వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు
మియాపూర్: వ్యసనాలకు బానిసై బైక్‌ల చోరీకి పాల్పడుతున్న యువకుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా, కోస్గి మండలం, లింగంపల్లి తాండకు చెందిన నేనావత్ చందర్‌నాయక్ మియాపూర్ హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఉంటూ స్విగ్గీలో డెలివరీబాయ్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను సులభంగా డబ్బు సంపాదించేందుకుగాను బైక్‌ల చోరీకి పాల్పడుతున్నాడు.
వైన్స్‌షాపులు, ఇండిపెండెంట్ గృహాల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను ఎత్తుకెళ్లేవాడు. ఇదే తరహాలో మియాపూర్ పీఎస్ పరిధిలో 13, బంజారాహిల్స్ పరిధిలో 1æ, చందానగర్ పరిధిలో 2, దుండిగల్ పరిధిలో 1æ, సికింద్రాబాద్ పరిధిలో 1æ బైక్ దొంగిలించాడు. చోరీ చేసిన వాహనాలను వికారాబాద్ పరిసర గ్రామాల్లో విక్రయించేవాడు. దీనిపై సమాచారం అందడంతో మియాపూర్ పోలీసులు ఈ నెల 19న పీఏనగర్ నుంచి జేపీనగర్ వెళ్లే రోడ్డులో చందర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలను అంగీకరించాడు. అతడి నుంచి 18 బైక్‌లనుస్వాధీనం చేసుకున్నారు.నిందితుడి పై కేసు నమోదు చేసిరిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ రవికుమార్, సీఐ వెంకటేష్, డీఐమహేష్, క్రైం ఎస్‌ఐ ప్రసాద్, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment