
జూబ్లీహిల్స్‌కు చెందిన యువతికి బర్త్‌డే కేకులో మత్తు మందు ఇచ్చిన ముగ్గురు మైనర్ బాలురు ఆమెపై లైంగిక దాడికి దిగారు.
సాక్షి, హైదరాబాద్: కూకట్ పల్లిలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో ముగ్గురు మైనర్లు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌కు చెందిన యువతికి బర్త్‌డే కేకులో మత్తు మందు ఇచ్చిన ముగ్గురు మైనర్ బాలురు ఆమెపై లైంగిక దాడికి దిగారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు నిలదీయడంతో యువతి విషయం బయటపెట్టింది. ఘటన సైబరాబాద్ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు. యువతి సికింద్రాబాద్‌లోని కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
(చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం )