Valentine Day 2022 Special: New Telugu Movies Update List Here - Sakshi
Sakshi News home page

Valentines Day: పూజా హగ్దేకు ప్రపోజ్‌ చేసిన ప్రభాస్‌!, కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరో చెప్పెసిన రవితేజ..

Published Tue, Feb 15 2022 8:15 AM | Last Updated on Tue, Feb 15 2022 11:29 AM

Valentine Day: New Telugu Movies Update List Here On This Special Day - Sakshi

ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా సోమవారం ప్రేమతో పలు అప్‌డేట్స్‌ ఇచ్చాయి ఆయా చిత్రబృందాలు. ఒకరు సాంగ్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తే, మరొకరు టీజర్‌ గిఫ్ట్స్‌ ఇచ్చారు. ఇంకొకరు ప్రేయసి లుక్స్‌ను రివీల్‌ చేశారు. ఇలా ఎవరికి వీలైనట్లు వారు ప్రేమికుల రోజున అప్‌డేట్స్‌తో ఆడియన్స్‌కు లవ్‌ గిఫ్ట్స్‌ ఇచ్చారు. ఈ బహుమతుల తాలూకు వివరాల్లోకి మీరూ ఓ లుక్కేయండి.

‘‘పిల్లలూ పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్‌ సందడికై తయారుకండి. ఫన్‌ పిక్నిక్‌కి డేట్‌ ఫిక్స్‌ చేశాం’ అంటూ ‘ఎఫ్‌ 3’ టీమ్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. మే 27న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించారు.

ఇక ఈ ప్రేమికుల రోజున డాక్టరు ప్రేరణకు ప్రపోజ్‌ చేశాడు విక్రమాదిత్య. ‘రాధేశ్యామ్‌’ చిత్రంలోని సీన్‌ ఇది. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. కె. రాధాకృష్ణ  ్ణకుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.

ఇక సిల్వర్‌ స్క్రీన్‌పై తన కొత్త ప్రేయసి ఎవరనేది అధికారికంగా చెప్పేశారు రవితేజ. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ‘ధమాకా’ చిత్రంలో ప్రణవి అనే అమ్మాయిని ప్రేమిస్తారు రవితేజ. ప్రణవి అంటే ఎవరో కాదండోయ్‌. ‘పెళ్లి సందడి’తో పరిచయమైన శ్రీ లీల అన్నమాట. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాత.

మరోవైపు ‘వారియర్‌’ మనసులో విజిల్‌ వేసి మరీ ప్రేమ పుట్టించింది మహాలక్ష్మి. రామ్‌ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్‌’ అనే యాక్షన్‌ ఫిల్మ్‌ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న కృతీ శెట్టి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజిల్‌ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తారు కృతి. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఇంకోవైపు ఆద్య పక్కన ఉంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారు శర్వానంద్‌. ఆద్యా అంటే శర్వా రీల్‌ లైఫ్‌ పార్ట్‌నర్‌. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా చేసిన రష్మికా మందన్నాయే ఈ ఆద్య. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ‘హో... ఆద్య’ అనే సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.

మరోవైపు ‘లవ్‌ మొళి’ అవతారం ఎత్తారు నవదీప్‌. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ మొళి’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రశాంత్‌ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. వీతోపాటు మరికొన్ని చిత్రబృందాలు సాంగ్స్, కొత్త పోస్టర్స్‌తో ప్రేమికుల దినోత్సవానికి ప్రేక్షకులకు ప్రేమ కానుక ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement