సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు పార్టీ కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గెమ్మెలి చంద్రమ్మ అలియాస్ అఖిలతో పాటు నలుగురు ఆర్ముడ్ మిలీషియా సభ్యులు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఎదుట శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో చంద్రమ్మతో పాటు లాసింగి మచ్చయ్య, కొర్రా లక్ష్మణరావు, కొర్రా సుబ్బారావు, తక్కిరి హెడెబీన్ ఉన్నారు. జీకే వీధి మండలం గూడెం పంచాయతీ, పెదఅగ్రహారం గ్రామానికి చెందిన చంద్రమ్మ 1998 నుంచి గాలికొండ, కోరుకొండ దళాల్లో సభ్యురాలిగా పనిచేసింది.
ప్రస్తుతం కలిమెల ఏరియా కమిటీ మెంబర్(ఏసీఎమ్)గా ఉంది. పప్పులూరు దళం (ఒడిశా)లో ఆమె భర్త నాగేశ్వరరావు అలియాస్ సురేష్ పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే చంద్రమ్మకు తల్లిదండ్రులు ఒక తాగుబోతుతో పెళ్లి చేసేం దుకు ప్రయత్నించడంతో మొదలైన ప్రతిఘటన ఆమెను మావోయిస్టు ఉద్య మం వైపు నడిపించింది. 2005లో భర్తతో పాటు చంద్రమ్మను ఒడిశా పోలీసులు అరె స్టు చేశారు. 2007లో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రమ్మ...టెకుపోదార్‌లో టైలరుగా పనిచేస్తూ మావో యిస్టుల దుస్తులు కుట్టేది.
అక్కడ పోలీసుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో భయపడి స్వ గ్రామం పెదఅగ్రహారం వచ్చేసింది. ఇక్కడ కూడా పోలీ సులు అరెస్టు చేస్తారనే భయంతో స్వచ్ఛందంగాలొంగిపోయింది. చింతపల్లి మండలం బల పం పంచాయతీ, ఎగువలసపల్లి గ్రామానికి చెందిన లాసింగి మచ్చయ్య కోరుకొండ దళంలో ఆర్ముడ్ మిలీషియా సభ్యునిగా పనిచేస్తున్నాడు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ, సరియావీధి గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మణరావు అలియాస్ విన్‌జు, కొర్రా సుబ్బారావు పెదబయలు దళంలో ఆర్ముడ్ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు.