Valantains Day
-
కౌగిలింత ఎందుకు? పసివాళ్లను హగ్ చేసుకుంటే ఏమొస్తుంది?
ప్రేమికులకు వాలెంటైన్ వీక్‌లోని ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనదే. ఫిబ్రవరి 12ను వాలెంటైన్ వీక్‌లో ‘హగ్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు మాత్రమే కాదు.. ఆప్యాయతను అందుకునేవారంతా తమకు ఇష్టమైనవారిని కౌగిలించుకోవాలని, తమ మనసులోని భావాలను వారితో పంచుకోవాలని చెబుతుంటారు. ఇంతకీ కౌగిలింతతో వచ్చే లాభాలేమితో ఇప్పడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఒక వైపు పని భారం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, దీనికితోడు ఎన్నో సమస్యలు.. వీటన్నింటి మధ్య మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు. అలాంటి సమయంలో కౌగిలింత (హగ్) అనేది ఒక అద్భుత వరమని, అది ప్రశాంతతకు దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి మాయం కావలించుకోవడమనేది ఒక మంచి ఫీలింగ్‌ని కలిగిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు సన్నిహితులను కావలించుకుంటే మనసుకు ఓదార్పు లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందుకే మీరు పార్ట్నర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు మీ ఆప్యాయమైన కౌగిలింత అందించి, వారి ఒత్తిడిని దూరం చేయడంతోపాటు మీలోని ఒత్తిడిని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. బరువు తగ్గడంలోనూ.. బరువు పెరగడానికి గల కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. టెన్షన్, పని ఒత్తిడి రోజూ అందరికీ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో కొందరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఆత్మీయుల కౌగిలింత వారిలోని ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. తద్వారా వచ్చే రిలాక్సేషన్ బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. 10 సెకన్ల కౌగిలింత అనేక సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుకు వైద్యం మనకు ఆప్యాయతను అందించేవారిని 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే మనలోని ఒత్తిడి తగ్గి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. అందుకే బీపీ కంట్రోల్లో ఉండాలనుకుంటే ఆత్మీయులను కౌగిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసివాళ్లను హగ్ చేసుకుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తన దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. దీంతో ఆ తల్లి అప్పటి వరకూ పడిన నొప్పులన్నింటినీ మరచిపోతుంది. అలాగే తల్లి కౌగిలింత పిల్లలకు సురక్షితంగా ఉన్నామనే భరోసానిస్తుంది. అది వారు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహద పడుతుంది. ఇదేవిధంగా పసివాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎవరికైనా సరే మనసుకు స్వాంతన లభిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. -
ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడనుకున్నా: హీరో నిఖిల్ భార్య
యంగ్ హీరో నిఖిల్ ఏడాది క్రితం తన ప్రేయసి పల్లవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత లాక్డౌన్ 2020 డిసెంబర్లో నిఖిల్-పల్లవిల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిఖిల్-పల్లవిలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లి అనంతరం భార్యతో కలిసి ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు నిఖిల్. చదవండి: మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్ ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) వాలంటైన్స్ డే సందర్భంగా నిఖిల్ తన భార్య, డాక్టర్ పల్లవితో కలిసి తొలిసారి మీడియాకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఈ లవ్లీ కపుల్స్ సాక్షి టీవీతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ డాక్టర్-యాక్టర్ మధ్య అసలు ప్రేమ ఎలా మొదలైందో మీరు కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. -
వాలంటైన్స్ డే: స్పెషల్ సర్‌ప్రైజస్!
ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా సోమవారం ప్రేమతో పలు అప్డేట్స్ ఇచ్చాయి ఆయా చిత్రబృందాలు. ఒకరు సాంగ్‌తో సర్ప్రైజ్ చేస్తే, మరొకరు టీజర్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకొకరు ప్రేయసి లుక్స్‌ను రివీల్ చేశారు. ఇలా ఎవరికి వీలైనట్లు వారు ప్రేమికుల రోజున అప్డేట్స్తో ఆడియన్స్‌కు లవ్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఈ బహుమతుల తాలూకు వివరాల్లోకి మీరూ ఓ లుక్కేయండి. ‘‘పిల్లలూ పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్కి డేట్ ఫిక్స్ చేశాం’ అంటూ ‘ఎఫ్ 3’ టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మే 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించారు. పిల్లలు పరీక్షలు ముగించుకోండి🤩 పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి🔥 ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం!🔐 No change in date Anymore! 😎 Most Awaited FUN Franchise ➡️ #F3Movie ON MAY 27th🥳#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/PTjLnKvQbF — Sri Venkateswara Creations (@SVC_official) February 14, 2022 ఇక ఈ ప్రేమికుల రోజున డాక్టరు ప్రేరణకు ప్రపోజ్ చేశాడు విక్రమాదిత్య. ‘రాధేశ్యామ్’ చిత్రంలోని సీన్ ఇది. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. కె. రాధాకృష్ణ ్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఇక సిల్వర్ స్క్రీన్‌పై తన కొత్త ప్రేయసి ఎవరనేది అధికారికంగా చెప్పేశారు రవితేజ. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ‘ధమాకా’ చిత్రంలో ప్రణవి అనే అమ్మాయిని ప్రేమిస్తారు రవితేజ. ప్రణవి అంటే ఎవరో కాదండోయ్. ‘పెళ్లి సందడి’తో పరిచయమైన శ్రీ లీల అన్నమాట. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. మరోవైపు ‘వారియర్’ మనసులో విజిల్ వేసి మరీ ప్రేమ పుట్టించింది మహాలక్ష్మి. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే యాక్షన్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోన్న కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తారు కృతి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు ఆద్య పక్కన ఉంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారు శర్వానంద్. ఆద్యా అంటే శర్వా రీల్ లైఫ్ పార్ట్నర్. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా చేసిన రష్మికా మందన్నాయే ఈ ఆద్య. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ‘హో... ఆద్య’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. మరోవైపు ‘లవ్ మొళి’ అవతారం ఎత్తారు నవదీప్. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మొళి’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. వీతోపాటు మరికొన్ని చిత్రబృందాలు సాంగ్స్, కొత్త పోస్టర్స్‌తో ప్రేమికుల దినోత్సవానికి ప్రేక్షకులకు ప్రేమ కానుక ఇచ్చారు. -
‘ఏమైపోతావో నువ్వు’ అంటుంటారు..
-
నైన్త్ క్లాస్ నుంచే నిహా తెలుసు: చైతన్య
లాక్డౌన్లో మనసు తలుపులు తెరిచారు. ‘ఐ లవ్ యు’ అని చెప్పుకున్నారు. ఒకరి మనసులో ఒకరు లాక్ అయ్యారు. 27 మే 2020... లవ్‌లాక్! 9 డిసెంబర్ 2020... వెడ్లాక్!! నిహారిక – వెంకట చైతన్య ఒకింటివారయ్యారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’లా ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీకి స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. నిహా–చై చెప్పిన బోలెడన్ని విశేషాలు మీకోసం... ► పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ వేలంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నిహారిక: ప్రస్తుతానికి ప్లాన్ చేయలేదు. సర్ప్రైజ్ ఏంటో నాకూ ఇంకా తెలీదు. చైతన్య: ముందే చెప్పేస్తే ఎలా? సస్పెన్స్. ► పెళ్లి తర్వాత మీ ఇద్దరి ఫస్ట్ ఇంటర్వ్యూ... చైతన్య: చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నిహా: ఇలా ఇద్దరూ ఇంటర్వ్యూ ఇస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ► పెళ్లికి ముందే మీ ఇద్దరికీ పరిచయం ఉందా? నిహా: మేం స్కూల్లో క్లాస్మేట్స్. చైతన్య: నైన్త్‌క్లాస్ చదువుతున్నప్పుడు నిహా తెలుసు. ► పెళ్లి తర్వాత పరస్పరం ఏం తెలుసుకున్నారు? నిహా: పెళ్లయి 2నెలలేగా. కోవిడ్ వల్ల బయట ఎక్కువతిరగలేదు. చైతన్య: పాజిటివ్ థింగ్స్ తెలుసుకున్నాం. ► ఒకరి గురించి మరొకరు ఏం చెబుతారు? నిహా: చూడ్డానికి కామ్‌గా ఉంటాడు. ఎక్కువ మాట్లాడడు. క్లోజ్ ఫ్రెండ్స్‌తో అయితేనే సరదాగా మూవ్ అవుతాడు. చైతన్య: మేం క్వైట్ ఆపోజిట్. తను బాగా మాట్లాడుతుంది. ► మీ రెండు కుటుంబాలు కంప్లీట్ ఆపోజిట్. ఒకరిదేమో ఫిల్మ్ ఇండస్ట్రీ. మరొకరిదేమో పోలీస్ డిపార్ట్మెంట్. ఏమనిపిస్తోంది? నిహా: అన్యోన్యంగా ఉంటే చాలని ఇరు కుటుంబాల్లో అనుకున్నారు. ► మీ ఫ్యామిలీలో మీరే ప్రిన్స్.. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది. నిహా: పెళ్లి తర్వాత ఒకరి ఇంటికి వెళ్లాల్సి వస్తుందని నేనెక్కువగా ఆలోచించలేదు. అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు ఫుడ్ తినాలంటే డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా ఫుడ్ అంటే బెడ్‌పైకి తీసుకొచ్చి పెడుతుంది అమ్మ. చాలా కేరింగ్. ► మీ ఇంట్లో ఏ టైమ్‌కి నిద్రలేచినా అడగరు.. ఇప్పుడు అత్తారింట్లో అయితే త్వర గా లేవకుంటే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఉంటుంది కదా? నిహా: ఇంట్లో నేను పడుకుని ఉన్నప్పుడు ఎవరూ లేపేవారు కాదు. అయితే పెళ్లయ్యాక కూడా నేను కంఫర్ట్‌గా ఉన్నాను. మా నాన్నకి (నాగబాబు) అయితే కొంచెం భయం ఉంటుంది (నవ్వుతూ). మా నాన్నేమో ఎప్పుడూ ‘మై డాటర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’ అంటుంటారు. మా అన్నతోనూ (వరుణ్ తేజ్) క్లోజ్‌గా ఉంటా. చిన్నప్పుడు కొట్టుకునేవాళ్లం. ► మీ ఇద్దరిలో ఎవరు లేట్‌గా నిద్రలేస్తారు? చైతన్య: తనే (నవ్వుతూ). నిహా: అంటే షూటింగ్ ఉన ్నప్పుడు కాదు లేనప్పడే! ► మీకేమైనా సినిమాల్లోకి వచ్చే ప్లాన్స్ ఉన్నాయా? వస్తే మీరిద్దరూ కలిసి చేసే ఆలోచన ఉందా? నిహా: చాన్సే లేదు. రియల్ లైఫ్‌లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటే చాలు. చైతన్య: అస్సలు సినిమాలు చేసే ఆలోచన లేదు. ► పెళ్లి తర్వాత మీరు కమిటైన సినిమాలున్నాయా? నిహా: ఇంకా లేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తున్నా. ► మీ ఇద్దరిలో ఎక్కువ కోపం ఎవరికి? నిహా: తనకే (నవ్వుతూ). క్యూట్‌గా కోప్పడతాడు. చైతన్య: అలాంటిదేం లేదు. ► మీలో ఎవరు ముందు సారీ చెబుతుంటారు? నిహా: తనే. ముందు తనే సారీ చెప్పేలా చేసుకుంటాను. చైతన్య: తర్వాత తను కూడా నాకు సారీ చెబుతుంది. ► మీ ప్రేమను వ్యక్తపరచుకున్న రోజు? ఇద్దరూ: 27 మే 2020. ► చైతన్యతో మీ పెళ్లి అనుకుంటున్న సమయంలో మీ పెదనాన్న చిరంజీవి, మీ బాబాయ్ పవన్ కల్యాణ్ ఏమన్నారు? నిహారిక: మేం చెప్పామని కాదు... నిజాయతీగా మీరు ఒకరినొకరు ఇష్టపడి ఉంటే పెళ్లి చేసుకోండి అన్నారు పెదనాన్న. ► అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని నిహారిక పేరెంట్స్ మీకు చెప్పారా? నిహా: నాన్న, అమ్మ, అన్న... ఇప్పటికీ ‘ఏమైపోతావోనువ్వు’ అంటుంటారు(నవ్వు). ► మీ ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు. నిజజీవితంలో ఇష్టమైన హీరో? నిహా: మై ఫాదర్ ఈజ్ మై హీరో. ఆ తర్వాత అన్న.. ఇద్దరూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఆన్ స్క్రీన్‌లో పెదనాన్నగారు. ► పెళ్లప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఓ సీక్రెట్ చెబుతా అన్నారు.. ఇంతకీ ఏంటీ ఆ రహస్యం? నిహా: ఏ రహస్యమూ లేదు. ఊరికే ఫొటో ఫోజు కోసం అలా వాడాను. ► మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్? నిహారిక: చై ఈజ్ ద బెస్ట్ (నవ్వుతూ) చైతన్య: నిహా ఈజ్ ద బెస్ట్ (నవ్వులు). ఈ రోజు ‘సాక్షి’ టీవీలో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మెగా లవ్ ముచ్చట్లు. -
ఆండ్రీ దొరకడం నా అదృష్టం
‘‘నా జీవితంలో జరిగిన మంచి విషయాల్లో ఆండ్రీతో పెళ్లి ఒకటి అని భావిస్తున్నాను. ఆండ్రీలాగా సపోర్ట్ చేసే భర్త దొరకడం నా అదృష్టం’’ అని భర్తను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు శ్రియ. 2018లో ఆండ్రీ కొచ్చివ్ అనే బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్‌ను వివాహం చేసుకున్నారామె. వివాహం తర్వాత తన భర్త గురించి ఎక్కువగా మాట్లాడింది లేదు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, పలు విషయాలు పంచుకున్నారు శ్రియ. ‘‘వ్యక్తిగత విషయాలు బయటకి మాట్లాడటానికి నేను పెద్దగా ఇష్టపడను. అందుకే ఆండ్రీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. మేం మొదటిసారి మాల్దీవ్స్‌లో కలిశాం. అప్పటికి నేనో నటిని అని ఆండ్రీకి తెలియదు. నేను నటిని అని తెలిశాక ఆన్లైన్లో నా సినిమాలు కొన్ని చూశాడు. నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే... ‘అర్జున్’ సినిమాలో ఒక పాటను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో షూట్ చేశాం. నేను ఆ సంగతే మర్చిపోయాను. మేం కలిసిన కొత్తలో నన్ను ఆ ప్లేస్‌కి తీసుకెళ్లి నువ్వు ఇక్కడే పాట పాడావు, డ్యాన్స్ చేశావు అని ఆ పాటలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకుని నాకు చెప్పాడు. ఆ విషయం నాకు బాగా నచ్చింది. అలానే బెస్ట్ వేలంటైన్స్ డే అంటే గత ఏడాది ‘ది నట్‌క్రాకర్’ అనే షోకి తీసుకెళ్లాడు. ఆ షోను ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం. అది మర్చిపోలేని రోజు’’ అన్నారు శ్రియ. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో స్పెషల్ రోల్ చేస్తున్నారామె. ఇది కాకుండా మరో తెలుగు సినిమాలో నటిస్తున్నారు. -
ముద్దిస్తే ఏడుస్తారా?
‘ఏయ్ పిల్లా...’ అని సాయి పల్లవిని ఉద్దేశించి పాడారు నాగచైతన్య. ఆ పాటకు పడిపోయినట్టున్నారు... చైతన్యకో చిన్న ముద్దిచ్చారామె. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. నారాయణ్ దాస్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే ఫీల్‌గుడ్ వీడియో సాంగ్‌ను వేలంటైన్స్ డే స్పెషల్‌గా విడుదల చేశారు. ఈ పాటలో ‘ఏందబ్బా ముద్దుపెడితే ఏడుస్తారా అబ్బా?’ అని సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: విజయ్ సి. కుమార్, సహ నిర్మాత: భాస్కర్ కటకం శెట్టి. -
ప్రేమాభిషేకం
ప్రేమకు డబ్బు, ఆస్తులు, అంతస్తులతో పని లేదు.ఒకరికొకరు నచ్చితే ప్రేమ మొగ్గ తొడిగి పుష్పిస్తుంది. ప్రేమ కోసం ఎంతగైనా సాహసించేవారూ ఉంటారు. చరిత్రపుటల్లో నిలిచిన ప్రేమికుడు వాలెంటైన్స్ గౌరవార్థం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా జరుపుకొంటుండడం తెలిసిందే. ఇందుకోసం వారం రోజుల నుంచే నగరం ముస్తాబవుతోంది. ప్రేమపక్షుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. సాక్షి, బెంగళూరు: మెట్రో సిటీ వాలెంటైన్స్ డే వేడుకలకు సాదర స్వాగతం పలుకుతోంది. మాల్స్, స్టాల్స్, హోటళ్లలో ప్రేమికుల రోజు అలంకరణ తళుకుమంటోంది. గురువారం కోసం ప్రేమజంటలు రకరకాల వేడుకలను ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా గులాబీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు భారీగా ఎగుమతి కాగా, బెంగళూరులోనే ఐదు లక్షల గులాబీలు అమ్ముడవుతున్నాయి. అలాగే అనేక హోటళ్లు, రెస్టారెంట్లులో గులాబీల అలంకరణ మురిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు సిద్ధం నగరంలోని హోటల్, రెస్టారెంట్లు ప్రేమికుల పండుగకు సిద్ధమయ్యాయి. కోరమంగళ, ఇందిరానగర, వైట్‌ఫీల్డ్, హెచ్ఎస్ఆర్ లేఔట్, దొమ్మలూరు, అశోకనగర, కొత్త విమానాశ్రయం రోడ్డు, ఎంజీరోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్, మల్లేశ్వరం తదితర చోట్ల ఉన్న హోటళ్లు, పబ్‌లు, డిస్కోథెక్‌లు ప్రేమికుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆయా చోట్లా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో డీజే నైట్స్, క్యాండల్లైట్ డిన్నర్, మ్యూజిక్ లైట్ డిన్నర్, హెల్తీ డిన్నర్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లలో కనీసం రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు ఎంట్రీ ఫీజును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆయా కార్యక్రమాల కోసం ముందస్తు బుకింగ్‌లను కూడా ఉంచారు. రెస్టారెంట్లు, పబ్‌లలో ప్రేమ జంటల కోసం ఎన్నో ఆఫర్లను ప్రకటించారు. ముమ్మరంగా వ్యాపారాలు మార్కెట్లు, మాల్స్, కమర్షియల్ స్ట్రీట్లలో ప్రేమ జంటలకు అనువుగా స్పెషల్ బహుమతులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. అత్యధిక సంఖ్య లో గ్రీటింగ్ కార్డులు, ఫోటో ఫ్రేములు, హృదయాకారంలో బంగారు, వజ్రాభరణాలు, కీచైన్లు, తాజ్‌మహల్ బొమ్మలు తదితర కానుకలకు డిమాండ్ నెలకొంది. తమ ప్రియులైన వారికి బహుమతులు ఇచ్చేందుకు ప్రేమికులు షాపింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కొత్తగా విదేశీ చాకొలేట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎవరి స్థోమతను బట్టి వారు షాపింగ్‌లో నిమగ్నమయ్యారు. చలో పార్కులు, పర్యాటక ప్రాంతాలు నగరంలోని యువతీయువకులు ప్రేమికుల రోజును గడిపేందుకు నందిబెట్ట, బన్నేరుఘట్ట జాతీయ పార్కులకు వెళుతున్నారు. నగరంలోని చెరువులు, కాఫీ షాపులు, కాలేజీలు, సినిమా థియేటర్లు ప్రేమికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రేమికులకు పార్కులో ప్రవేశానికి ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ బహిరంగంగా ముద్దుముచ్చట్లకు దిగితే ఊరుకోబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని ప్రముఖ లాల్బాగ్, కబ్బన్ పార్కుల్లో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి లేదు. పార్కులకు వచ్చే ప్రేమికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యాన సిబ్బంది భద్రత కల్పిస్తారని పోలీసులు తెలిపారు. -
‘కళ’లో విరిసిన ప్రేమ..
సాక్షి,సిటీబ్యూరో: సిరిపురం శ్రీ,నివాస్ (అలియాస్ శ్రీను 65 ) ఆల్ రౌండర్ ఆర్టిస్టు. స్వాతి రింగ్ డ్యాన్సర్. ఓ ఈవెంట్లో కలిసిన ఈ జంట ప్రేమ బాసలు చెప్పుకుని.. తర్వాత పెళ్లిపీటలెక్కి.. ఇప్పుడు ఓ ఇంటివారయ్యారు. వాలంటైన్స్‌డే సందర్భంగా తమ ప్రేమ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘మా ప్రేమ 2012 మార్చిలో 19న మధురానగర్‌లో ఓ ఈవెంట్లో చిరురించింది. ఆ ప్రయాణం 2017 జూలై 30 దాకా సాగి ఆ రోజు వివాహంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీను. ‘స్వాతి తొలుత నెయిల్ ఆర్ట్ వేసేది. నేను మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ చేసేవాడిని. ముందు నేనే స్వాతికి ప్రపోజ్ చేశాను. తర్వాత ఏవేవో కవిత్వాలు చెప్పే వాడిని. కొన్నాళ్లకు తాను నా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఏడాది తర్వాత ఇద్దరం కలిసి ‘వాట్ ఈజ్ లైఫ్’ అని ప్రశ్న వేసుకున్నాం. జీవితం అంటే ప్రేమ కాదు.. ఒక ఆశయం అని ఇద్దరం అనుకున్నాం. ఇప్పుడు చేసే ఆర్ట్ ఫామ్స్ కాకుండా సరికొత్తగా ఎవరూ చేయనివి చేయాలని నిర్ణయించుకున్నాం. 2014లో స్వాతి ప్రోత్సాహంతో మ్యాజిక్ షో ప్రారంభించాను. తర్వాత ఆ కళను కొత్తగా చేయడం ప్రారంభించాను. స్వాతి ప్రోత్సాహంతోనే డ్రస్ ఛేంజ్, లిల్లీపుట్ యాక్టింగ్ ప్రయత్నించాను. నాతోపాటు తను కూడా కొత్తగా రింగ్ డ్యాన్స్ మొదలు పెట్టింది. ఈ డ్యాన్స్ జిమ్నాస్టిక్స్తో సమానం. చిన్నప్పుడే నేర్చుకోవాలి. 21 ఏళ్ల వయసులో స్వాతి 12 గంటల పాటు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. ఇద్దరం కలిసి చేస్తూండగా 2016లోనే ‘జబర్దస్త్’లో ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది. రాకింగ్ రాకేశ్ టీంలో చేరాను. కొత్త వృత్తిలో కుదుటపడ్డాం కదా అని మా ప్రేమ విషయం ఇద్దరం పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు.. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు. తాను నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వారి పెద్దలకు పరిచయం చేసింది. వారు నా నడవడిక గమనించి ఓకే చెప్పారు. ఏడాది తర్వాత మా ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు. 2017 జూలై 30న మా ప్రేమ పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా మారింది. స్వాతితో కలిసి 16 రకాల కళారూపాలను ప్రదర్శిస్తాను’ అంటూ వివరించాడు శ్రీను. స్వాతి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఇద్దరు కలిసి ఎదిగేందుకు ప్రేమ అండగా ఉండాలి. అంతకు మించి ఒక ఆశయం కావాలి. వృత్తిలో ఎదిగేందుకు ఒకరి సలహాలు ఇంకొకరు తీసుకోవాలి. అలాగే మేం కలిసి సాగుతున్నాం. ప్రేమికులకు ఒకటే సలహా.. ఒకరినొకరు అర్థం చేసుకొన్నాకే పెళ్లికి వెళ్లాలి. అత్తామామలు, అమ్మనాన్నలు ఇద్దరు ఒక్కటే అనే భావన ఉండాలి. అప్పుడే కుటుంబ బంధం మరింత బలపడుతుంది’ అంటూ ముగించింది. -
ప్రేమికుల రోజువినూత్న ప్రయత్నం
గచ్చిబౌలి: గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు చేపట్టిన ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనున్నారు. నగరంలోని పలు హోటల్ యజమానులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఆకలితో ఉన్నవారందరికీఆహారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో నగరంలో బృహత్తరకార్యక్రమాన్ని లాంఛనంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆహారాన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు,ఆటో స్టాండ్, నైట్ షెల్టర్లు, స్లమ్‌లు, మేజర్ ఆసుపత్రులు ఇతర రద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించనున్నట్టు అడిషనల్ కమిషనర్ హరిచందన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని అందించాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంస్థలు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్ 95421 88884, విశాల్ 96668 63435, పవన్ 98499 99018 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ప్రేమికుల రోజన లక్ష మందికి భోజనం... ప్రేమికుల రోజు అంటే అందరికీ ప్రేమ జంటలు గుర్తుకు వస్తాయి. కానీ ప్రేమికుల రోజున అన్నార్తుల ఆకలి తీర్చి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు అధికారులు. ఫీడ్ ద నీడ్‌లో భాగంగా వాటెంటైన్స్ డే స్పెషల్‌గా గురువారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష మంది పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం చేపట్టనున్నారు. అన్ని సర్కిళ్ల పరిధిలో అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థలు ఇందులో పాలుపంచుకుంటాయి. మిగిలిన ఆహరాన్ని పేదలకు అందించే దిశగా ప్రజలు కూడా ఆలోచిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 40 వేల భోజనాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. హోటళ్ల యాజమాన్యాలు కూడా సహకరిస్తున్నాయి. త్వరలో యాప్.... ఫీడ్ ద నీడ్‌కు సంబంధించిన యాప్‌ను త్వరలో రూపొందిస్తామని శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హరి చందన దాసరి తెలిపారు. దీని ద్వారా మరింత మంది స్పందిస్తారన్నారు. -
లవర్స్‌కి ‘లైన్’ వేశారు!
వలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు తమకు నచ్చిన గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడానికిసిద్ధమయ్యారు. దీంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్ల నిర్వాహకులు వారికి ‘లైన్’వేస్తున్నారు. విభిన్న గిఫ్ట్‌లతో ప్రేమికుల మదిని దోచుకోనున్నారు. సిటీలోని పలురెస్టారెంట్లు, పబ్స్ నిర్వాహకులు ప్రేమికుల కోసం ఎన్నో వెరైటీ కార్యక్రమాలకుసన్నద్ధమవుతున్నారు. ఫొటో ఆర్ట్ ఫర్ లవర్స్ ప్రపంచ వ్యాప్తంగా ‘గ్లోబల్ లగ్జరీ గ్రూప్’ వాళ్లు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రపంచం మొత్తం మీద ఎవరైనా సరే తమకు నచ్చిన ఫొటోని ‘www.handpaintedstories.com’ వెబ్సైట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో ఆ ఫొటోను ఆర్ట్‌గా గీసి తిరిగి వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తారు. అంతే కాదు ఫొటోకు సంబంధించిన స్టోరీని కూడా పోస్ట్ చేస్తారు. ఇది లవర్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి. తక్కువ ధరల్లో చక్కటి గిఫ్ట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్లలో కళ్లు జిగేల్మనిపించే గిఫ్ట్‌లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.99 నుంచి మనసుకు నచ్చినవి సొంతం చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ కొడితే చాలు మనచేతిలో ఉంటాయి. కపుల్స్ డిన్నర్ సిటీలోని పలు హోటల్స్ కపుల్స్ కోసం డిన్నర్‌ను ప్లాన్ చేస్తున్నాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ‘పార్క్ హయత్, ది హ్యాత్, తాజ్‌బంజారా, తాజ్‌కృష్ణా, దసపల్లా’ లాంటి అనేక హోటల్స్ డిన్నర్ థీమ్‌ను ఏర్పాటు చేశాయి. షాపింగ్ అదుర్స్ అమ్మాయిల కోసం టాప్స్, జ్యువెలరీ, రింగ్స్, అబ్బాయిల కోసం వాచెస్, హ్యాండ్ జ్యువెలరీస్, నెక్ జ్యువెలరీస్ ప్రస్తుతం సిటీలోని షాపింగ్ మాల్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. షాపర్స్ స్టాప్, సిటీసెంటర్, అన్లిమిటెడ్, మ్యాక్స్ వంటి ప్రధాన షోరూంలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పబ్స్‌లో అలనాటి గీతాలు సిటీలోని పలు రెస్టారెంట్స్‌తో పాటు పబ్స్ కూడా కపుల్స్ కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పబ్స్‌లో వైట్డ్రస్లో కపుల్స్‌ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు పాటలతో బ్యాండ్ కపుల్స్ కోసం అలనాటి పాటలను పాడుతూ వారిని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. స్పెషల్ రోజెస్ ఫర్ లవర్స్ విభిన్న రకాల, కలర్స్‌లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. సిటీకి చెందిన సోనాల్ అగర్వాల్ ‘ఫ్లవర్వలీ’ పేరుతో రోజా పూలు విక్రయిస్తున్నారు. రోజా పూలతో పాటు టెక్నాలజీ ప్రింటెడ్ రోజెస్ అన్నీ సిటీలో, ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. -
అలా కలిశారు వారిద్దరూ..
సాక్షి,సిటీబ్యూరో: ప్రేమ.. ఓ అందమైన భావన. మధురమైన అనుభూతి. వందల ఏళ్లుగా సాగుతున్న హృదయాల కావ్యం. హైదరాబాద్.. దశాబ్దాల కిందట ప్రేమ పునాదులపై వెలసిన ప్రేమనగరం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా భిన్న సంస్కృతులు, భాషల పూదోటలు విరిశాయి. భాగమతి, కులీ కుతుబ్షాల్లాగే ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నెన్నో ప్రేమ జంటలు ఈ వలపుల పూదోటలో విహరించాయి. భాగమతి–కులీ కుతుబ్షాల ప్రేమ ఘట్టం అపురూప కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత నిజాం కాలం నాటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీసా ప్రేమ కూడా అలాగే సాగింది. కులీ, భాగమతిలను ఏకం చేసేందుకు మూసీనదిపై ఏకంగా ఒక ‘ప్రేమ వంతెన’ (పురానాపూల్) వెలిసింది. అప్పటికే పారిస్‌లోని సైనీ నదిపై నిర్మించిన ఫౌంట్‌న్యూఫ్ వంతెన తరహాలో దీన్ని నిర్మించడం విశేషం. ఇక కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీసాల ప్రేమకు గుర్తుగా కోఠిలో ‘బ్రిటీష్ రెసిడెన్సీ’ వెలసింది. అందులోనే తన ప్రేయసికి కానుకగా ‘హవా మహల్’ను నిర్మించి ఇచ్చాడు ప్యాట్రిక్. హైదరాబాద్ అప్పుడు.. ఇప్పుడు ఓ ప్రేమనగరం. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. అలా కలిశారు వారిద్దరూ.. ‘చిచలం’ హైదరాబాద్ రాజ్యంలోని ఓ పల్లె ప్రాంతం.. మూసి నదికి ఆవలవైపు ఉంది. అపుడే గుర్రంపై ‘చిచలం’ చేరుకున్న యువరాజు కులీ కుతుబ్‌షాకు ఎక్కడి నుంచో కాలి అందెల శబ్దం చెవులను తాకింది. ఆ సవ్వడిలో ఏదో గమ్మత్తును గుర్తించాడు. చూస్తే ఓ యువతి.. పేరు భాగమతి. పరవళ్లు తొక్కుతున్న మూసీ నదిలాగే అతడి హృదయంలో అలజడి రేగింది. ఆ రోజు ఆమె పల్లె పొలిమేరల్లో ఉన్న ఆలయానికి వెళ్తుండగా యువరాజు చూశాడు. ఆ యువతినే తన హృదయ సామ్రాజ్ఞిని చేసుకున్నాడు కులీ కుతుబ్‌షా. కానీ ఆమె సాధారణ యువతి. అతను యువరాజు. ఆమెది హైందవ సంప్రదాయం. అతనిది మహ్మదీయ మతం. మరేం జరిగింది..? ఏకం చేసిన ప్రేమ వంతెన.. హృదయాలు ఏకమైనా ఉప్పొంగే మూసీ వారి మధ్య అఖాతమైంది. ఆ దరి నుంచి ఈ దరికి చేరుకోకుండా అడ్డుపడింది. కానీ వారి ప్రేమ ముందు మూసీ ఓడిపోయింది. భీకరంగా ప్రవహిస్తోన్న మూసీ నదిని సైతం లెక్క చేయకుండా తన ప్రియురాలు భాగమతి కోసం ‘చిచలం’కు పరుగులు తీశాడు కుతుబ్. నదిని దాటేందుకు యువరాజు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గోల్కొండ పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిచలం వెళ్లేందుకు తండ్రి ఇబ్రహీం కుతుబ్ షా మూసీ నదిపై 1578లో కట్టించిన ‘ప్యార్ నా పూల్’ (పురానాపూల్) వంతెనను కట్టించాడు. అది ప్రేమ వంతెనగా నిలిచిపోయింది. పురానాపూల్, పారిస్‌లోని సైని నదిపై నిర్మించిన ఫాంట్న్యూఫ్ బ్రిడ్జీలు ఇంచుమించు ఒకే కాలంలో.. ఒకే నమూనాతో నిర్మించారు. మూసీనదికి ఉత్తరాన కుతుబ్ షా మొట్టమొదటిసారి భాగమతిని చూసిన ‘చిచలం’ వద్ద 1592 నాటికి అద్భుతమైన కట్టడం చార్మినార్‌తో నగర నిర్మాణం పూర్తయింది. అప్పటికి ఆ ఊరు మహారణ్యంలో ఉన్న ఓ చిన్న పల్లె. దానినికి ‘భాగ్యనగర్’గా పేరుపెట్టారు. బహుశా మానవ చరిత్రలో ఇద్దరి ప్రేమకు చిహ్నంగా వెలిసిన నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. నగర నిర్మాణం నాటికి కుతుబ్ షా వద్ద మీర్ మోమిన్ ప్రధానిగా ఉన్నాడు. ఆయన ఇరాన్‌కు చెందినవాడు కావడం వల్ల పర్షియాలోని ‘ఇస్పహాన్’ నగరం నమూనాలో హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఇరాన్‌కు చెందిన వాస్తు శిల్పులను, నిపుణులను రప్పించారు. చరిత్రాత్మకమైన చార్మినార్‌కు నలువైపులా అందమైన ఉద్యానవనాలు, తటాకాలు, సరస్సులతో, రాజప్రముఖుల నివాస మందిరాలతో నగరం వెలసింది. లాల్‌మహల్, దాద్‌మహల్, జనాన మహల్, కుతుబ్ మందిర్, ఖుదాదత్ మహల్ వంటి అద్భుతమైన నిర్మాణాలన్నీ అప్పుడు కట్టించినవే. కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీసాల ప్రేమ ఘట్టం భాగమతి, కుతుబ్షాల ప్రేమ ఘట్టంలాగే కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీల ప్రేమ కూడా మధుర కావ్యమైంది. ప్యాట్రిక్ బ్రిటీష్ అధికారిగా వచ్చినప్పటికీ హైదరాబాద్ సాంస్కృతిలో కలిసిపోయిన గొప్ప పరిపాలనాదక్షుడు. 1798 నుంచి 1805 వరకు హైదరాబాద్ 6వ రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి వరకు ఉన్న రెసిడెంట్లంతా ‘షంషీద్‌జంగ్’ అనే అమీర్ తోటలో నివసించేవారు. కానీ మొదటిసారి ప్యాట్రిక్ ప్రత్యేకంగా ‘రెసిడెంట్ భవనం’ కట్టించాడు. నిజాం నవాబు సహకారంతో 64 ఎకరాల సువిశాలమైన స్థలంలో మూసీకి ఉత్తరాన ఈ మహాసౌధం వెలిసింది. ఈ భవనానికి లండన్ నుంచి అత్యంత ఖరీదైన ఫర్నిచర్ తెప్పించాడు. తన రెసిడెంట్ భవనానికి కొద్ది దూరంలో.. సుల్తాన్‌బజార్‌లోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఖైరున్నీసా అనుకోకుండా ప్యాట్రిక్‌కు తారసపడింది. తొలి చూపులోనే ప్రేమించాడాయన. విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా ఇష్టపడింది. కానీ ఏంలాభం.. ఇద్దరి మతాలు.. భాషలు, ప్రాంతాలు వేరు. విషయాన్ని ఖైరున్నిసా కుటుంబ పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. ప్యాట్రిక్ తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. తన పేరును ‘హస్మత్ జంగ్ బహదూర్’గా మార్చుకుని ముస్లిం పద్ధతిలో తన ప్రేయసి ఖైరున్నిసాను 1803లో పెళ్లి చేసుకున్నాడు. నేటి కోఠి ఉమెన్స్ కళాశాల ప్రాంగణంలో ‘హావామహాల్’ను నిర్మించి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ జంట సుల్తాన్‌బజార్‌లో షాఫింగ్ చేసే వారు. వీరిది మతాంతర వివాహం కావడంతో ప్రజలు వీరి ప్రేమ గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. -
‘కళ’లో విరిసిన ప్రేమ.. స్వాతి విత్ శ్రీను
సాక్షి,సిటీబ్యూరో: సిరిపురం శ్రీ,నివాస్ (అలియాస్ శ్రీను65) ఆల్ రౌండర్ ఆర్టిస్టు. స్వాతి రింగ్ డ్యాన్సర్. ఓ ఈవెంట్లో కలిసిన ఈ జంట ప్రేమ బాసలు చెప్పుకుని.. తర్వాత పెళ్లిపీటలెక్కి.. ఇప్పుడు ఓ ఇంటివారయ్యారు. వాలంటైన్స్‌డే సందర్భంగా తమ ప్రేమ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘మా ప్రేమ 2012 మార్చిలో 19న మధురానగర్‌లో ఓ ఈవెంట్లో చిరురించింది. ఆ ప్రయాణం 2017 జూలై 30 దాకా సాగి ఆ రోజు వివాహంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీను. ‘స్వాతి తొలుత నెయిల్ ఆర్ట్ వేసేది. నేను మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ చేసేవాడిని. ముందు నేనే స్వాతికి ప్రపోజ్ చేశాను. తర్వాత ఏవేవో కవిత్వాలు చెప్పే వాడిని. కొన్నాళ్లకు తాను నా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఏడాది తర్వాత ఇద్దరం కలిసి ‘వాట్ ఈజ్ లైఫ్’ అని ప్రశ్న వేసుకున్నాం. జీవితం అంటే ప్రేమ కాదు.. ఒక ఆశయం అని ఇద్దరం అనుకున్నాం. ఇప్పుడు చేసే ఆర్ట్ ఫామ్స్ కాకుండా సరికొత్తగా ఎవరూ చేయనివి చేయాలని నిర్ణయించుకున్నాం. 2014లో స్వాతి ప్రోత్సాహంతో మ్యాజిక్ షో ప్రారంభించాను. తర్వాత ఆ కళను కొత్తగా చేయడం ప్రారంభించాను. స్వాతి ప్రోత్సాహంతోనే డ్రస్ ఛేంజ్, లిల్లీపుట్ యాక్టింగ్ ప్రయత్నించాను. నాతోపాటు తను కూడా కొత్తగా రింగ్ డ్యాన్స్ మొదలు పెట్టింది. ఈ డ్యాన్స్ జిమ్నాస్టిక్స్తో సమానం. చిన్నప్పుడే నేర్చుకోవాలి. 21 ఏళ్ల వయసులో స్వాతి 12 గంటల పాటు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. ఇద్దరం కలిసి చేస్తూండగా 2016లోనే ‘జబర్దస్త్’లో ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది. రాకింగ్ రాకేశ్ టీంలో చేరాను. కొత్త వృత్తిలో కుదుటపడ్డాం కదా అని మా ప్రేమ విషయం ఇద్దరం పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు.. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు. తాను నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వారి పెద్దలకు పరిచయం చేసింది. వారు నా నడవడిక గమనించి ఓకే చెప్పారు. ఏడాది తర్వాత మా ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు. 2017 జూలై 30న మా ప్రేమ పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా మారింది. స్వాతితో కలిసి 16 రకాల కళారూపాలను ప్రదర్శిస్తాను’ అంటూ వివరించాడు శ్రీను. స్వాతి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఇద్దరు కలిసి ఎదిగేందుకు ప్రేమ అండగా ఉండాలి. అంతకు మించి ఒక ఆశయం కావాలి. వృత్తిలో ఎదిగేందుకు ఒకరి సలహాలు ఇంకొకరు తీసుకోవాలి. అలాగే మేం కలిసి సాగుతున్నాం. ప్రేమికులకు ఒకటే సలహా.. ఒకరినొకరు అర్థం చేసుకొన్నాకే పెళ్లికి వెళ్లాలి. అత్తామామలు, అమ్మనాన్నలు ఇద్దరు ఒక్కటే అనే భావన ఉండాలి. అప్పుడే కుటుంబ బంధం మరింత బలపడుతుంది’ అంటూ ముగించింది. -
ప్రేమ ముసుగులో.. ఈ నేరం
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ పేరుతో మోసం చేయడం, వేధింపులకు పాల్పడటం... మోసపోయి హత్యలు, ఆత్మహత్యలు వంటి దారుణాలకు ఒడిగట్టడం... చాలాకాలంగా జరుగుతున్నదే. వీటికి తోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో ఈ–నేరాలు పెరిగిపోయాయి. ఈ–పోకిరీల కారణంగా యువతులు, మహిళలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి నేరాలకు సోషల్ నెట్వర్కింగ్ మీడియాలైన ఫేస్బుక్, ఆర్కూట్ వంటివి వేదికలవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల్లో 40 శాతం ఈ–వేధింపులకు సంబంధించినవే కావడం గమనార్హం. పట్టుబడుతున్న నిందితుల్లో విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్నెట్, సెల్ఫోన్లే వీరికి ‘ఆయుధాలు’గా ఉపకరిస్తున్నాయి. ‘బీటెక్ విద్యార్థి’ వేధింపులు... మాజీ స్నేహితురాలిపై ఈ–మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గతంలో అరెస్టయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇతను గతంలో హైదరాబాద్‌లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఈ–వేధింపులకు పాల్పడ్డాడు. బీటెక్ విద్యార్థినికి‘మరుగుజ్జు వల’... బోయిన్పల్లి ఫిరోజ్‌గూడకు చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్‌బుక్‌లో అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. గుంటూరుకు చెందిన ఓ యువతి ‘ఫ్రెండ్’గా పరిచయం కావడంతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి, అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ‘స్మార్ట్’తోనే చేటు: ఒకప్పుడు ఫోన్ అనేది విలాసవస్తువు. నేడు సెల్ నిత్యావసరంగా మారిపోయింది. నాటి ఫోన్లు ఇంటి మధ్యలో, పెద్దల పర్యవేక్షణలో ఉండేవి. సెల్ఫోన్ల రాకతో ‘స్వేచ్ఛ’ పెరిగింది. స్మార్ట్ఫోన్ల రాకతో ఈ ధోరణి మరింత విచ్చలవిడిగా మారింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో ‘వ్యక్తిగత అంశాలను’ రికార్డు చేయడానికి అంగీకరిస్తున్నారు. ఓ దశలో అవే వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహాకు చెందినవి 30 శాతం వరకు ఉంటున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ, పిల్లల చర్యలపై వారి నిఘా ఉన్న కుటుంబాల్లో బాధితుల సంఖ్య తక్కువగా ఉంటోంది. తల్లిదండ్రులు తమ వారిపై కన్నేసి ఉంచితే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదు.– సైబర్ క్రైమ్ పోలీసులు డాక్టర్ ‘మిస్’కాల్... నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ తన సెల్‌ఫోన్ నుంచి అపరిచిత నెంబర్లకు మిస్‌కాల్స్ ఇవ్వడం... తద్వారా వారితో పరిచయం పెంచుకోవడం అలవాటు. ఈ రకంగా పరిచయమైన నగరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినితో పెళ్లి ప్రతిపాదన చేశాడు. నిరాకరించడం, ఆమెకు వేరే పెళ్లి నిశ్చయం కావడంతో కక్షకట్టాడు. ఆమె పేరుతోనే ఫేస్బుక్లో అకౌంట్ తెరిచి స్నేహితులకు అసభ్యకర సందేశాలు పంపి అరెస్టయ్యాడు. ‘ప్రొఫైల్’తో ఎర...డబ్బుతో జల్సా... మాట్రిమోనియల్ వెబ్సైట్లను వేదికగా చేసుకుని విద్యాధికుడినంటూ ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రచారం చేసుకున్న ఓ వ్యక్తి మోసాలకు దిగాడు. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరైన ఇతను దాదాపు 52 మంది యువతులను ప్రేమ పేరుతో వలవేసిన ఇతను వీరిలో 22 మంది నుంచి రూ.12 లక్షలకు పైగా స్వాహా చేసి జల్సాలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఆటకట్టించారు. ‘సాఫ్ట్’ ఇంజినీర్..హార్డ్ వేధింపులు.. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గతంలో ప్రాజెక్ట్‌వర్క్ నేపథ్యంలో పరిచయమైన యువతితో ఒన్‌సైడ్ లవ్‌గా నడిపాడు. పెళ్లికి ఆమె తిరస్కరించడంతో కక్షకట్టిన అతను ఓ ల్యాప్‌టాప్, డేటాకార్డ్ కొనుగోలు చేసి వాటి సాయంతో ఆమె మెయిల్ ఐడీని హ్యాక్ చేసి ఆమె బంధువులు, స్నేహితులకు బాధితురాలి పేరుతో అసభ్య చిత్రాలు, సందేశాలు పంపి అరెస్టు అయ్యాడు. వేధింపులు.. బెదిరింపులు సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోనూ సైబర్ క్రైమ్ విభాగానికి అందుతున్న ఫిర్యాదుల్లో సగానికిపైగా ప్రేమ ముసుగులో జరుగుతున్న నేరాలేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిలో పరిచయస్తులే ఎక్కువగా ఉండటం గమనార్హం. గతేడాది సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లో నమోదైన 1200 కేసుల్లో దాదాపు 600 కేసులు ప్రేమ ముసుగులో జరిగిన ‘ఈ–నేరం’లుగా పోలీసులు తెలిపారు. ప్రేమించాలని కొందరు, పెళ్లి చేసుకోవాలని మరికొందరు ఆన్లైన్ బెదిరింపులకు దిగితే, మరికొందరు తమ పరిచయస్తురాలికి మరొకరితో వివాహం జరుగుతుందని తెలిసి బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఆయా కేసుల్లో ఎక్కువ మంది విద్యాధికులే ఉంటున్నారని క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిల తెలిపారు. -
ఆర్యసమాజ్ C/o ప్రేమ వివాహాలు
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి అనగానే ప్రేమ జంటలకు టక్కున గుర్తొచ్చేది ఆర్యసమాజ్ మాత్రమే. పెద్దలు అంగీకరించని ఎన్నో ప్రేమ వివాహాలకు ఆర్యసమాజం వేదికగా నిలు స్తోంది. ఇక్కడ జరిగే ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులే పెళ్లిపెద్దలుగా మారి, సాక్షి సంతకాలు చేస్తున్నారు. ఈ వేదికపై ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రేమ జంటలు ఒక్కటయ్యాయి. మహర్షి దయానంద సరస్వతి శిష్యుల్లో ఒకరైన స్వామి గిరిజానంద సరస్వతి సుల్తాన్‌బజార్‌లోని బడిచౌడీలో వందేళ్ల క్రితం ఆర్యసమాజాన్ని స్థాపించారు. స్వాతంత్రానికి ముందు నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన అనేక ఉద్యమాలకు ఇది వేదిగా నిలిచింది. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత హిందూమత పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అనేక ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా నిలిచింది. ఎలాంటి ఆడంభరాలు లేకుండా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ జంటలను ఒక్కటి చేస్తోంది. ‘శుద్ధి సంస్కారం’ తర్వాతే:ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో చాలా వరకు కులాంతర వివాహాలు, పెద్దలు అంగీకరించని వివాహాలే. ఒక వేళ ప్రేమికులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారేతై.. వారిని ముందు çశుద్ధిసంస్కారం(మత మార్పిడి) చేసి, ఆ తర్వాత వారికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉండటంతో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అనేక జంటలు ఆసక్తి చూపుతున్నాయి. కేవలం ప్రేమికులే కాకుండా పెళ్లికి ఆర్థిక స్తోమత లేని పేద జంటలు ఈ వేదికపై ఒక్కటవుతుండటం గమనార్హం. ఈ వేదికపై వివాహం చేసుకున్న వారిలో అనేక మంది సంఘ సంస్కర్తలతో పాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఏటా 2 వేలకుపైగా పెళ్లిళ్లు: దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యసమాజ్ శాఖల్లో ఏడాదికి సగటున 50 వేలకుపైగా వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని వందకుపైగా శాఖల్లో ఏటా రెండు వేల వివాహాలు జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావడంతో పాటు పిల్లలు కూడా ఆర్థికంగా స్థిరపడటం వల్ల ప్రేమ పెళ్లిళ్లకు వారు పెద్దగా అభ్యంతరం చెప్పక పోవడమే ఇందుకు కార ణమని ఆచార్య అమర్‌సింగ్ ఆర్య పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆర్యసమాజ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. పిల్లల పెళ్లి వివరాలను గోప్యంగా ఉంచుతుండటంతో పాటు తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం వల్ల వారి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. -
వాలెంటైన్స్ అలర్ట్! బౌన్సర్లకు భలే గిరాకీ...
సాక్షి, సిటీబ్యూరో: వాలంటైన్స్ డే బహిష్కరణ పిలుపు, ప్రేమికులను అడ్డుకుంటామని, కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామంటూ కొన్ని సంఘాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పార్కులు, యూనివర్శిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో ఐదు జోన్లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని అనేక పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు రోజు వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఐదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్‌లు, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో అధికారులు ఈ జోన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ పక్క సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు నిర్వాహకులు సైతం నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క నెక్లెస్‌రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బౌన్సర్లకు భలే గిరాకీ... బౌన్సర్... ఈ పేరు పబ్‌లు, బార్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం (సాధారణంగా షర్టు, టీషర్టు మాత్రమే నల్లవి ధరిస్తారు)లతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే వాలెంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్సర్లు కలిగిన సంస్థలు సైతం గురువారం ఒక్కరోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ప్రైవేట్ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 80 శాతం బౌన్సర్‌కు, 20 శాతం అతడిని ఏర్పాటు చేసిన సంస్థకు చెందుతాయని సమాచారం. -
కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి..
సాక్షి, సిటీబ్యూరో:నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు ప్రేమికులకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతున్నాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు సహా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, ఇందిరాపార్కుల్లో ఎక్కడ చూసినా ప్రేమ పక్షులే కన్పిస్తాయి. చెట్టుకొక.. పుట్టకొక జంట దర్శనమిస్తూ ఉంటుంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ఆయా ప్రాంతాల్లో అమ్మాయిలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి.. తర్వాత తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి లవ్ స్పాట్స్‌కు చేరుకుంటున్నారు. ముద్దూముచ్చట్లలో మునిగితేలుతున్నారు. నేడు వలంటైన్స్ డేసందర్భంగా ఆయా ప్రాంతాలుప్రేమికులతో కిక్కిరిసిపోనున్నాయి. -
ప్రేమలో మాస్టార్లు..
ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు పలకరిస్తుందో ఎవరికి తెలుసు? వస్తూనే ఓ గిలి.. మది లోగిలి అదిరిపడేలా.. ఆ ప్రత్యేకమైన వ్యక్తి స్ఫురణకు వస్తే చాలు.. అప్పటి వరకు దగ్గరున్న వారంతా దూరమైపోతే బాగుణ్ణు అనే భావన. ఆమె లేదా అతడి ధ్యాస తప్ప మరేదీ అవసరం లేదన్న తాదాత్మ్యత. ఇదీ.. అని ప్రత్యేకంగా ఏదీ చెప్పలేని ఓ మధురానుభూతి మనసును ఆవరిస్తుంది. నూత్న యవ్వనం తొలి రోజుల్లోనే కాదు.. మలి వయసులోనూ.. ఆ మాటకొస్తే ఏ వయసులోనైనా.. కారణమేదైనా స్పందించే మనసుండాలే కానీ వలపుశరాల బారిన పడనివారుండరు అనడం అతిశయోక్తి కాదేమో.. అలాంటి ప్రేమజీవుల అనుభూతులు.. ప్రేమైక జీవనం గడుపుతున్న కొన్ని జంటల విజయాలు ప్రేమికుల రోజున మీ కోసం.. ఆత్రేయపురం (కొత్తపేట): మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురు యువతీ, యువకులు వారి ప్రేమ యుద్ధంలో విజయం సాధించి సుఖమయ జీవనం సాగిస్తున్నారు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు వేగేశ్న అజయ్ భూపతి, శిరి వారిలో ఒక జంట. వీరి ఇరువురు ప్రేమికుల రోజు సాక్షిగా ‘ఆర్ఎక్స్–100’ వాహనంపై యమస్పీడుగా దూసుకుపోతున్నారు. ఆయన సతీమణి శిరి ఇంజినీరింగ్ పూర్తి చేసి తను ప్రేమించిన వ్యక్తిని ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని పెళ్లి చేసుకుని జీవితాన్ని పూలబాటగా మార్చుకున్నారు. అలాగే ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన కప్పల శ్రీధర్, స్వరూప పరస్పరం అవగాహనతో ప్రేమికుల రోజు సాక్షిగా జీవితాన్ని సుఖమయం చేసుకుని పిల్లా పాపలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అలాగే ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యులు మద్దూరి సుబ్బలక్ష్మి , మద్దూరి బంగారం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ ప్రేమికులందరికీ ఆదర్శంగానిలుస్తున్నారు. ప్రేమకు పెద్దల అంగీకారం ఉంటేనే మంచిది ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటేనే జీవితమంతా ఆనందంగా ఉంటుందంటారు ఎల్ఐసీ రాజమహేంద్రవరం రూరల్ బ్రాంచి ఉద్యోగి గురుమహేష్, అంజలి దంపతులు. మూడున్నరేళ్ల క్రితం దగ్గర బంధువైన అంజలిని ప్రేమించారు. ఇద్దరి మనసులు ఒక్కటవడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోవడం వలన సంతోషంగా జీవించవచ్చంటారు. అందుకే ప్రేమికులు ఎవరైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటే ఆ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందన్నారు. మా దాంపత్యం ఎంతో అన్యోన్యం మామిడికుదురు (పి.గన్నవరం): ‘చదువుకునే సమయంలో ఇద్దరం ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాం. రెండు దశాబ్దాలు అయ్యింది. ఇంత వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నాం’ అంటున్నారు మామిడికుదురుకు చెందిన ఉండ్రు శ్రీనుబాబు, బళ్ల జ్యోతి. 1999లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసిన శ్రీనుబాబు ప్రస్తుతం తాటిపాక భాష్యం స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. జ్యోతి కూడా బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసి సర్వశిక్షాభియాన్‌లో సీఆర్పీగా పని చేస్తున్నారు. వీరి కుమారుడు వినయ్‌రామ్ కృష్ణా జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె అంబిక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బీఎన్ఎం కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా చదువుతోంది. ‘మాకు కుటుంబ సభ్యుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి’. ‘మా పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాం. మేము కోరుకున్న జీవితం ఇదే. మా పిల్లలు ప్రయోజకులు కావాలనే మేము కోరుకున్నాం. మా అభిలాష నెరవేరింది. మాకు ఈ జీవితం చాలా ఆనందంగా ఉంది. మా 20 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు’ అంటున్నారు శ్రీనుబాబు, జ్యోతి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తే ఎటువంటి సమస్యలు ఉండవంటారు వారు. పంతాలు, పట్టింపులకు పోకుండా ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే ఏ విధమైన సమస్యలు ఉండన్నది వారి సిద్ధాంతం. ధనిక–పేద వ్యత్యాసంచెరిపేసిన ప్రేమ.. అమలాపురం టౌన్: పెద్దలను ఎదిరించి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం తిరుగుబాటు అవుతుంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం సర్దుబాటు అవుతుంది. ఈ రెండు మార్గాల్లో ప్రేమికులు ఏ మార్గంలో పెళ్లి చేసుకున్నా భార్యాభర్తలు అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవించగలిగితేనే వారి ప్రేమకు అర్థం.. పరమార్థం. ప్రేమపెళ్లితో ఒక్కటైన జంట వాసంశెట్టి సుభాష్, లక్ష్మీ సునీత. అమలాపురం పట్టణం మద్దాలవారిపేటకు చెందిన సుభాష్ది ధనిక కుటుంబమైనప్పటికీ తన మనసుకు నచ్చిన పేదింటి యువతిని నిజాయతీగా ప్రేమించి.. అంతే నిజాయతీగా తన ఇంట్లో వారికి చెప్పి.. ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎదురెదురు ఇళ్లలోని కుటుంబాలైన వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ సుభాష్‌కు తాను మెచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మీ సునీత అంటే నాడూ.. ఈనాడూ అదే మక్కువ. పదేళ్ల వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే కవల ఆడపిల్లలు సత్య దీవిత, సత్య దీక్షిత. వారిరువురికీ వీరిరువురే ప్రపంచం. కాకతాళీయమే అయినా సుభాష్ తన పెద్దలను, ఆమె ఇంటి పెద్దలనూ ఒప్పించిన రోజు ఫిబ్రవరి 14 కావడం గమనార్హం. ప్రేమలో మాస్టార్లు సామర్లకోట (పెద్దాపురం): వారు ఇరువురు వేర్వేరు పాఠశాలల్లో ఉపాధ్యాయులు. తరువాత ఒకే హైస్కూల్లో పనిచేశారు. ఆ కాలంలో ప్రేమజీవులై పట్టణ ప్రముఖులు సహకరించడంతో 1991లో వివాహం చేసుకున్నారు తాళ్లూరి వైకుంఠం, ఏఎల్‌వీ కుమారి. ప్రస్తుతం వైకుంఠం పీడీగాను, కుమారి సైన్సు టీచరుగా బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లోనే పని చేస్తున్నారు. వైకుంఠం యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్స్‌లో పని చేసి అనేక మంది క్రీడాకారులను తయారు చేశారు. కబడ్డీ, ఖోఖోలలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. దాంతో అనేక మంది విద్యార్థులు కబడ్డీ కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. కుమారి సైన్సు టీచరుగా 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు బోధించడంలో ఆరితేరిన ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందారు. ఎప్పుడు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారని సహోపాధ్యాయులతో పాటు, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ కూడా ఆమెను అభినందిస్తుంటారు. వైకుంఠం వ్యాయామ ఉపాధ్యాయుడు కావడంతో పిల్లలకు ఆటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం కుమారుడి ఎస్సై సెలక్షన్‌కు ఎంతగానో దోహదం చేసింది. రెండో కుమారుడు పుష్పకల్యాణ్ ఐఏఎస్ లక్ష్యంతో హైదరాబాద్‌లో గ్రూప్స్‌కు శిక్షణ పొందుతున్నట్లు వైకుంఠం తెలిపారు. తమది ప్రేమ వివాహం అయినా పెద్దలు కూడా అంగీకరించడంతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు ఏఎల్‌వీ కుమారి, వైకుంఠం తెలిపారు. తమ పిల్లల వివాహం వారి ఇష్టం ప్రకారమే జరుగుతుందని చెప్పారు. ప్రేమ వివాహం చేసుకునే ముందు వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొవడం వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉండదని తెలిపారు. ఏది ఏమైనా సమస్యలు వచ్చిన సమయంలో సర్దుకుపోవడం వల్ల ప్రశాంతంగా జీవించడానికి వీలు కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. వైకల్యం శరీరానికే.. ప్రేమకు కాదు.. రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలం నరసాపురపుపేటకు చెందిన పంపన శివయ్య పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు. శారీరకంగా మరుగుజ్జుతనం ఉన్నా.. మానసికంగా దృఢ చిత్తంతో ఎదిగాడు. అంగవైకల్యం వల్ల అతని చదువు 8వ తరగతిని మించి సాగలేదు. అయినప్పటికీ తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తన కన్నతల్లిని వృద్ధాప్యంలో కంటి పాపలా కాపాడుకున్నాడు. రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద పలు సమస్యలతో వచ్చే వారికి సహాయకారిగా ఉంటూ వారికి దరఖాస్తులు నింపడం, అర్జీలు రాయడం చేస్తూ తల్లిని పోషించుకునేవాడు. దూరపు బంధువైన ధనలక్ష్మిని శివయ్యను పెళ్లి చేసుకోమని బంధువులు అడిగారు. కన్నతల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్న శివయ్య వ్యక్తిత్వం తెలిసిన ఆమె వెంటనే వివాహానికి ఒప్పుకుంది. కానీ శివయ్య వివాహం చేసుకుంటే తన తల్లిని పోషించుకోలేమోనని భావించి పెళ్లికి నిరాకరించాడు. అయితే శివయ్యను ఇష్టపడిన ధనలక్ష్మి అతనినే పెళ్లి చేసుకోవాలని భావించి, నిరీక్షించింది. రెండేళ్ల తరువాత వృద్ధాప్యంతో తల్లి మరణించిన తరువాత ధనలక్ష్మి తన కోసం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తోందని తెలిసి ఆమెను 2006 పిబ్రవరి పదిన వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా కుమార్తె కల్యాణి జన్మించింది. శివయ్యకు 2013లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో సబ్‌స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. రామచంద్రపురం వైఎస్సార్ నగర్లో సొంత ఇల్లు ఉంది. కుమార్తె కల్యాణి ఏడో తరగతి చదువుతోంది. ఈ ప్రేమజంట తమ ప్రేమకు ప్రతిరూపమైన కుమార్తెను అల్లారుముద్దుగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ప్రేమకు కోవెల ఆ ఇల్లు కాకినాడ రూరల్: 1984లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆ దంపతులు ఆనాటి ప్రేమను వ్యతిరేకించిన పెద్దలను ప్రేమతోనే ఒప్పించారు. ఎవరేంటో, వారి మనసేంటో తెలియకుండా పెళ్లి చేసుకునే వారికంటే ఒకరి మనస్సు ఒకరు అర్ధంచేసుకున్న దంపతులు అన్యోన్యంగా ఉంటారనే విషయాన్ని పెద్దలకు వివరించిన దంపతులు మణమ్మ, శర్మ. కాకినాడ వాజపేయాజుల వారి వీధిలో 1983లో కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి నాగమణిని సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సీతారామ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా వారి సంతానమైన ఇద్దరబ్బాయిలకు ప్రేమ పెళ్లిళ్లే చేశారు. జమ్మలమడక నాగమణి, రామశర్మ దంపతుల కుమారులు రామ్‌లాల్ భరత్, రవితేజలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటానంటే సరే అని పెళ్లిళ్లు చేసిన ఘనత వారికే దక్కింది. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా కాపురాలు చేసుకుంటూ ఆదర్శ కుటుంబాలుగా పేరు పొందుతున్నారు. -
ఈ ప్రేమికులరోజు అంజలితో కాదు.. ఆయనతో..
సినిమా: ప్రేమికుల రోజును ఆయనతో జరుపుకోనున్నట్లు నటుడు జై చెప్పారు. జై ప్రముఖ సంగీత దర్శకుడు దేవాకు బంధువు. ఈయనలోనూ సంగీత కళాకారుడు ఉన్నాడు. అవును జై కీబోర్డు ప్లేయర్.అలాంటిది నటుడిగా రాణించడం విశేషం. ఈ సంచలన నటుడి గురించి రకరకాల ప్రచారం జరుగుతుంటుంది. షూటింగ్‌లకు సకాలంలో రారని, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరని, నటి అంజలితో ప్రేమ వ్యవహారం లాంటి ప్రచారం దుమారం రేపుతుంటుంది. అయినా నటుడిగా జై క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఇటీవల నటించిన బెలూన్,కలగలప్పు–2 చిత్రాలు సక్సెస్ అయ్యా యి. ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా మాలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా నటుడు జై మంగళవారం చెన్నైలో మీడియాతో మీట్ అయ్యారు. ప్ర: మీ సినీ ఎంట్రీ గురించి? జ: 2002లో నటుడు విజయ్ నటించిన భగవతి చిత్రంలో ఆయనకు తమ్ముడిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తరువాత స్టెప్ బై స్టెప్ నటుడిగా నన్ను నేను పెంచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. ప్ర: హీరోగా అవకాశం గురించి.? జ: గాయకుడు, నటుడు చరణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన నిర్మిస్తున్న చెన్నై 28 చిత్రానికి ఆడిషన్ జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళ్లాను. అయితే అక్కడికి వెళ్లే వరకూ ఆ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్శకుడన్న విషయం తెలియదు. ఆయన నాకు దగ్గర బంధువే. అలా చెన్నై–28 చిత్రం ద్వారా నలుగురు హీరోల్లో ఒకరిగా పరిచయం అయ్యాను. ప్ర:ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల వివరాలు? జ:వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా నీయా–2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇది పాము ఇతివృత్తంతో కూడిన కథా చిత్రమే అయినా గతంలో వచ్చిన నీయా చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. నేను నటిస్తున్న మరో చిత్రం కరుప్పనగరం. ఇందులో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఇందులో రాజకీయ నేపథ్యం కూడా ఉంటుంది. ఒక పాత్రలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటిస్తున్నాను. ప్ర: కొత్తగా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లున్నారు? జ:అవును మలయాళంలో మమ్ముట్టికి తమ్ముడిగా మదురైరాజాఅనే చిత్రంలో నటిస్తున్నాను. చాలా మంచి పాత్ర. ఈ చిత్రంతో మలయాళంలో హీరోగా మంచి అవకాశాలు వస్తాయని మమ్ముట్టి ప్రశంసించారు. ప్ర:శింబు హీరోగా వెంకట్‌ప్రభు తెరకెక్కించబోతున్న మనాడు చిత్రంలో మీరు నటించబోతున్నట్లు ప్రచారం గురించి? జ: వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించే అన్ని చిత్రాల్లోనూ నేను ఏదో ఒక పాత్రలో నటించాను. ఒక్క చిత్రంలో మినహా. అదే విధంగా మనాడు చిత్రంలోనే ఒక కీలక పాత్రలో నటిస్తాను. ప్ర:నటుడు విజయ్ నటించిన భగవతి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. మరోసారి ఆయనతో నటించే అవకాశం ఉందా? జ: విజయ్‌తో కలిసి నటించాలన్న కోరిక నాకూ ఉంది. భగవతి చిత్రంలో మాదిరి మంచి పాత్ర లభిస్తే విజయ్‌తో కలిసి కచ్చితంగా నటిస్తా. ప్ర: నటి అంజలితో కలిసి నటిస్తున్నారా? జ:లేదు. ప్ర: ప్రేమికుల రోజును ఎవరితో జరుపుకోనున్నారు? జ: ఈ సారి ప్రేమికుల రోజును ఒంటరిగానే జరుపుకోనున్నాను. ఇంకా చెప్పాలంటే ఆ రోజు మలయాళ చిత్రం మదురై రాజా షూటింగ్ చివరి రోజు. ఆ రోజు మమ్ముట్టితో కలిసి నటించనున్నాను. ప్ర: ఈ ఏడాది ఓ ఇంటి వాడు అయ్యే అవకాశం ఉందా? జ: చెప్పలేను. ఎందుకంటే పెళ్లి గురించి ఇంకా నిర్ణయించుకోలేదు. -
ప్రేమజంటలు రోడ్లపైకి రావొద్దు
సుల్తాన్‌బజార్: వాలెంటైన్ డే పేరుతో ఫిబ్రవరి 14న ప్రేమ జంటలు బయట తిరగరాదని భజరంగ్‌దళ్ నేతలు పేర్కొన్నారు. మంగళవారం కోఠి లోని విహెచ్పీ రాష్ట్ర కార్యాలయంలో భజరం గ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, నాయకులు శివరాములు, ముఖేశ్, జగదీశ్వర్, కుమార్ మా ట్లాడుతూ.....వాలెంటైన్ డే సందర్భంగా పబ్‌లు, మాల్స్, హోటల్స్, రెస్టోరెంట్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించ రాదన్నారు. ప్రేమ జంటలు బహిరంగంగా కనిపిస్తే పట్టుకుని వారి తల్లిదం డ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వాలేంటైన్ డే నిర్వహించే పబ్‌లు,రిసార్టుల, హో టళ్లు, మాల్స్‌పై దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు. దిష్టిబొమ్మల దహనాలు.. వాలెంటైన్ డేకు నిరసనగా ఫిబ్రవరి 14న రాష్ట్రం లోని ప్రధాన కూడళ్లలో వాలెంటైన్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుభాష్‌చందర్ తెలిపారు. అలాగే వాలెంటైన్ డే ను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
‘వాలంటైన్ డే’ను అడ్డుకుంటాం
సుల్తాన్‌బజార్: పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ వ్యతికిస్తున్నాయని, ఫిబ్రవరి 14న వాలంటైన్ డే పేరిట జరిగే అన్ని కార్యాక్రమాలను అడ్డుకుంటామని వీహెచ్‌పీ స్టేట్ కన్వీనర్ సుభాష్‌చందర్ తెలిపారు. బుధవారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటైన్ అనే వ్యక్తి రోమ్ రాజ్యానికి చెందిన దేశద్రోహి అని, అలాంటి వ్యక్తికి సంబంధించిన రోజున వారి దేశంలోనే ప్రేమికుల రోజు నిర్వహించడం లేదన్నారు. కానీ మన దేశంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రేమికుల రోజు పేరిట సమాజాన్ని, యువతను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా పబ్‌లు, రిసార్ట్స్, హోటళ్లలో ఈ కార్యక్రమాలను నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. తాము ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం కాదని, భజరంగ్‌దళ్ ప్రేమికుల దినోత్సవానికి మాత్రమే వ్యతిరేకంమన్నారు. ప్రేమికులు మల్టీనేషనల్ కంపెనీల ఉచ్చులో పడవద్దని సూచించారు. ఈ సందర్బంగా వాలంటైన్ డే వ్యతిరేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, మహంకాళి విభాగ్ కన్వీనర్ జీవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
లవ్ లాక్
ఫిబ్రవరి 14... ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులంతా తాము ప్రేమించిన వారిపై ప్రేమను రకరకాల రూపాల్లో చూపిస్తుంటారు. కొందరు గిఫ్ట్స్ ఇచ్చి, కొందరు సర్ప్రైజ్లు ఇచ్చి, ఒక్కొక్కరు ఒక్కోలా. ఎవరు ఎలా ప్రేమను చూపించినా కూడా ఆ ప్రేమను చిరకాలం జ్ఞాపకంగా మార్చుకోవటానికే. రామ్‌చరణ్, ఆయన వైఫ్ ఉపాసన కూడా ఈ వేలంటైన్స్ డేను ఆస్ట్రియాలో ఆ దేశ స్టైల్లోనే జరుపుకున్నారు. ‘రంగస్థలం’ షూటింగ్ కంప్లీట్ చేసుకొని హాలిడేకు వెళ్లిన రామ్‌చరణ్ దంపతులు వాళ్ల ప్రేమను లాక్ చేసుకున్నారు. ప్రేమను లాక్ చేసుకోవటం ఏంటీ? అనుకుంటున్నారా... లవ్‌ను లాక్ చేసుకోవటమే ఆస్ట్రియాలోని ‘సాల్జ్‌బర్గ్ లవ్ లాక్ బ్రిడ్జ్’ ప్రత్యేకత. ఆ బ్రిడ్జ్ మీద ఇద్దరి ప్రేమికుల పేర్లను ఒక లాక్ (తాళం కప్ప) పై రాసి, దాన్ని ఆ బ్రిడ్జ్‌కి సైడ్ ఉన్న ఫెన్స్‌కు లాక్ చేసి, ఆ కీను ఆ నదిలో పారేస్తారట. అలా చేస్తే వారి ప్రేమ విడదీయలేని బంధంగా మారుతుందని నమ్ముతారట. ఉపాసన కూడా ఉప్సీ–రామ్ అంటూ ఓ లాక్‌పై రాసి వేలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలో ఉప్సీ–రామ్ అని రాసి ఉన్న తాళం కనిపిస్తోంది కదా. అదే ఈ జంట లవ్ లాక్. -
ప్రేమ ఎంత మధురం..!
సిరిసిల్ల / కోల్‌సిటీ (రామగుండం) : ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోనా ఎన్నెన్నో కలలూ... ఎన్నెన్నో కథలూ...’ అంటూ ఓ సినీకవి ప్రేమ మాధుర్యంలోని అర్థాన్ని పాట రూపంలో ‘ప్రేమలేఖ’ను రాశాడు. అనుభవించే వారికి మాత్రమే ప్రేమలో ఉన్న మాధుర్యం అర్థమవుతుంది. ఫిబ్రవరి 14 ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల ప్రేమాలయంగా వర్ధిల్లుతోంది. దశాబ్దకాలంగా 30 జంటలు ఒక్కటయ్యాయి. వరకట్నాలు లేకుండా.. ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నారు. అక్కడ కొట్లాటలు.. గొడవలు.. ‘పరువు’ హత్యలు కనిపించవు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం... మాది ఖమ్మం జిల్లా ఇల్లందు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో లావణ్యకు, నాకు సీటు వచ్చింది. కాలేజీలోనే ఒకరికొరం పరిచయమయ్యాం. మా పరిచయం ప్రేమగా మారింది. మా ప్రేమను సిన్సియర్‌గా మా పేరెంట్స్‌కు చెప్పాం. ఇద్దరం డాక్టర్లమయ్యాక.. 2012 నవంబర్ 29న పెద్దల సమక్షమంలో పెళ్లి చేసుకున్నాం. నాలుగేళ్ల క్రితం మాకు బాబు గౌతంచంద్ర పుట్టడంతో రెండు కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. – డాక్టర్ మహేందర్, డాక్టర్ లావణ్య, గోదావరిఖని మనసుపడ్డాం.. ఏకమయ్యాం మాది కులాంతర వివాహం. తెలియకుండా ప్రేమలో పడ్డాం. మాటలు కలిసి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు పెళ్లి చేసుకున్నాం. తొలుత ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పినా.. వారి మనసు మార్చి ఏకమయ్యాం. – ముచ్చర్ల శ్రీనివాస్– అనిత దంపతులు ఒకరినొకరం అర్థం చేసుకున్నాం.. మామధ్య పరిచయం ప్రేమగా మారింది. ప్రేమపెళ్లి చేసుకుని ఏకమయ్యాం. పరస్పర అవగాహనతో జీవిస్తున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషాన్నిచ్చింది. స్థిరపడి పెళ్లి చేసుకోవాలి. – కుమ్మరి దిలీప్– శైలజ దంపతులు పెద్దలు ఆమోదిస్తేనే.. సంతోషం ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం పొందితేనే బాగుంటుంది. ఇల్లు విడిచిపోవడం.. కష్టపడి ఇంటికి చేరడం బాగుండదు. అయిన వారి మధ్య ఆప్యాయంగా జీవించాలన్నదే మా లక్ష్యం. ఇన్నేళ్ల జీవితంలో పొరపొచ్చలు వచ్చినా.. కలిసి జీవించడం ఆనందంగా ఉంది. – వెల్గం నవీన్– సంధ్య దంపతులు ప్రేమ కానుకలు కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రేమికుల రోజున ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇచ్చి పుచ్చుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. జువెల్లరి ఐటమ్స్ పట్ల మక్కువ చూపిస్తున్నారు. లాకెట్, చేతి ఉంగరాలు, లవ్ ఆకారంలో ఉండే వెండి వస్తువులపై దృష్టి సారించి వాటిని అందజేస్తూ తమ ప్రేమను చాటుతున్నారు. – విజయేందర్రాజు, షాప్ నిర్వాహకుడు, కరీంనగర్ -
శ్రీదేవి అంటే నాకు పిచ్చిప్రేమ!
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన బోనీ కపూర్.. తన భార్య శ్రీదేవి గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట ఆమెతో ప్రేమలో పడ్డానని, శ్రీ అంటే తనకిప్పటికీ పిచ్చి ప్రేమ అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చి దాదాపు పదిరోజులు గడవకముందే శ్రీదేవి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. హఠాన్మరణంతో ఇటు కుటుంబంలో, అటు సినీ పరిశ్రమలో, అభిమానుల్లో తీరని విషాదాన్నింపారు. ముఖ్యంగా శ్రీదేవిని అమితంగా ప్రేమించి.. ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించిన బోనీ కపూర్ తమ అనుబంధం గురించి ఎన్నో విషయాలు చెప్పిన ఆ ఇంటర్వ్యూ మళ్లీ మీకోసం.. ‘‘శ్రీ అంటే నాకిప్పటికీ పిచ్చి ప్రేమ. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు’’ అన్నారు బోనీ కపూర్. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని శ్రీదేవి లవ్ మ్యారేజ్ చేసుకుని 22 ఏళ్లవుతోంది. ‘వాలంటైన్స్ డే’ సందర్భంగా ఈ కపుల్ లవ్‌స్టోరీని శ్రీదేవి బెటరాఫ్ బోనీతో జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ► మీది లవ్ అట్ ఫస్ట్ సైట్ అట? అవును. యాక్చువల్‌గా శ్రీ (శ్రీదేవి)ని నేను డైరెక్ట్‌గా చూసి ప్రేమించలేదు. ఒక తమిళ సినిమా చూశాను. స్క్రీన్ మీద ఆమెను చూసిన ఫస్ట్ టైమే ప్రేమలో పడిపోయాను. వెంటనే శ్రీని కలవాలనిపించింది. బాంబే నుంచి మదరాసు వెళ్లాను. నిజానికి శ్రీ మదరాసులో ఉందో లేదో కూడా తెలుసుకోకుండా వెళ్లాను. తను లేదు. సింగపూర్‌లో షూటింగ్ చేస్తోంది. ఎంతో ఎగై్జటెడ్‌గా మదరాసు వెళ్లాను. డిజప్పాయింట్మెంట్తో బాంబే వెళ్లాను. ఆ తర్వాత హిందీ సినిమా ‘సోలవ్ సావన్’లో శ్రీని చూశాను. ఎలాగైనా కలవాలని ఆమె నటిస్తోన్న హిందీ సినిమా షూటింగ్‌కి వెళ్లాను. కానీ శ్రీ సరిగ్గా మాట్లాడలేదు. అపరిచితులతో పెద్దగా మాట్లాడదని అర్థమైంది. ఆ రోజు చాలా ముక్తసరిగా మాట్లాడింది. ఆ తర్వాత చాలా రోజుల వరకూ అంతే. తక్కువగా మాట్లాడేది. ► సినిమాలో అంటే మేకప్‌తో కనిపించి ఉంటారు కాబట్టి, గొప్ప అందగత్తె అనుకుని ఉంటారు.. మేకప్ లేకుండా చూసినప్పుడు ఏమనిపించింది? రీల్‌పై అయితే తమిళ్ పిక్చర్లో చూశాను. రియల్‌గా అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఏ మేకప్ లేకుండా తనని తానుగా చుశాను. నిజానికి శ్రీ మేకప్ లేకుండానే అందంగా ఉంటుంది. ‘షీ ఈజ్ మై ఫేవరెట్ లేడీ.. ఫేవరెట్ స్టార్. శ్రీదేవి సింప్లీ సూపర్’. ► మీ తమ్ముడు అనిల్ కపూర్‌తో నిర్మించిన ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవిగారిని తీసుకోవాలన్నది మీ నిర్ణయమేనా? శ్రీదేవితో సినిమా తీయాలని ఉండేది. అప్పుడు ‘మిస్టర్ ఇండియా’ ప్లాన్ చేస్తున్నాం. శ్రీతో సినిమా అంటే వాళ్ల అమ్మని అడిగాలి. కలిసి, అడిగాను. కానీ ఆవిడ పెద్దగా ఇష్టపడలేదనుకుంటా. 10 లక్షలు రెమ్యునరేషన్ అడిగారు. అప్పట్లో అంత అంటే పెద్ద విషయం. శ్రీ మీద ఉన్న ఇష్టం, ఆమెకు దగ్గర కావాలనే తపనతో 11 లక్షలిస్తానన్నా. ఒప్పుకున్నారు. ఆ సినిమా టైమ్‌లో మా మధ్య మాటలు పెరిగాయి. ► ఏ భాషలో మాట్లాడుకునేవాళ్లు? శ్రీ కొంచెం ఇంగ్లిష్, వచ్చీ రాని హిందీలో మాట్లాడేది. నాకు హిందీ, ఇంగ్లిష్ వచ్చు. కొంచెం తెలుగు మాట్లాడగలుగుతాను. ప్రొడ్యూసర్‌గా నా ఫస్ట్ సినిమాను దర్శకుడు బాపూగారితో తీశాను. ఆ సినిమా పేరు ‘హమ్ పాంచ్’. తెలుగులో బాపూగారు చేసిన ‘మన ఊరి పాండవులు’కి అది రీమేక్. బాపూగారితో నేను మొత్తం మూడు హిందీ సినిమాలు తీశాను. ఆ సమయంలో ఆయన ద్వారా కొంచెం తెలుగు అలవాటైంది. అది నాకు హెల్ప్ అయింది. ‘మిస్టర్ ఇండియా’ చేస్తున్నప్పుడు శ్రీదేవి అమ్మగారితో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతుండేవాణ్ణి. దాంతో ఇంకొంచెం తెలుగు నేర్చుకోగలిగాను. ఇప్పుడైతే 80 పర్సంట్ తెలుగు అర్థం చేసుకోగలుగుతాను. ► శ్రీదేవిగారికి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఆమె ఏమన్నారు? మూడు నెలల పాటు ఏమీ చెప్పలేదు తను. తర్వాత ఓకే చెప్పింది. ఆ మూడు నెలల్లో నేను చాలా టెన్షన్ పడ్డాను (నవ్వుతూ). ► శ్రీదేవిగారి అమ్మగారు ఏమన్నారు? యాక్చువల్లీ ఆవిడకు నా మీద మంచి అభిప్రాయం ఉండేది. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాతో డిస్కస్ చేసేవారు. ఫస్ట్ టైమ్ ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ‘బోనీజీ లాంటి అబ్బాయితో మా అమ్మాయికి ముడిపెట్టాలి’ అన్నారు. అప్పటికే ఆవిడకు నేనంటే చాలా నమ్మకం కుదిరింది. అందుకే తన కూతురికి నాలాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకున్నారు. చివరికి ఆవిడ కోరిక నెరవేరింది. ► మీ అత్తగారికి మీ మీద అంత నమ్మకం ఏర్పడటానికి కారణం ఏంటి? శ్రీ విషయంలో నేను చాలా కేరింగ్‌గా ఉండేవాణ్ణి. 30 ఏళ్ల క్రితం ‘కార్‌వ్యాన్’ ఉండేది కాదు. ‘మిస్టర్ ఇండియా’ సమయంలో శ్రీకి సెపరేట్‌గా మేకప్ రూమ్ ఏర్పాటు చేశాను. నా బేనర్లో వర్క్ చేస్తున్నప్పుడు శ్రీకి ఎలాంటి కష్టం కలగకూడదనుకున్నా. అది తన అమ్మగారు గ్రహించారు. అలాగే శ్రీ ‘చాందిని’ సినిమా షూటింగ్ చేస్తూ స్విట్జర్లాండ్‌లో ఉంటే, తనని కలవడం కోసం అక్కడికి వెళ్లాను. ఇవన్నీ చూసి, శ్రీ మీద నాకెంతో ప్రేమ ఉందో మా అత్తగారు అర్థం చేసుకున్నారు. అందుకే కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ► మీ అత్తగారితో మీకు మంచి బాండింగ్ ఉండేది కదా? అవును. శ్రీ కోసం ఆమె చాలా తపన పడ్డారు. నా మీద చాలా నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నేను నిజం చేశాను. ఆవిడకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఓ కొడుకులానే చూసుకున్నాను. ఆ సమయంలో శ్రీ చాలా దిగులు పడేది. తనని ఓదార్చడంతో పాటు అత్తగారిని బాగా చూశాను. అందుకే ఆవిడ సంతృప్తిగా కన్ను మూశారు. ఆ టైమ్‌లో శ్రీకి నేనిచ్చిన సపోర్ట్ మా మధ్య మరింత అనుబంధం పెంచింది. 1996లో మేం పెళ్లి చేసుకున్నాం. ► డైట్ విషయంలో శ్రీదేవి స్ట్రిక్ట్‌గా ఉంటారు. మీరేమో భోజనప్రియుడిలా కనిపిస్తున్నారు? (నవ్వేస్తూ). కరెక్టే. డైట్ విషయంలో తను చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. తను కంట్రోల్ చేసుకుంటూ నన్ను కంట్రోల్ చేస్తుంటుంది. వాస్తవానికి నేను భోజనప్రియుణ్ణి. హైదరాబాద్, చెన్నై వంటకాలు అంటే చాలా ఇష్టం నాకు. సదరన్ స్పైస్ ఆఫ్ తాజ్ నా ఫేవరెట్ రెస్టారెంట్. వారు నాకోసం స్పెషల్ ఫుడ్‌ను ఎరేంజ్ చేస్తారు. వీలు దొరికినప్పుడు ఫుడ్ లాగించడానికి ట్రై చేస్తాను. అలా చేస్తానని తనకి తెలుసు. చిన్నగా మందలిస్తుంది. నాకు రెండే రెండు బలహీనతలు. ఫస్ట్ నా కుటుంబం అయితే రెండోది నాకు ఇష్టమైన ఫుడ్. ► శ్రీదేవిగారు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినవి? ఒక రాధ ఇద్దరు కృష్ణులు, జగదేకవీరుడు అతిలోక సుందరి, క్షణ క్షణం, తమిళ్ నందకోకిల, హిందీ సద్మా ఇష్టం. జితేంద్రతో శ్రీ చేసిన ‘హిమ్మత్వాలా’ అంటే కూడా చాలా ఇష్టం. యాక్చువల్‌గా శ్రీతో ఎలాగైనా సినిమా తీయాలని బలంగా అనిపించడానికి ఆ సినిమా కూడా ఓ కారణం. అప్పుడే మా నాన్నగారి (నిర్మాత సురేందర్ కపూర్)తో శ్రీదేవితో సినిమా తీయాలనుందని చెప్పాను. ► భార్యగా, అమ్మగా శ్రీదేవిగారి గురించి? మా పిల్లలు జాన్వీ, ఖుషీ ‘బ్లెస్డ్’ అని చెప్పాలి. శ్రీదేవి ఫెంటాస్టిక్ మదర్. పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఓ ఫ్రెండ్‌లా అన్నీ అడిగి తెలుసుకుంటుంది. వారి ప్రతి అవసరాన్ని గుర్తించి, అది నెరవేరుస్తుంది. నా జీవితంలోకి తను రావడం నా అదృష్టం. మా పిల్లలు, నేను లక్కీ. కుటుంబానికి చాలా టైమ్ స్పెండ్ చేస్తుంది. చెప్పాలంటే మా ఫ్యామిలీకి తను ఒక పిల్లర్. ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది అంటారు. నా సక్సెస్ వెనకాల నా భార్య శ్రీదేవి ఉంది. ► మీ ఆవిడ గొప్ప అందగత్తె కదా.. ‘శ్రీదేవి అంటే చాలా లవ్’ అని కొంతమంది ఓపెన్‌గా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు.. మీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఇన్‌సెక్యూర్టీ ఏమైనా? నాకెలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. కో–స్టార్స్, డైరెక్టర్స్ శ్రీతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ విషయంలో నాకు జెలసీ కూడా లేదు. తనేంటో నాకు తెలుసు. నేనేంటో తనకు తెలుసు. ఒక భర్తగా ఆమెను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. మా మ్యారేజ్ లైఫ్‌లో మేం ఇన్సెక్యూర్టీకి గురైన ఇన్సిడెంట్స్ లేవు. ‘ఐయామ్ స్టిల్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్’. ► మీ పిల్లలు జాన్వీ, ఖుషీల్లో అమ్మ కూచి ఎవరు? నాన్న కూచి ఎవరు? అలా ఏం లేదు. మేమిద్దరంటే చాలా ఇష్టం. కాకపోతే మా పెద్దమ్మాయి జాన్వీ తన తల్లిలా. ఖుషీ మాత్రం నాలా. శ్రీ డైట్ వేరు. నా డైట్ వేరు. అమ్మ తిన్నట్లుగా జాన్వీ తింటుంది. ఖుషీ మాత్రం నన్ను ఫాలో అవుతుంది. శ్రీ దృష్టంతా హెల్తీ ఫుడ్ మీద ఉంటుంది. మేమంతా రెస్టారెంట్‌కి వెళితే, అక్కడ కూడా తన డైట్ ప్రకారమే ఆర్డర్ ఇస్తుంది. ఫుడ్ విషయంలోనే కాదు... ఫ్యాషన్ విషయంలో కూడా జాన్వీ తన తల్లిని ఫాలో అవుతుంది. – డి.జి. భవాని -
కలిపిన వాలంటైన్!
పాప్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న లేడీ గాగ... బాయ్‌ఫ్రెండ్స్‌తో రొమాన్స్ పండించడంలోనూ అంతే ఫేమస్! అయితే ఇన్నాళ్లూ డేటింగ్లకే పరిమితమైన ఈ సెక్సీ ర్యాపర్... నటుడు టేలర్ కిన్నెతో టైఅప్ అయింది. అదే... ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫింగర్లకు రింగులు మార్చుకున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ‘వాలంటైన్స్‌డేన అతడు తన హృదయాన్ని ఇస్తానన్నాడు. నేనూ అంగీకరించా’ అంటూ ఫొటోతో పాటు కామెంట్స్‌నూ షేర్ చేసిందీ సింగర్. వీకెండ్లో న్యూయార్క్‌లోని గాగ రెస్టారెంట్ జోయెన్ ట్రటోరియాలో ఓ అద్భుతమైన రొమాంటిక్ డిన్నర్‌ను ఆస్వాదించారు ఈ న్యూ కపుల్. విషయమేమంటే... ‘చికాగో ఫైర్’ యాక్టర్ టేలర్... లేడీకి ప్రపోజ్ చేసింది ఇక్కడే. అదే స్పాట్లో మెమరబుల్ పార్టీని కూడా వెంటనే ప్లాన్ చేసేసుకుని ఆ క్షణాలను అపురూపంగా మార్చేసుకున్నారు ఇద్దరూ! ఇక అసలుసిసలు రొమాన్స్ షురూ అవుతుందంటూ సంకేతాలు పంపించారు. సో... బెస్టాఫ్ లక్ టు దెయిర్ న్యూ లైఫ్!