
సాక్షి, హైదరాబాద్ : భర్త కొట్టాడని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. వైద్యం కోసం పోలీసులు నిర్లక్ష్యంగా ఆమెను ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రి పంపించడంతో.. కీచకులు బాధితురాలిపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. భర్త తనను కొట్టాడంతో ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది.
ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైద్యం కోసం బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లడంతో.. అక్కడ తనపై వార్డ్‌బాయ్ నాగరాజు, హోంగార్డ్ ఒమర్ లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment