సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు | Pune Inspired By TV Show CID 2 Minor Boys Murder Old Woman | Sakshi
Sakshi News home page

CID Show: సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు

Published Thu, Nov 4 2021 6:52 PM | Last Updated on Thu, Nov 4 2021 7:38 PM

Pune Inspired By TV Show CID 2 Minor Boys Murder Old Woman - Sakshi

ముంబై: హిందీలో ప్రసారం అయ్యే సీఐడీ షోకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. ఈ షో తెలుగులో కూడా డబ్‌ అయ్యింది. ఇక్కడ కూడా దీనికి చాలా మంది ఫ్యాన్స్‌. అయితే ఈ షోను స్ఫూర్తిగా తీసుకుని పుణెకు చెందిన ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ వివరాలు..

ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. షాలిని బద్నారావు సోనావానే(70) అనే వృద్ధురాలు పుణెలోని సయాలి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుండేది. నిందితులిద్దరు షాలిని ఇంటికి సమీపంలోనే ఉండేవారు. వృద్ధురాలు ఒక్కతే ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుందని గ్రహించారు. ఆమె ఇంటిలో దొంగతనం చేయాలని భావించారు. 
(చదవండి: హ్యాండ్సప్‌ అని గన్‌ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్‌!)

ఈ క్రమంలో 2021, అక్టోబర్‌ 30 మధ్యాహ్నం 01:30 గంటల ప్రాంతంలో నిందితులైన ఇద్దరు మైనర్లు షాలిని ఇంట్లో ప్రవేశించారు. ఆ సమయంలో వృద్ధురాలు ఇంట్లో టీవీ చూస్తూ ఉంది. ఇంట్లో ప్రవేశించిన నిందితులు.. వృద్ధురాలిపై దాడి చేసి.. 93 వేల రూపాయల నగదు, కొంత బంగారం దొంగతనం చేశారు. నిందుతల దాడిలో వృద్ధురాలు మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 
(చదవండి: చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది)

ఇక ఈ దారుణం జరిగిన తీరు పోలీసులను ఆశ్చర్యపరిచింది. నేరం జరిగిన తీరు ఒకనాటి సీఐడీ షో ఎపిసోడ్‌ను స్ఫురింపజేసింది. నిందితులిద్దరు పరారీలోనే ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. 

చదవండి: పోలీసులే దొంగలు.. పట్టేసిన సీసీ కెమెరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement