‘‘కొత్త సినిమాలు బాగా ఆడినప్పుడు నిర్మాతలకు వచ్చే ఆ కిక్కే వేరు. ‘కమిటీ కుర్రోళ్ళు’ లాంటి చిత్రాలు సక్సెస్ చూసినప్పుడు ఇంకా చాలామంది నిర్మాతలు కొత్త తరహా సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. అప్పుడే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీ రాధా దామోదర స్టూడియోస్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటించిన ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఈ ఏడాది ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం యాభై రోజులను పూర్తి చేసుకుంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 50 డేస్ సెలబ్రేషన్స్కి ‘దిల్’ రాజు హాజరయ్యారు. నిహారిక మాట్లాడుతూ–‘‘ ఓ మంచి సినిమా తీస్తున్నామనుకున్నాం. కానీ, 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందనుకోలేదు. ‘దిల్’ రాజుగారు నాకు స్ఫూర్తి. ఆయనలా డిఫరెంట్, కమర్షియల్ సినిమాలు చేయాలని ఉంది’’ అని తెలిపారు. ‘‘నా తొలి సినిమా 50 రోజుల వేడుక జరుపుకోవడం హ్యాపీ’’ అని పేర్కొన్నారు యదు వంశీ. ‘‘సినిమాను సహజంగా తీసే యదువంశీకి ఇంకా మంచి పేరు రావాలి’’ అని నిర్మాత ఫణి అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నాగబాబు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment