ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. చాలామంది, వెహికల్ ఇన్సూరెన్స్ (Vehicle Insurance) తీసుకోకుండా కార్లను వినియోగిస్తుంటారు. అలాంటి వారివల్ల ప్రమాదాలు జరిగితే.. ఆ ప్రభావం ఇతరుల మీద కూడా పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒడిశా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఓ కొత్త రూల్ తీసుకు వచ్చింది. ఇది తప్పకుండా వాహనదారులు తమ కార్లకు ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తుందని సమాచారం.
వెహికల్ ఇన్సూరెన్స్ లేని, ఏ వాహనమైన టోల్ గేట్ దాటితే.. అలాంటి వాహనదారులకు ఈ చలాన్ జారీ చేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియమం 2025 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. తప్పకుండా ఈ విషయాన్ని వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాలి.
కారు ఇన్సూరెన్స్ లేకుంటే..
టోల్ గేట్‌లపై అమర్చిన ఈ-డిటెక్షన్ సిస్టమ్‌ల ద్వారా.. ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తిస్తారు. అలాంటి వాహనాలకు ఆటోమాటిక్ చలాన్ జారీ చేస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి టోల్ గేట్ దాటితే వారికు రూ. 2,000 జరిమానా విధిస్తారు. ఇదే రెండోసారి పునరావృతమైతే.. వారు రూ. 4,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా కాకుండా.. మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చలానా, జైలు శిక్ష రెండూ పడొచ్చు. కాబట్టి 1988లోని సెక్షన్ 146 ప్రకారం.. పబ్లిక్ రోడ్లపై నడిచే ప్రతి మోటారు వాహనం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.
ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్
ప్రైవేట్, వాణిజ్య వాహనాలు చెల్లుబాటు అయ్యే బీమా లేకుండా రోడ్లపై నడుపుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకుని ఒడిశా (Odisha) స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కొత్త రూల్ కింద ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది.
నిజానికి ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ అనేది కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం, బీహార్ ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలను గుర్తించేందుకు.. రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాలలో ఈ-డిటెక్షన్ సిస్టమ్‌ను ప్రారంభించింది. పీయూసీ లేకుండా పట్టుబడితే.. వాహనానికి రూ. 10వేలు జరిమానా విధిస్తారు. ఈ సిస్టం ట్రయల్స్ ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లోనే 5,000కు పైగా ఈ చలాన్‌లు జారీ చేశారు. కాబట్టి ఇదే సిస్టం త్వరలో.. పాట్నా, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్, ఇతర స్మార్ట్ సిటీలలో కూడా ప్రారంభించనున్నట్లు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.
త్వరలో ఇతర రాష్ట్రాలకు..
ప్రస్తుతం ఈ డిటెక్షన్ సిస్టం కేవలం ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉంది. ఈ విధానం త్వరలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సిస్టం ప్రారంభమైతే.. జరిమానాలు లేదా జైలు శిక్షకు భయపడి వాహనదారులు తప్పకుండా నియమానాలకు అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము.
టోల్ కలెక్షన్ కోసం శాటిలైట్ విధానం
మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.
ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ గతంలోనే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment