ఈ స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, వివిధ రకాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. ఇతనికి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న సాహిల్ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సత్యప్రకాశ్ అనే వ్యక్తి మనీష్, అనిల్‌ల వద్ద నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లను, ల్యాప్‌టాప్‌ను, ప్రింటర్లను, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన సాహిల్ ను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. శిల్ప, హరీశ్ పరారీలో ఉండగా మనీష్, అనిల్, సత్యనారాయణలను రిమాండ్‌కు తరలించారు.
నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
Published Sat, Aug 8 2015 7:01 PM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
అఫ్జల్‌గంజ్: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ సి. అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మనీష్ (35), సాహిల్ (34) వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి, ఒక్కోటి రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నారు. మనీష్ కాచిగూడలో ఉంటూ ఉస్మాన్‌గంజ్‌లో రత్న స్టడీ సొల్యూషన్స్ పేరిట ఓ స్టడీ సెంటర్‌ను నెలకొల్పాడు. ఇందులో చైతన్యపురికి చెందిన అనిల్, శిల్ప, హరీశ్ పని చేస్తున్నారు.

Advertisement
Advertisement