bajrang dal warning
-
హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్..
డిస్పూర్: ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు.. యువతీయువకులు బయట జంటగా కనిపిస్తే.. పెళ్లి చేస్తాం అని బెదిరించే బజరంగ్ దళ్ కార్యకర్తలు తాజాగా క్రైస్తవుల పవిత్ర పర్వదినం క్రిస్టమస్ మీద పడ్డారు. హిందువులు ఎవరైనా క్రిస్టమస్ నాడు చర్చికి వెళ్తే చితకబాదుతాం జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ మిథు నాథ్ అస్సాం కాచర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథ్ ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం.. కొన్ని రోజుల క్రితం క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న మేఘలయాలో వివేకానంద సెంటర్‌ని మూసి వేశారు. ఆ కోపంతో నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రైస్తవులు మన పవిత్ర పుణ్యక్షేత్రాలను మూసి వేశారు. ఈ స్థితిలో ఎవరైనా హిందువులు, చర్చికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో మేం చాలా సీరియస్‌గా ఉన్నాం’ అన్నారు. ( సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!) అంతేకాక ‘మా మాటలు కాదని ఎవరైనా చర్చికెళితే.. మేం వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత రోజు పేపర్లో మేం హెడ్‌లైన్స్‌లో నిలుస్తాం. "గుండాదళ్" ఓరియంటల్ పాఠశాలను ధ్వంసం చేసింది.. అని పేపర్లో వస్తుంది. కాని అది మా ప్రాధాన్యత కాదు. షిల్లాంగ్‌లోని క్రైస్తవులు మన దేవాలయాల ద్వారాలను లాక్ చేస్తున్నప్పుడు హిందువులు వారి కార్యక్రమాలలో పాల్గొనడాన్ని మేం అనుమతించము’ అని మిథు నాథ్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఖాసీ విద్యార్థి సంఘం రామకృష్ణ మిషన్ ఆలయాన్ని మూసివేసింది అని తెలిపారు. అయితే, ఈ వాదనను మేఘాలయ ప్రభుత్వ ఉన్నతాధికారి ఖండించినట్లు సమాచారం. డిస్ట్రిక్ హాలీడే కావడంతో సాంస్కృతిక కేంద్రం మూసివేశారని.. లాక్ చేయలేదని సదరు అధికారి తెలిపారు. -
ప్రేమజంటలు రోడ్లపైకి రావొద్దు
సుల్తాన్‌బజార్: వాలెంటైన్ డే పేరుతో ఫిబ్రవరి 14న ప్రేమ జంటలు బయట తిరగరాదని భజరంగ్‌దళ్ నేతలు పేర్కొన్నారు. మంగళవారం కోఠి లోని విహెచ్పీ రాష్ట్ర కార్యాలయంలో భజరం గ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, నాయకులు శివరాములు, ముఖేశ్, జగదీశ్వర్, కుమార్ మా ట్లాడుతూ.....వాలెంటైన్ డే సందర్భంగా పబ్‌లు, మాల్స్, హోటల్స్, రెస్టోరెంట్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించ రాదన్నారు. ప్రేమ జంటలు బహిరంగంగా కనిపిస్తే పట్టుకుని వారి తల్లిదం డ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వాలేంటైన్ డే నిర్వహించే పబ్‌లు,రిసార్టుల, హో టళ్లు, మాల్స్‌పై దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు. దిష్టిబొమ్మల దహనాలు.. వాలెంటైన్ డేకు నిరసనగా ఫిబ్రవరి 14న రాష్ట్రం లోని ప్రధాన కూడళ్లలో వాలెంటైన్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సుభాష్‌చందర్ తెలిపారు. అలాగే వాలెంటైన్ డే ను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పెళ్లి చేసేస్తాం: ప్రేమపక్షులకు వార్నింగ్
వేలంటైన్స్ డే వచ్చిందంటే చాలు... రోడ్లు, పార్కులు, చెరువు గట్లు ఇలా అన్నిచోట్లా ఒకటే హడావుడి. అయితే, ప్రేమపక్షులను బెదిరించేందుకు మరో వర్గం కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. తాజాగా ఒడిషాలో వేలెంటైన్స్ డే సందర్భంగా బజరంగ్ దళ్ ప్రేమికులను హెచ్చరించింది. ప్రతిసంవత్సరంలాగే ఈసారి కూడా ప్రేమికుల రోజునాడు తాము గమనిస్తూ ఉంటామని, యువతీ యువకులు కలిసి కనిపిస్తే వాళ్లకు పెళ్లి చేసేస్తామని హెచ్చరించారు. వేలెంటైన్స్ డే అనేది భారతీయ సంస్కృతి కాదని, అందువల్ల పెళ్లి కాకుండానే యువతీ యువకులు కలిసి తిరగడం సరికాదని బజరంగ్ దళ్ వాదిస్తోంది. గతంలో కూడా బహిరంగ స్థలాల్లో కలిసి తిరుగుతున్న చాలామంది యువతీ యువకులను బజరంగ్ దళ్ కార్యకర్తలు వేలెంటైన్స్ డే రోజున పట్టుకుని వారికి దాదాపు పెళ్లిళ్లు చేసినంత పని చేశారు. అలాగే దీనికి సంబంధించిన బహుమతులు, ఇతర వస్తువులను అమ్మే దుకాణాల మీద దాడులు చేశారు. యువ ప్రేమికులు పార్కులు, మాల్స్, ఇతర బహిరంగ స్థలాల్లో కనిపిస్తే తాము కచ్చితంగా వాళ్లకు పెళ్లి చేస్తామని భువనేశ్వర్ బజరంగ్ దళ్ సమన్వయకర్త భూపేష్ కుమార్ నాయక్ హెచ్చరించారు. ప్రేమ పేరుతో యువతీ యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకమని నాయక్ అన్నారు. కేవలం పెళ్లి చేయడమే కాక.. ఇద్దరి తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్ల ముందు చేస్తామన్నారు. ఇంతకుముందు ఇలాగే తాళి కట్టిస్తే, కాసేపటి తర్వాత ఆ తాళిని కూడా తీసి పారేసిన సందర్భాలు ఉండటంతో ఇలా చేస్తున్నారు.