భువనేశ్వర్: ఒడిశా పోలీసులు ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం సేకరించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండా కోసం పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. సీపీఐ (మావోయిస్టు) ఒడిశా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శిగా పనిచేసిన పాండా అవకాశవాదంతో వ్యవహరిస్తూ, విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఇటీవల అతనిని ఆ పార్టీ బహిష్కరించింది.
ఇదిలా ఉండగా, సవ్యసాచి పాండా సీపీఐ (మావోయిస్టు)ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అవకాశవాదంతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తాను ఇప్పటికే ఒడిశా మావోవాది పార్టీ (ఓఎంపీ) పేరిట కొత్త సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు.
మహిళా మావోయిస్టుల అరెస్ట్ : కీలకసమాచారం సేకరణ
Published Sun, Mar 2 2014 5:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement