beer factory
-
రష్యా బీర్ క్యాన్‌పై మహాత్ముడి చిత్రం
న్యూఢిల్లీ: అహింస, మద్యపానం నిషేధం కోసం జీవితాంతం పోరాటం సాగించిన జాతిపితి మహాత్మాగాంధీ చిత్రం రష్యా బీర్ క్యాన్‌పై ప్రత్యక్షమైంది. రష్యాకు చెందిన రివార్ట్ అనే బీర్ బ్రాండ్‌పై మహాత్ముడి ఫొటోతోపాటు ఆయన సంతకాన్ని సైతం ముద్రించారు. సదరు కంపెనీ తీరపై సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ క్యాన్ చిత్రాలను మాజీ ముఖ్యమంత్రి నందిని శతపథి మనవడు సుపర్నో శతపథి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లాలని, బీర్ క్యాన్‌పై గాం«దీజీ ఫొటో తొలగించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మద్యపాన వ్యతిరేకి అయిన గాంధీజీ చిత్రాలన్ని బీర్ క్యాన్ ముద్రించి అమ్ముకోవడం తనకు ఆవేదనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ‘మీ మిత్రుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం చేరవేయండి, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోండి’అని మోదీని కోరారు. సుపర్నో శతపథి షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది దీనిపై స్పందించారు. రష్యా బీర్ కంపెనీ తీరును తప్పుపట్టారు. -
వెలుగులోకి వేల ఏళ్ల నాటి బీర్ ఫ్యాక్టరీ
కైరో : ఈజిప్ట్‌లోని పురావస్తు శాఖకు చెందిన ఓ ప్రముఖ ప్రదేశంలో అత్యంత పురాతన బీర్ ఫ్యాక్టరీ ఒకటి బయటపడింది. అమెరికా-ఈజిప్ట్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ ఫ్యాక్టరీ వెలుగుచూసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు అధికారులు. దేశ రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలో ఎబిడాస్‌లో.. నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో ఈ ఫ్యాక్టరీని కనుగొన్నారు. ఆ బీర్ ఫ్యాక్టరీ నర్మర్ చక్రవర్తి కాలానికి చెందిన గుర్తించారు. ఫ్యాక్టరీలో మొత్తం 8 యూనిట్లు.. ఒక్కో యూనిట్ ఇరవై మీటర్లు పొడవుతో, 2.5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ( షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి..) బీర్ ఫ్యాక్టరీ కుండలు ఒక్కో యూనిట్లో దాదాపు 40 కుండలు రెండు వరుసలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కుండలలో బీర్ తయారు చేయటానికి అవసరమైన పదార్థాలను వేసి, మరిగించేవారు. రాజ కార్యక్రమాల కోసం బీరును ఉపయోగించేవారు. కాగా, బీరు ఫ్యాక్టరీ ఉనికిని మొట్టమొదటిసారిగా 1900లలో బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ, ఫ్యాక్టరీ ఎక్కడ ఉందన్న సంగతి చెప్పలేకపోయారు. -
బీరు పరిశ్రమలో అగ్ని ప్రమాదం
మెదక్: బీరు పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం మాల్కాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. మాల్కాపూర్లోని ఓ బీరు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగింది.