పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సుభాష్‌చందర్ తదితరులు
సుల్తాన్‌బజార్: పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ వ్యతికిస్తున్నాయని, ఫిబ్రవరి 14న వాలంటైన్ డే పేరిట జరిగే అన్ని కార్యాక్రమాలను అడ్డుకుంటామని వీహెచ్‌పీ స్టేట్ కన్వీనర్ సుభాష్‌చందర్ తెలిపారు. బుధవారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటైన్ అనే వ్యక్తి రోమ్ రాజ్యానికి చెందిన దేశద్రోహి అని, అలాంటి వ్యక్తికి సంబంధించిన రోజున వారి దేశంలోనే ప్రేమికుల రోజు నిర్వహించడం లేదన్నారు. కానీ మన దేశంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రేమికుల రోజు పేరిట సమాజాన్ని, యువతను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా పబ్‌లు, రిసార్ట్స్, హోటళ్లలో ఈ కార్యక్రమాలను నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. తాము ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం కాదని, భజరంగ్‌దళ్ ప్రేమికుల దినోత్సవానికి మాత్రమే వ్యతిరేకంమన్నారు. ప్రేమికులు మల్టీనేషనల్ కంపెనీల ఉచ్చులో పడవద్దని సూచించారు. ఈ సందర్బంగా వాలంటైన్ డే వ్యతిరేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, మహంకాళి విభాగ్ కన్వీనర్ జీవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment