యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు మైనర్ల అరెస్ట్‌  | Woman Molested in Mumbai, Three Minors Detained | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు మైనర్ల అరెస్ట్‌ 

Published Sun, Jan 23 2022 1:08 PM | Last Updated on Sun, Jan 23 2022 1:08 PM

Woman Molested in Mumbai, Three Minors Detained - Sakshi

ముంబై: ముంబైలోని ఈస్ట్రన్‌ ఉపనగరం గోవండీ ప్రాంతంలో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానిక శివాజీనగర్‌ ఏరియాలోని మట్టీరోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్‌గా పనిచేస్తోంది.

శుక్రవారం పనిలోకి వెళ్లిన యువతి సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని, మాట్లాడాలని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని ఓ మురికివాడలోని చిన్ని గదిలో బంధించివేశాడు.

చదవండి: (నేరస్తుల పాలిట సింహస్వప్నం.. ఏఏ ఖాన్‌ కన్నుమూత)

అనంతరం అతని స్నేహితులకు సమాచారం అందించి ఆ యువతిపై నలుగురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి నిందితులు పారిపోయారు. వెంటనే బాధితురాలు లేచి జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులపై ఐపీఎస్‌ సెక్షన్‌ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

చదవండి: (విద్యుత్‌ బిల్లు కొట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement