస్తర్‌లో హక్కుల గురించి మాట్లాడినా, అత్యాచారాల గురించి కథనాలు రాసినా.. హక్కుల నేతలు, పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపడం పరిపాటిగా మారిందని పలు సంఘటనలను ఉదహరిస్తూ కేంద్ర మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టులకు కూడా లేఖలు రాశాయి. ప్రొఫెసర్లు, జర్నలిస్టులకు వేధింపులు డిసెంబర్ మొదటి నెలలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ అర్చనాప్రసాద్ తదితరులపై సుక్మా జిల్లాలో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నవంబర్ 4న రాష్ట్రంలో హత్యకు గురైన ఒక గిరిజనుడి భార్య ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బస్తర్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నందినీ సుందర్ ఎంతో కాలంగా హక్కుల విషయాలపై పని చేస్తున్నారు. ఆమె వేసిన పిటిషన్ వల్లనే మావోయిస్టు వ్యతిరేక సాల్వాజుడుంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ బినాయక్‌సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త సుకుల్ ప్రసాద్ బార్సే, గిరిజన కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన సోనీ సోరి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాలినీ సుబ్రమణ్యం, టీవీ విలేకరి ప్రభాత్సింగ్, పత్రిక విలేకరి దీపక్ జైశ్వాల్‌లను కూడా పోలీసులు ఇలాగే వేధించారు. కొందరు పాత్రికేయులు పోలీసుల కేసులు, వేధింపులకు భయపడి ఆ ప్రాంతాలను వీడి వెళ్లిపోయారు. 13 ఏళ్ల బాలుడి ‘ఎన్కౌంటర్’ కేసు కిందటేడాది ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ‘ఎన్కౌంటర్’లలో 134 మంది చనిపోయారు. ఆ బలగాలు లైంగిక హింసకు పాల్పడిన మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. టీడీఎఫ్ నిజనిర్ధారణ పర్యటనలో భాగంగా.. బీజాపూర్ జిల్లా మెటపల్ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు సోమారు పొట్టం ‘ఎన్కౌంటర్’ ఘటనను కూడా పరిశీలించనుంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు డిసెంబర్ 16న ఈ బాలుడిని పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్పూర్ హైకోర్టులో బాలుడి తండ్రి పిటిషన్ వేశారు. అతడిని పోలీసులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, గ్రామస్తులందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని బిలాస్పూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డిసెంబర్ 25, 26 తేదీల్లో శవపరీక్ష చేశారు. ఈ కేసులో నిజనిర్ధారణ చేయనున్న టీడీఎఫ్ బృందాన్ని ముందుగానే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే జగదల్పూర్ న్యాయ సహాయ బృందానికి చెందిన శాలినీ గేరా అనే న్యాయవాది.. మావోయిస్టులకు రూ.10 లక్షల కొత్త నోట్లు మార్చి ఇచ్చారని, దంతెవాడ అడవుల్లో ఆమె మావోయిస్టులను కలిసినట్లు తమకు ఫిర్యాదు అందిందంటూ బస్తర్ ఎస్పీ ఆర్.ఎన్.దాష్ ఆరోపించారు. ఈ మేరకు ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. ఆమె గదిని సోదా చేయాలని, విచారణకు స్టేషన్‌కు రావాలని బెదిరించారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. పోలీసుల చేతుల్లో హతమైన 13 ఏళ్ల బాలుడి ఎన్‌కౌంటర్‌పై అతడి తల్లిదండ్రుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవ్యాది కావడం గమనార్హం! ఛత్తీస్‌గఢ్‌లో మహిళా మావోయిస్టుల ర్యాలీ మల్కన్‌గిరి: మహిళా దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా అడవిలో బుధవారం మహిళా మావోయిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు చెందిన సభ్యులు స్థానిక గిరిజన మహిళలతో కలిసి భారీగా ప్రదర్శన నిర్వహించారు. మహిళలు హక్కుల కోసం పోరాడాలని, గిరిజన మహిళల్లో చైతన్యం రావాలని వారు కోరారు. ఈ సందర్భంగా జననాట్యమండలి ఆధ్వర్యంలో గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆత్మరక్షణ విధానాలపై వారికి అవగాహన కల్పించారు. -
గాజర్ల రవి తప్పించుకున్నాడా?
12 మంది మహిళా మావోయిస్టులు మృతి మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: ఎన్ కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడా? లేక తప్పించుకున్నాడా? అన్న అంశంపై స్పష్టత కొరవడింది. ఇటు పోలీసులు కానీ, అటు మావోయిస్టుల వైపు నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన మల్కన్‌గిరి, విశాఖపట్నం ఎస్పీలు కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోమవారం ఉదయం రవి మరణించాడనే ప్రచారం సాగింది. దీంతో మల్కన్ గిరి జిల్లాలో కలకలం రేగింది. అయితే కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారని, సురక్షితంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరో 4 మృతదేహాలు లభ్యం ఎన్కౌంటర్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. సంఘటన ప్రాంతంలో గాలిస్తున్న కూంబింగ్ దళాలకు మంగళవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉంది. దీంతో ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళల సంఖ్య 12కు చేరింది. మావోయిస్టు నేత మురళి మృతదేహాన్ని అతని కుమారుడికి అప్పగించారు. ఇంకా 14 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. వీటిలో ఎక్కువ మృతదేహాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులవిగా పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని, ఎన్కౌంటర్ జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన మావోయిస్టులు అడవిలో ప్రాణాలు వదిలే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అంటున్నారు. మరో ఎన్కౌంటర్! ఎన్ కౌంటర్ జరిగిన అడవుల్లో ఏపీ డీజీపీ సాంబశివరావు మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. మంగళవారం లభించిన నాలుగు మృతదేహాల విషయంలో డీజీపీ కథనం మరోలా ఉంది. సోమవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోలు మంగళవారం కూడా కాల్పులు జరిపారని, పోలీసులు అప్రమత్తమై ఎదుర్కోవడంతో మరో నలుగురు మావోలు మృతి చెందారని చెప్పారు. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.40 లక్షల ప్రత్యేక పరిహారాన్ని (స్పెషల్ ఎక్స్‌గ్రేషియా) అందజేసింది. గుర్తించిన మృతుల వివరాలు.. 1. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అలియాస్ ప్రసాద్ (ఎస్జేసీఎం, ఈస్ట్ విశాఖ, బాకూరు విలేజ్, విశాఖ జిల్లా) 2. శ్యామల కిష్టయ్య అలియాస్ దయ, (ఎస్జేసీఎం, కోరాపుట్ /శ్రీకాకుళం డివిజన్ సెక్రటరీ) 3. ఐనాపర్తి దాసు అలియాస్ మధు (డీజీఎం, టెక్‌టీం, వెస్ట్ గోదావరి) 4. గెమ్మెలి కేశవరావు అలియాస్ బిస్రు (డీసీఎస్, ఫస్ట్ సీఆర్టీ, తాడపాలెం, విశాఖ జిల్లా) 5. లత అలియాస్ పద్మ, (డీసీఎం, వైఫ్ ఆఫ్ మహేందర్, ఎస్‌జెడ్‌సీఎం, హైదరాబాద్) 6. రాజేష్ అలియాస్ సీమల్ (డీసీఎం, ఫస్ట్ సీఆర్సీ, సీజీ) 7. బొట్టు తుంగనాలు అలియాస్ మమత (డీజీఎం, వైఫ్ ఆఫ్ సురేష్, ఎస్‌జెడ్‌సీఎం ఆఫ్ శ్రీకాకుళం జిల్లా) 8. ఎమలపల్లి సింహాచలం అలియాస్ మురళి, అలియాస్ హరి (డీసీఎం, విజయనగరం) 9. స్వరూప అలియాస్ రిక్కి, (డీసీఎం, ఎక్స్ ఆర్టీసీ కండక్టర్, తూర్పు గోదావరి జిల్లా) 10. శ్వేత, ఏసీఎం, పెదబయలు ఏరియా 11. బుద్రి, ఏసీఎం, ఆర్కే సెక్యూరిటీ గార్డ్ 12. మున్నా, ఆర్కే కుమారుడు, 13. రైనో, డీసీఎం 14. కిల్లో సీత, సప్లై టీం మెంబర్, చింతపల్లి డివిజన్, విశాఖపట్నం జిల్లా -
మహిళా మావోయిస్టుల అరెస్ట్ : కీలకసమాచారం సేకరణ
భువనేశ్వర్: ఒడిశా పోలీసులు ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం సేకరించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండా కోసం పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. సీపీఐ (మావోయిస్టు) ఒడిశా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శిగా పనిచేసిన పాండా అవకాశవాదంతో వ్యవహరిస్తూ, విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఇటీవల అతనిని ఆ పార్టీ బహిష్కరించింది. ఇదిలా ఉండగా, సవ్యసాచి పాండా సీపీఐ (మావోయిస్టు)ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అవకాశవాదంతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తాను ఇప్పటికే ఒడిశా మావోవాది పార్టీ (ఓఎంపీ) పేరిట కొత్త సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు.