![Anti Valentine Week why it is Celebrated Know About These 7 Days](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Anti-Valentine-Week.jpg.webp?itok=EmKbs0kg)
‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అని పాడుకుంటూ ప్రేమికులు నిన్నటివరకూ వాలంటైన్స్ వీక్‌ను ఎంతో అద్భుతంగా చేసుకున్నారు. అయితే దీనికి భిన్నంగా భగ్నప్రేమికులు వాలంటైన్స్ వీక్‌లో ఆక్రోశానికి,ఆవేదనకు గురయ్యుంటారు. అందుకే వారంతా నేటి నుంచి (ఫిబ్రవరి15)నుంచి వారం రోజుల పాటు యాంటీ-వాలెంటైన్ వీక్‌ను ఉత్సహంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి.. ఈ వారం రోజుల్లో వారు ప్రేమను ద్వేషిస్తూ ఏమేంపనులు చేస్తారంటే..
యాంటీ-వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15 నుండి మొదలవుతుంది. ఫిబ్రవరి 21 వరకు భగ్నప్రేమికులు ఒక్కోరోజును ఒక్కోథీమ్‌తో జరుపుకుంటారు. ఇలా చేయడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. వాలెంటైన్స్ వీక్‌లో ప్రేమను పొందలేని వారు, మనసు విరిగిపోయిన వారు ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుని తమలోని దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే మొదలైన థీమ్‌లతో ఒక్కోరోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/02_51.jpg)
స్లాప్ డే
యాంటీ-వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 15న స్లాప్ డే జరుపుకుంటారు. మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిని మరచిపోయేందుకు స్లాప్ డే జరుపుకుంటారు. ప్రేమలో మోసపోయినవారు తమ ఒత్తిడిని, దుఃఖాన్ని మరచిపోయేందుకు స్లాప్ డే చేసుకుంటారు. చేదు జ్ఞాపకాలు, చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు స్టాప్‌డే సహకరిస్తుందని భగ్నప్రేమికులు చెబుతుంటారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/03_44.jpg)
కిక్ డే
యాంటీ-వాలెంటైన్ వీక్‌లో రెండవ రోజు కిక్ డే. దీనిని ఫిబ్రవరి 16న కిక్ డే జరుపుకుంటారు. మాజీ జీవిత భాగస్వామితో వచ్చిన చేదు జ్ఞాపకాలను జీవితం నుండి తరిమికొట్టే మార్గంగా కిక్‌డేను జరుపుకుంటారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/04_29.jpg)
పెర్ఫ్యూమ్ డే
పెర్ఫ్యూమ్ డే ఫిబ్రవరి 17న వస్తుంది. ఈ రోజున భాగస్వామి మిగిల్చిన పాత జ్ఞాపకాలను మరిపోయి, కొత్తగా మలుచుకునేందుకు ఇష్టమైన పెర్ఫ్యూమ్‌ను అప్లై చేసుకుంటారు.
ఫ్లర్ట్ డే
యాంటీ-వాలెంటైన్ వీక్‌లోని నాల్గవ రోజున ఫ్లర్ట్ డే జరుపుకుంటారు. ఈ రోజున తెగిపోయిన బంధాలను పక్కనపెట్టి, కొత్త స్నేహాలను ప్రారంభిస్తారు. ఫ్లర్ట్ డేను ఎవరికీ హాని చేయని విధంగా జరుపుకోవాలని పలువురు సూచిస్తుంటారు.
కన్ఫెషన్ డే
దీనిని ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. ఈ రోజున భగ్నప్రేమికులు గతాన్ని మరచిపోయి స్నేహితుడు, లేదా స్నేహితురాలికి క్షమాపణలు చెబుతారు. భవిష్యత్తులో అలాంటి తప్పు పునరావృతం చేయనని హామీనిస్తారు.
మిస్టింగ్ డే
ఇది ఫిబ్రవరి 20న వస్తుంది. ఎవరినైనా మిస్ అవుతుంటే ఆ విషయాన్ని ఆరోజున వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తారు. మిస్ అవుతున్న ప్రియుడు లేదా ప్రియురాలికి ఫోన్ చేసి, మనసులోని భారాన్నంతా దించుకునే ప్రయత్నం చేస్తారు.
బ్రేకప్ డే
ఫిబ్రవరి 21న బ్రేకప్ డే జరుపుకుంటారు. ఎవరితోనైనా సంబంధం ఇక కొనసాగించలేనని అనిపిస్తే వారికి ఆరోజున బ్రేకప్ చెబుతారు. సంతోషంగా లేని సంబంధం కొనసాగించకూడదనే ఉద్దేశంతో బ్రేకప్ డేను జరుపుకుంటారు. బ్రేకప్ డే తరువాత విడిపోయిన ప్రేమికులు సానుకూలంటా ఉంటూ, ముందుకు సాగాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు
Comments
Please login to add a commentAdd a comment