![Bike Robbery Gang Arrest in Vizianagaram - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/30/bike.jpg.webp?itok=hvIYsbo8)
మోటారు సైకిళ్లతో సీఐ, హెచ్‌సీ, కానిస్టేబుళ్లు్చ
విజయనగరం, బొబ్బిలి: చిన్నతనంలోనే దురలవాట్ల బారినపడి, వాటిని తీర్చుకునేందుకు మోటరు సైకిళ్ల దొంగతనాలకు అలవాటు పడిన బాలలను అదపులోకి తీసుకున్నట్టు సీఐ దాడి మోహనరావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఇటీవల ఛేదించిన కేసు తాలుకా వివరాలు తెలియపర్చారు. ముగ్గురు బాలలు బొబ్బిలి, బాడంగి, చీపురుపల్లి, రాజాం, విజయనగరం స్టేషన్ల పరిధిలోని మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బైక్‌లను దొంగతనం చేసి వాటిని విక్రయించేవారు.
ఇటీవల ఒక బైక్‌ను దొంగతనం చేస్తున్న సమయంలో వారిని పట్టుకున్న తరువాత మొత్తం వారు దొంగతనం చేసిన బైక్‌ల గురించి కూపీ లాగితే 16 మోటారు సైకిళ్లను సదరు బాలలు దొంగిలించినట్టు తేలిందన్నారు. వీటి విలువ రూ.3.30 లక్షలు ఉంటుందని అంచనావేశారు. క్రైం హెచ్‌సీ శ్యామ్ సుందరరావు, కానిస్టేబుళ్లు, తిరుపతినాయుడు, చిన్నారావు, శ్రీరామ్‌లు బాలలను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే అదుపులోకి తీసుకుని రికవరీ చేసినట్లు తెలిపారు. బాలలు కావడంతో వారి తల్లిదండ్రులకే సంరక్షణ నిమిత్తం అప్పగించినట్లు పేర్కొన్నారు. మోటారు సైకిళ్లను న్యాయమూర్తి ఆదేశాలు, సూచనలతో మరికొద్ది రోజుల్లో యజమానులకు అప్పగిస్తామని తెలిపారు. బాలలను సున్నితంగా విచారించి వారి నుంచి రికవరీ చేసేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లను సీఐ మోహనరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment