హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో ఓ బాలిక చేసిన కామెంట్‌తో ఆగ్రహించిన దంపతులు సదరు బాలికపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీ సులు భార్యాభర్తలను అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఎస్‌ఐ జహంగీర్ కథనం ప్రకారం..కవాడిగూడకు చెందిన ఫిజియోథెరపిస్టు వేముల అనిల్‌కుమార్ (29), స్నేహ(23)లు భార్యాభర్తలు. వీరికి మూ డునెలల కిత్రం వివాహమైంది.
స్నేహకు వరుసకు చెల్లెలయ్యే విద్యార్థిని (10) మౌలాలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఫేస్‌బుక్‌లో దంపతుల ఫొటోచూసిన సదరు విద్యార్థిని..అనిల్‌కుమార్ బాగాలేడంటూ కామెంట్ పోస్టింగ్ చేసింది. దీంతో పరువుపోయిందని భావించిన భార్యాభర్తలిద్దరూ ఈనెల 2న పాఠశాలకు వచ్చి విద్యార్థినిపై దాడిచేశారు. అంతేకాక, ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి నెట్‌లో ఉంచుతామని బెదిరించారు. శనివారం విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫేస్‌బుక్ కామెంట్ తెచ్చిన తంటా..దంపతుల అరెస్టు
Published Sun, Oct 6 2013 9:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement