
సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్న జనం
న్యూఢిల్లీ: అహింస, మద్యపానం నిషేధం కోసం జీవితాంతం పోరాటం సాగించిన జాతిపితి మహాత్మాగాంధీ చిత్రం రష్యా బీర్ క్యాన్‌పై ప్రత్యక్షమైంది. రష్యాకు చెందిన రివార్ట్ అనే బీర్ బ్రాండ్‌పై మహాత్ముడి ఫొటోతోపాటు ఆయన సంతకాన్ని సైతం ముద్రించారు. సదరు కంపెనీ తీరపై సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ క్యాన్ చిత్రాలను మాజీ ముఖ్యమంత్రి నందిని శతపథి మనవడు సుపర్నో శతపథి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ విషయాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లాలని, బీర్ క్యాన్‌పై గాం«దీజీ ఫొటో తొలగించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మద్యపాన వ్యతిరేకి అయిన గాంధీజీ చిత్రాలన్ని బీర్ క్యాన్ ముద్రించి అమ్ముకోవడం తనకు ఆవేదనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ‘మీ మిత్రుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం చేరవేయండి, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోండి’అని మోదీని కోరారు. సుపర్నో శతపథి షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది దీనిపై స్పందించారు. రష్యా బీర్ కంపెనీ తీరును తప్పుపట్టారు.