Minor boys
-
రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు!
సాక్షి, నంద్యాల/పగిడ్యాల/నందికొట్కూరు : అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారి అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియక పోవడం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత బాలురు చెబుతుండటంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు నిద్ర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో పోలీసుల విచారణ నత్త నడకను తలపిస్తోంది. దీంతో తమ బిడ్డ ఆచూకీ తెలియజేయండని బాలిక తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. బాలిక ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోమవారం రాత్రి పోలీసులు మేల్కొన్నారు. మంగళవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు కొత్త ముచ్చుమర్రి పార్క్‌లో పనిచేసే సిబ్బందిని విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని చోట్లా వెతికినా ఫలితం శూన్యం నిందితులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన సుమారు 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను కృష్ణా నది నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌజ్ వరకు ఉన్న లింక్ చానల్లో పడేశామని చెప్పడంతో పోలీసు సిబ్బంది కాలువను జల్లెడ పట్టారు. స్పీడ్ బోట్లతో కాలువ మొత్తం గాలించారు. గజ ఈత గాళ్ల సాయం తీసుకున్నారు. వలలు వేసి వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి నిందితులను మరోసారి విచారించగా లింక్ చానల్లో కాదు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లో పడేశామని చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరూ నేరం తాను చేయలేదని వాడే చేశాడంటూ ఒకరిపై ఒకరు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తనకేమీ తెలియదని, బాలికను వారిద్దరే చంపేశారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు ఆచితూచి విచారిస్తున్నారు. నీటి కుక్కలు తినేశాయా? చిన్నారిని ఆదివారం రాత్రే గొంతు నులిమి విద్యార్థులు హత్య చేసినట్లు సమాచారం. వీరికి పెద్దలు ఎవరైనా సహకారం అందించారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ లింక్ చానల్లో పడేసినట్లయితే మూడు రోజులకే మృతదేహం నీటిపై తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న నీటి కుక్కలు శవాన్ని పీక్కుతినేశాయా అనే అనుమానం పోలీసులను వేధిస్తోంది. శుక్రవారం సీన్ రీ కన్స్ట్రక్షన్ (బాలికను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు.. ఎక్కడ రేప్ చేశారు.. ఎలా గొంతు నులిమి చంపేశారు.. అన్న వివరాలను నిందితుల నుంచి స్పాట్‌కు తీసుకెళ్లి రాబట్టడం) చేసినట్లు తెలిసింది. అయినా బాలిక ఆచూకీ తెలుసుకోలేక పోవడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ విజయరావు ఘటనా స్థలికి ఇలా వచి్చ.. అలా వెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మైనర్ బాలిక ఫ్లెక్సీతో బంధువులంతా రోడ్డెక్కి ‘వుయ్ వాంట్ జస్టిస్’ అని నినదించారు. కొత్త ముచ్చుమర్రి నుంచి పాత ముచ్చుమర్రి క్రాస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి స్టేషన్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు. ఆరు రోజులైనా తమ పాప ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఐజీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్ఐ జయశేఖర్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సంయమనం పాటించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకీయా బేగం పరామర్శించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులుబాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు బ్రాహ్మణకొట్కూరు వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితుల వద్దకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఎట్టకేలకు బాధిత చిన్నారి తండ్రినే అక్కడికి పిలిపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీహార్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ప్రతిపక్ష పార్టీల నాయకులను బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపిస్తున్నారన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిళ్లతో ఇలా చేస్తున్నారని ప్రశి్నంచారు. తన సొంత గ్రామంలో బాలిక హత్య జరిగితే, ఆ కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు. ముచ్చుమర్రికి తాను వెళితే నిజాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారా అని నిలదీశారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, చంద్రమౌళి, రవియాదవ్, తులసిరెడ్డి, రమే‹Ùనాయుడు, ఉపేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, ఓంకార్‌రెడ్డి, శ్రీకాంత్, నాగభూషణంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా.. బైక్ డ్రైవింగ్ చేస్తూ.. చివరికి..
జోగులాంబ: వింత పోకడలు ఎక్కువైపోయాయి. సరదా వ్యసనాలపై మోజు పడుతూ రోడ్డుపై బైక్‌లను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పిల్లలపై నిఘా పెట్టకపోవడంతో పలువురు మైనర్లు మద్యానికి అలవాటు పడుతూ వారి జీవితాన్ని చేజేతులా అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. జిల్లాలోని మైనర్ల చేతిలో బైక్ ఉంటే.. వారి స్పీడ్‌కు కళ్లెం వేయలేని దుస్థితి ఏర్పడింది. ఇదే వారి జీవితంలో రాంగ్ రూట్‌గా మారింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి కటకటాలపాలైన సంఘటనలు ఉన్నాయి. వక్రమార్గంలో వెళ్లకుండా.. స్నేహితుల్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే చాలు పట్టణ శివారు ప్రాంతాల్లో అర్ధారాత్రి 12 గంటలు దాటగానే నడిరోడ్డుపైకి వచ్చి కేక్ కట్ చేసి హంగామా చేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద చిన్నారులకు మద్యం విక్రయించబోమనే నిబంధన ఉన్నా.. అమలు కావడం లేదు. రాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్ సమయంలో పోలీసులకు దొరికిన సంఘటనలు ఉన్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది. తల్లిదండ్రులు ఇప్పటికై న మేల్కొని తమ పిల్లలపై నిఘా పెట్టి వక్రమార్గంలో వెళ్లకుండా చూసుకోవాలి. ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు, సామగ్రి చోరీ చేయడం వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించి వచ్చిన నగదుతో మద్యం, పొగాకు, పాన్‌మసాల, జర్ధ తదితర వాటిని తీసుకుంటున్నారు. పరోక్షంగా ప్రోత్సాహం.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు బైక్ నేర్పిస్తుంటారు. అయితే వారి చేతికి బైక్ ఇవ్వడం తప్పని తెలిసినా.. ఏదైనా పని ఉంటే ఆసరా అవుతారనే భావనతో తల్లిదండ్రులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలేమో సరదాగా ఇద్దరు, ముగ్గురు స్నేహితులను ఎక్కించుకుని బైక్‌లపై దూసుకెళ్తున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి కిందపడిన సంఘటనలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు వారిని నిలువరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్ చేస్తూ.. పట్టుబడుతున్నారు. ఈ ఏడాది 60కు పైగా కేసులు నమోదయ్యాయి. జరిమానా రూపంలో రూ.26 వేలు విధించారు. ఆగస్టు 15న మైనర్లు రోడ్డుపై బైక్‌లతో చేసిన హంగామా అంతా ఇంత కాదు. వారిని నిలువరించే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐకి గాయాలయ్యాయి. వ్యసనాలకు అలవాటు పడిన ముగ్గురు మైనర్లు డబ్బులు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. చోరీల దారిని వెతుకున్నారు. నూతన నిర్మాణంలోని ఇళ్లలో కాపర్ వైర్, ఇనుప కడ్డీలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న క్రమంలో పట్టుబడి కటకటాలపాలయ్యారు. 17 ఏళ్ల బాలుడు ప్రేమ పేరిట పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వేంధిపులకు గురిచేశాడు. బాలికను బయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి జువైనెల్ హోంకు తరలించారు. యుక్త వయస్సులోనే చెడు అలవాట్లకు గురవుతున్నారు. మరోవైపు నిత్యం రోడ్డుపై మైనర్లు బైక్‌లను పరిమితికి మించిన వేగం, శబ్ధ కాలుష్యం, విన్యాసాలు, సినిమా తరహాలో బైక్ చేజింగ్లతో పోటీ పడుతున్నారు. -
యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు మైనర్ల అరెస్ట్
ముంబై: ముంబైలోని ఈస్ట్రన్ ఉపనగరం గోవండీ ప్రాంతంలో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానిక శివాజీనగర్ ఏరియాలోని మట్టీరోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం పనిలోకి వెళ్లిన యువతి సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని, మాట్లాడాలని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని ఓ మురికివాడలోని చిన్ని గదిలో బంధించివేశాడు. చదవండి: (నేరస్తుల పాలిట సింహస్వప్నం.. ఏఏ ఖాన్ కన్నుమూత) అనంతరం అతని స్నేహితులకు సమాచారం అందించి ఆ యువతిపై నలుగురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి నిందితులు పారిపోయారు. వెంటనే బాధితురాలు లేచి జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులపై ఐపీఎస్ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (విద్యుత్ బిల్లు కొట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం) -
ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డ మైనర్ బాలురు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ మండలం సుజాతనగర్లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలపై, ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై అదే గ్రామానికి చెందిన 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో బాలికలతో ఆడుకుందాం అని చెప్పి ఒక ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. చదవండి: (టిక్‌టాక్ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్) అదే సమయంలో పక్కన ఉన్న వేరొకరు చూసి అరవడంతో బాలురు ఇద్దరు బయటకు పారిపోయారు. బాలికల తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో బాలురుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు బాలురుపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. దారుణానికి పాల్పడ్డ బాలురుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి దారుణం) -
సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు
ముంబై: హిందీలో ప్రసారం అయ్యే సీఐడీ షోకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. ఈ షో తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఇక్కడ కూడా దీనికి చాలా మంది ఫ్యాన్స్. అయితే ఈ షోను స్ఫూర్తిగా తీసుకుని పుణెకు చెందిన ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ వివరాలు.. ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. షాలిని బద్నారావు సోనావానే(70) అనే వృద్ధురాలు పుణెలోని సయాలి అపార్ట్మెంట్లో నివసిస్తుండేది. నిందితులిద్దరు షాలిని ఇంటికి సమీపంలోనే ఉండేవారు. వృద్ధురాలు ఒక్కతే ఒంటరిగా అపార్ట్మెంట్లో నివసిస్తుందని గ్రహించారు. ఆమె ఇంటిలో దొంగతనం చేయాలని భావించారు. (చదవండి: హ్యాండ్సప్ అని గన్ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్!) ఈ క్రమంలో 2021, అక్టోబర్ 30 మధ్యాహ్నం 01:30 గంటల ప్రాంతంలో నిందితులైన ఇద్దరు మైనర్లు షాలిని ఇంట్లో ప్రవేశించారు. ఆ సమయంలో వృద్ధురాలు ఇంట్లో టీవీ చూస్తూ ఉంది. ఇంట్లో ప్రవేశించిన నిందితులు.. వృద్ధురాలిపై దాడి చేసి.. 93 వేల రూపాయల నగదు, కొంత బంగారం దొంగతనం చేశారు. నిందుతల దాడిలో వృద్ధురాలు మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది) ఇక ఈ దారుణం జరిగిన తీరు పోలీసులను ఆశ్చర్యపరిచింది. నేరం జరిగిన తీరు ఒకనాటి సీఐడీ షో ఎపిసోడ్‌ను స్ఫురింపజేసింది. నిందితులిద్దరు పరారీలోనే ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. చదవండి: పోలీసులే దొంగలు.. పట్టేసిన సీసీ కెమెరాలు -
కూకట్‌పల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: కూకట్ పల్లిలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో ముగ్గురు మైనర్లు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌కు చెందిన యువతికి బర్త్‌డే కేకులో మత్తు మందు ఇచ్చిన ముగ్గురు మైనర్ బాలురు ఆమెపై లైంగిక దాడికి దిగారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు నిలదీయడంతో యువతి విషయం బయటపెట్టింది. ఘటన సైబరాబాద్ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు. యువతి సికింద్రాబాద్‌లోని కళాశాలలో డిగ్రీ చదువుతోంది. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం ) -
మైనర్లే కానీ.. కరుడుగట్టిన దొంగలు
సాక్షి, జగద్గిరిగుట్ట : దోపిడీలు, దొంగతనాలు చేస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5.69 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం బాలానగర్ ఏసీపీ పురుషోత్తమ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూరారం కాలనీ దయానంద్‌నగర్ కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు 917,14) తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంటారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల నాలుగు ఇళ్లలో చోరీలు చేశారు. సీసీ కెమెరాలు తదితర ఆధారాలతో కేసులను విచారించి ఈ ఇద్దరిని గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 4.80 వేలు విలువ చేసే బంగారం, రూ. 84 వేల విలువ చేసే రెండు కేజీల వెండితో పాటు రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నారు. మైనర్.. నోఫియర్.. పట్టుబడిన ఇద్దరు మైనర్లు 2018 నుంచి దొంగతనాలకు పాల్పడడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఒకరిపై (17) బాలానగర్ పీఎస్‌లో రెండు, శామీర్‌పేట పీఎస్‌లో ఒకటి, జీడిమెట్ల పీఎస్‌లో ఒకటి, పేట్ బషీరాబాద్ పీఎస్‌లో రెండు, జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు చొప్పున మొత్తం 8 దొంగతనం కేసులు ఉన్నాయి. మరొకరి(14)పై జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. ఐవో టీమ్‌కు రివార్డు.. దొంగతనాల కేసులను చాలెంజ్‌గా తీసుకున్న జగద్గిరిగుట్ట, జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుమన్‌కుమార్, జగద్గిరిగుట్ట ఎస్సై మహబూబ్‌పాటిల్‌లు తమ క్రైమ్ టీమ్‌తో సుదీర్ఘంగా విచారించి చాకచక్యంగా కేసులను ఛేదించారు. వీరితో పాటు క్రైమ్ సిబ్బంది సత్యనారాయణ, అర్జున్, విజయ్, హరిలాల్‌కు రివార్డులను అందించనున్నట్టు ఏసీపీ పురుషోత్తమ్, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డిలు తెలిపారు. -
దురలవాట్ల బారినపడి బైక్‌ల చోరీ
విజయనగరం, బొబ్బిలి: చిన్నతనంలోనే దురలవాట్ల బారినపడి, వాటిని తీర్చుకునేందుకు మోటరు సైకిళ్ల దొంగతనాలకు అలవాటు పడిన బాలలను అదపులోకి తీసుకున్నట్టు సీఐ దాడి మోహనరావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఇటీవల ఛేదించిన కేసు తాలుకా వివరాలు తెలియపర్చారు. ముగ్గురు బాలలు బొబ్బిలి, బాడంగి, చీపురుపల్లి, రాజాం, విజయనగరం స్టేషన్ల పరిధిలోని మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బైక్‌లను దొంగతనం చేసి వాటిని విక్రయించేవారు. ఇటీవల ఒక బైక్‌ను దొంగతనం చేస్తున్న సమయంలో వారిని పట్టుకున్న తరువాత మొత్తం వారు దొంగతనం చేసిన బైక్‌ల గురించి కూపీ లాగితే 16 మోటారు సైకిళ్లను సదరు బాలలు దొంగిలించినట్టు తేలిందన్నారు. వీటి విలువ రూ.3.30 లక్షలు ఉంటుందని అంచనావేశారు. క్రైం హెచ్‌సీ శ్యామ్ సుందరరావు, కానిస్టేబుళ్లు, తిరుపతినాయుడు, చిన్నారావు, శ్రీరామ్‌లు బాలలను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే అదుపులోకి తీసుకుని రికవరీ చేసినట్లు తెలిపారు. బాలలు కావడంతో వారి తల్లిదండ్రులకే సంరక్షణ నిమిత్తం అప్పగించినట్లు పేర్కొన్నారు. మోటారు సైకిళ్లను న్యాయమూర్తి ఆదేశాలు, సూచనలతో మరికొద్ది రోజుల్లో యజమానులకు అప్పగిస్తామని తెలిపారు. బాలలను సున్నితంగా విచారించి వారి నుంచి రికవరీ చేసేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లను సీఐ మోహనరావు అభినందించారు. -
భర్తను తరమి.. వివాహితపై సామూహిక అత్యాచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆలయానికి వెళ్లి వస్తున్న దంపతులను దారికాచి దాడిచేశారు. భర్తను తరిమికొట్టి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు అరెస్ట్ కాగా, నిందితుల్లో ఇద్దరు 17 ఏళ్ల మైనర్ బాలురు కావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండికి చెందిన ప్రయివేటు కంపెనీ ఉద్యోగి మూడేళ్ల కిత్రం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి (29)ని మూడునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు అంతకు ముందే వివాహం కాగా విడాకులు తీసుకుని అతడిని రెండో వివాహం చేసుకుంది. దంపతులు బుధవారం గుమ్మిడిపూండి సమీపంలోని కుమరనాయకన్పేటలోని ఆలయానికి వెళ్లి మోటార్‌బైక్‌పై తిరిగి వస్తుండగా గోపాల్ కండ్రిగ సమీపంలో రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు యువకులు అడ్డుకుని భర్తపై దాడిచేసి తరిమికొట్టారు. ఆ తరువాత భార్యకు కత్తిచూపి బెదిరించి దూరంగా మోసుకుని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయపడిన భర్త సమీపంలోని గ్రామస్తులను వెంటబెట్టుకుని రావడంతో దుండగులు పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో గుమ్మిడిపూండి సిప్కాట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అదే ప్రాంతానికి చెందిన మోహన్, మునియస్వామి అనే ఇద్దరు యువకులతోపాటు 17 ఏళ్ల వయసుగల ఇద్దరు బాలురు నిందితులని తేలింది. ఆ నలుగురిపై ఐదు సెక్షన్లపై కేసులు పెట్టి గురువారం అరెస్ట్ చేశారు. -
లాంగ్ రైడ్ .. డబ్బుతో పట్టుబడ్డ మైనర్లు
హైదరాబాద్: ఇంట్లో డబ్బుతో ఉడాయించి స్కూటీపై హైదరాబాద్ వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్న ఇద్దరు మైనర్లు అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కారు. బుధవారం నగరంలోని ఎల్బీనగర్లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా.. స్కూటీపై వస్తున్న ఇద్దరు మైనర్లను గుర్తించారు. వారిని ఆపి వివరాలు అడగగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. విస్మయకర విషయాలు బయటపడ్డాయి. బాలురిద్దరు మూడు రోజుల క్రితం రాజమండ్రిలోని ఇళ్లలో నుంచి డబ్బుతో సహా పరారయ్యారని తెలిసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 2.20 లక్షల విలువైన నగదుతో పాటు 2 సెల్ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.