ప్రేమజంటలు రోడ్లపైకి రావొద్దు | Bajrang Dal Team Warning to Lovers Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమజంటలు రోడ్లపైకి రావొద్దు

Published Wed, Feb 13 2019 10:40 AM | Last Updated on Wed, Feb 13 2019 10:40 AM

Bajrang Dal Team Warning to Lovers Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సుల్తాన్‌బజార్‌: వాలెంటైన్‌ డే పేరుతో ఫిబ్రవరి 14న ప్రేమ జంటలు బయట తిరగరాదని భజరంగ్‌దళ్‌ నేతలు పేర్కొన్నారు. మంగళవారం కోఠి లోని  విహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో భజరం గ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌చందర్, నాయకులు శివరాములు, ముఖేశ్, జగదీశ్వర్, కుమార్‌  మా ట్లాడుతూ.....వాలెంటైన్‌ డే సందర్భంగా పబ్‌లు, మాల్స్, హోటల్స్, రెస్టోరెంట్‌లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించ రాదన్నారు. ప్రేమ జంటలు బహిరంగంగా కనిపిస్తే పట్టుకుని వారి తల్లిదం డ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. వాలేంటైన్‌ డే నిర్వహించే పబ్‌లు,రిసార్టుల, హో టళ్లు, మాల్స్‌పై దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు. 

దిష్టిబొమ్మల దహనాలు..
వాలెంటైన్‌ డేకు నిరసనగా ఫిబ్రవరి 14న రాష్ట్రం లోని ప్రధాన కూడళ్లలో వాలెంటైన్‌ దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుభాష్‌చందర్‌ తెలిపారు. అలాగే వాలెంటైన్‌ డే ను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement