హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ కోసమంటూ వచ్చిన ఓ దుండగుడు.. మెకానిక్‌పై కత్తితో దాడి చేసి బైక్‌తో పరారయ్యాడు. అత్తాపూర్‌లోని ద్వారకా హోండా షోరూమ్‌లో ఆసిఫ్‌నగర్‌కు చెందిన అఖ్తర్ (27) మెకానిక్. సోమవారం సాయంత్రం ఓ యువకుడు షోరూమ్‌కు వచ్చాడు. తాను సీబీఆర్ 250 సీసీ బైక్ కొనేందుకు వచ్చానని, చూపించమని అడిగాడు. అఖ్తర్ అతనికి బైక్‌ను చూపించగా... ఆ యువకుడు టెస్ట్‌డ్రైవ్ చేస్తానని కోరాడు. దీంతో షోరూమ్ అధికారుల అనుమతితో టెస్ట్‌డ్రైవ్‌కు దుండగుడు అఖ్తర్‌ను వెంటపెట్టుకొని వెళ్లాడు.
పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 170 వద్దకు వెళ్లగానే.. బండిని ఆపి అఖ్తర్‌ను కిందకు దిగాలని కోరాడు. ఎందుకని ప్రశ్నించగా దిగమని గద్దించాడు. దిగగానే తల్వార్‌ను బయటకు తీసి అఖ్తర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి.. బైక్ తీసుకొని రాజేంద్రనగర్ వైపు పరారయ్యాడు. అఖ్తర్ కుడిచేతితో పాటు చాతిపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న షోరూమ్ నిర్వాహకులు బాధితుడిని హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ నడిపి చూస్తానని ఎత్తుకెళ్లాడు!
Published Tue, May 20 2014 4:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement
Advertisement