నైన్త్‌ క్లాస్ ‌నుంచే నిహా తెలుసు: చైతన్య | Sakshi Special Interview on Valentines Day | Sakshi
Sakshi News home page

‘ఏమైపోతావో నువ్వు’ అంటుంటారు..

Published Sun, Feb 14 2021 3:41 AM | Last Updated on Sun, Feb 14 2021 12:03 PM

Sakshi Special Interview on Valentines Day

లాక్‌డౌన్‌లో మనసు తలుపులు తెరిచారు. ‘ఐ లవ్‌ యు’ అని చెప్పుకున్నారు. ఒకరి మనసులో ఒకరు లాక్‌ అయ్యారు. 27 మే 2020... లవ్‌లాక్‌! 9 డిసెంబర్‌ 2020... వెడ్‌లాక్‌!! నిహారిక – వెంకట చైతన్య ఒకింటివారయ్యారు. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీకి స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. నిహా–చై చెప్పిన బోలెడన్ని విశేషాలు  మీకోసం...

► పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్‌ వేలంటైన్స్‌ డేని ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు?
నిహారిక: ప్రస్తుతానికి ప్లాన్‌ చేయలేదు. సర్‌ప్రైజ్‌ ఏంటో నాకూ ఇంకా తెలీదు.
చైతన్య: ముందే చెప్పేస్తే ఎలా? సస్పెన్స్‌.

► పెళ్లి తర్వాత మీ ఇద్దరి ఫస్ట్‌ ఇంటర్వ్యూ...
చైతన్య: చాలా ఎగై్జటింగ్‌గా ఉంది.
నిహా: ఇలా ఇద్దరూ ఇంటర్వ్యూ ఇస్తామని నేను ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్‌.

► పెళ్లికి ముందే మీ ఇద్దరికీ పరిచయం ఉందా?  
నిహా: మేం స్కూల్‌లో క్లాస్‌మేట్స్‌.
చైతన్య: నైన్త్‌క్లాస్‌ చదువుతున్నప్పుడు నిహా తెలుసు.




► పెళ్లి తర్వాత పరస్పరం ఏం తెలుసుకున్నారు?
నిహా: పెళ్లయి 2నెలలేగా. కోవిడ్‌ వల్ల బయట ఎక్కువతిరగలేదు.
చైతన్య: పాజిటివ్‌ థింగ్స్‌ తెలుసుకున్నాం.

► ఒకరి గురించి మరొకరు ఏం చెబుతారు?
నిహా: చూడ్డానికి కామ్‌గా ఉంటాడు. ఎక్కువ మాట్లాడడు. క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో అయితేనే సరదాగా మూవ్‌ అవుతాడు.
చైతన్య: మేం క్వైట్‌ ఆపోజిట్‌. తను బాగా మాట్లాడుతుంది.

► మీ రెండు కుటుంబాలు కంప్లీట్‌ ఆపోజిట్‌. ఒకరిదేమో ఫిల్మ్‌ ఇండస్ట్రీ. మరొకరిదేమో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌. ఏమనిపిస్తోంది?
నిహా: అన్యోన్యంగా ఉంటే చాలని ఇరు కుటుంబాల్లో అనుకున్నారు.

► మీ ఫ్యామిలీలో మీరే ప్రిన్స్‌.. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది.
నిహా: పెళ్లి తర్వాత ఒకరి ఇంటికి వెళ్లాల్సి వస్తుందని నేనెక్కువగా ఆలోచించలేదు. అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు ఫుడ్‌ తినాలంటే డైనింగ్‌ టేబుల్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా ఫుడ్‌ అంటే బెడ్‌పైకి తీసుకొచ్చి పెడుతుంది అమ్మ. చాలా కేరింగ్‌.

► మీ ఇంట్లో ఏ టైమ్‌కి నిద్రలేచినా అడగరు.. ఇప్పుడు అత్తారింట్లో అయితే త్వర గా లేవకుంటే ఏమనుకుంటారో అనే ఫీలింగ్‌ ఉంటుంది కదా?
నిహా: ఇంట్లో నేను పడుకుని ఉన్నప్పుడు ఎవరూ లేపేవారు కాదు. అయితే పెళ్లయ్యాక కూడా నేను కంఫర్ట్‌గా ఉన్నాను. మా నాన్నకి (నాగబాబు) అయితే కొంచెం భయం ఉంటుంది (నవ్వుతూ). మా నాన్నేమో ఎప్పుడూ ‘మై డాటర్‌ ఈజ్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌’ అంటుంటారు. మా అన్నతోనూ (వరుణ్‌ తేజ్‌) క్లోజ్‌గా ఉంటా. చిన్నప్పుడు కొట్టుకునేవాళ్లం.

► మీ ఇద్దరిలో ఎవరు లేట్‌గా నిద్రలేస్తారు?
చైతన్య: తనే (నవ్వుతూ).
నిహా: అంటే షూటింగ్‌ ఉన ్నప్పుడు కాదు లేనప్పడే!

► మీకేమైనా సినిమాల్లోకి వచ్చే ప్లాన్స్‌ ఉన్నాయా? వస్తే మీరిద్దరూ కలిసి చేసే ఆలోచన ఉందా?
నిహా: చాన్సే లేదు. రియల్‌ లైఫ్‌లో మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనిపించుకుంటే చాలు.
చైతన్య: అస్సలు సినిమాలు చేసే ఆలోచన లేదు.  

► పెళ్లి తర్వాత మీరు కమిటైన సినిమాలున్నాయా?  
నిహా: ఇంకా లేదు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా.


 


► మీ ఇద్దరిలో ఎక్కువ కోపం ఎవరికి?
నిహా: తనకే (నవ్వుతూ). క్యూట్‌గా కోప్పడతాడు.
చైతన్య: అలాంటిదేం లేదు.

► మీలో ఎవరు ముందు సారీ చెబుతుంటారు?
నిహా: తనే. ముందు తనే సారీ చెప్పేలా చేసుకుంటాను.
చైతన్య: తర్వాత తను కూడా నాకు సారీ చెబుతుంది.

► మీ ప్రేమను వ్యక్తపరచుకున్న రోజు?
ఇద్దరూ: 27 మే 2020.

► చైతన్యతో మీ పెళ్లి అనుకుంటున్న సమయంలో మీ పెదనాన్న చిరంజీవి, మీ బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారు?
నిహారిక: మేం చెప్పామని కాదు... నిజాయతీగా మీరు ఒకరినొకరు ఇష్టపడి ఉంటే పెళ్లి చేసుకోండి అన్నారు పెదనాన్న.

► అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని నిహారిక పేరెంట్స్‌ మీకు చెప్పారా?
నిహా: నాన్న, అమ్మ, అన్న... ఇప్పటికీ ‘ఏమైపోతావోనువ్వు’ అంటుంటారు(నవ్వు).  

► మీ ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు. నిజజీవితంలో ఇష్టమైన హీరో?
నిహా: మై ఫాదర్‌ ఈజ్‌ మై హీరో. ఆ తర్వాత అన్న.. ఇద్దరూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఆన్‌ స్క్రీన్‌లో పెదనాన్నగారు.  

► పెళ్లప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఓ సీక్రెట్‌ చెబుతా అన్నారు.. ఇంతకీ ఏంటీ ఆ రహస్యం?
నిహా: ఏ రహస్యమూ లేదు. ఊరికే ఫొటో ఫోజు కోసం అలా వాడాను.

► మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌?
నిహారిక: చై ఈజ్‌ ద బెస్ట్‌ (నవ్వుతూ)
చైతన్య: నిహా ఈజ్‌ ద బెస్ట్‌ (నవ్వులు).

ఈ రోజు ‘సాక్షి’ టీవీలో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మెగా లవ్‌ ముచ్చట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement