super market
-
2 నిమిషాల్లో ఖాళీ..
-
HYD: రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం
సాక్షి, రాజేంద్రనగర్: నగరంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రత్నదీప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ఆ మంటలను చూసి పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఈ క్రమంలో రత్నదీప్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
నిత్యావసరాలు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
కిరాణాలు, సూపర్ మార్కెట్లలో వివిధ వస్తువులను ప్యాకెట్లరూపంలో విక్రయిస్తున్నారు. వీటిపై తయారీ, గడువు తేదీ, బరువు, ధర స్టిక్కర్లు వేయకుండానే విక్రయిస్తున్నారు. ప్రజలు వివిధ పనులతో బిజీగా ఉండటంతో వ్యాపారులు దానిని అవకాశంగా మార్చుకుని ప్యాకెట్ల రూపంలో వస్తువులు అంటగడుతున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి చిన్న కిరాణాల్లోనూ ప్యాకింగ్‌పై అన్ని వివరాలు ఉండాలి. వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పావుకిలో, అర్ధకిలో, కిలో రూపంలో ప్యాకెట్లు నింపుతూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో తూకంలో తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప.. తదుపరి చర్యలపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండానే.. ● నిబంధనల ప్రకారం నిత్యావసరాలను ప్యాక్ చేయాలంటే తూనికలు, కొలతల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. ● ప్యాకెట్‌పై ఎమ్మార్పీ, మ్యానుప్యాక్చరింగ్ డేట్, కమొడిటీ, టోల్‌ఫ్రీ నంబరు ఉండాలి. ● కానీ, అనుమతి లేకుండానే కిరాణాల్లో కందిపప్పు, పెసరపప్పు, చక్కెర, గోధుమపిండి, మైదాపిండి ప్యాక్ చేస్తూ విక్రయిస్తున్నారు. ● చిప్స్, మురుకులు, ఖార, బొందీ తదితర తినుబండారాలనూ ప్యాకెట్లలోనే విక్రయిస్తున్నారు. ● హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్దపెద్ద బస్తాల్లో సరుకులను తీసుకొచ్చి ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ● మరోవైపు.. పన్నులు తప్పించుకోవడానికి వ్యాపారులు జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ● తద్వారా ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జాడలేని అధికారులు.. జిల్లాలో 20 మండలాలతో ఉండగా, ప్రస్తుతం జిల్లా ఇన్స్పెక్టర్తోపాటు, సిబ్బంది ఉన్నారు. జిల్లా పెద్దగా ఉండటం, అధికారులు తక్కువగా ఉండటంతో తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లో తరాజు, బాట్లు వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు.. అలాంటివేమీ చేయడం లేదు. ఏటా కిరాణం వారు తరాజులు, బాట్లకు స్టాంపు వేయించుకోవాలి. ఎలక్ట్రానిక్ కాంటాల వారు సంవత్సరానికోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. గ్రామాల్లో అమ్మకాలు.. ● గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మసాలా పొడులు, ఖారాప్యాకెట్లు, వివిధ వస్తువులు, ఉల్లిగడ్డలు ట్రాలీల్లో తీసుకెళ్లి అమ్ముతుంటారు. ● వీటిని చిన్నచిన్న కవర్లలో పోసుకుంటూ విక్రయిస్తుంటారు. ● వీటిపై ఎలాంటి ముద్రణ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండడంలేదు. ● ఇటీవల అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ధరల్లో తేడాలు.. కొన్ని షాపుల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లలో, బేకరీల్లో ఇస్టారాజ్యంగా రేట్లకు విక్రయిస్తున్నారు. కొత్త సినిమా రోజు సినిమా థియేటర్లలో ఒక కూల్‌డ్రింక్ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఒక పాప్‌కార్న్ రూ.20కి అమ్ముతున్నారు. వాటర్‌బాటిల్ రూ.40, చిప్స్ రూ.20కి విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సినిమాకు వెళ్లాడు. పాప్‌కార్న్ కొనుగోలు చేశాడు. దానికి ఎలాంటి స్టిక్కర్లేదు. ప్యాకెట్ రూ.40కిపైగా ధరకు అమ్మాడు. దీంతో అతడు లీగల్ మెట్రోలజీ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. అధికారులువెంటనే థియేటర్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. జగిత్యాల అశోక్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. కూరగాయలు కొనుగోలు చేశాడు. కిలోకు పావుకిలో వరకు తక్కువగా రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ముద్రణ ఉండాలి ప్రతీ ప్యాకెట్‌పై వస్తువుపై సంబంధిత కంపెనీ ముద్రణ, కన్జ్యూమర్ నంబరు, ఎమ్మార్పీ ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకోవాలి, ప్రతీరోజు తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిషన్ వారు సంవత్సరానికోసారి, తరాజుబాట్ల వారు రెండు సంవత్సరాలకోసారి ముద్ర వేయించుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. – అజీజ్‌పాషా, తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ -
ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, ఇప్పుడు సూపర్ మార్కెట్లో
క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లు ఏదో ఒకరోజు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అయితే రిటైర్మెంట్కు ముందే భవిష్యత్తులో ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవడం చూస్తుంటాం. కొంతమంది క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ చేయడం.. కామెంటేటర్లుగా మారడం చూస్తుంటాం. క్రికెట్ బాగా పాపులర్ ఉన్న మన దేశంలో ఎక్కువమంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కామెంటేటరీ ఫీల్డ్‌లోకి వస్తున్నారు. అయితే మరికొంత మంది క్రికెటర్లు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉదాహరణకు దిగ్గజం కపిల్ దేవ్ వ్యాపారంలో రాణిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కామెంటేటరీ బాక్స్‌లో కనిపిస్తుంటాడు. ఇంకొంతమంది క్రికెటర్లు మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతుంటారు. షోయబ్ అక్తర్ లాంటి పాక్ క్రికెటర్లు ఎక్కువగా యూట్యూబ్ చానెళ్లు నడుపుతూ మరింత ఫేమస్ అయిపోతున్నారు. కొందరు మాత్రం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లగ్జరీ జీవితానికి దూరంగా బతకాలని ఆశపడతారు. ఆ కోవకు చెందిన వాడే న్యూజిలాండ్ మాజీ బౌలర్ క్రిస్ మార్టిన్. క్రిస్ మార్టిన్ న్యూజిలాండ్ తరపున 2000వ సంవత్సరం నుంచి 2013 వరకు 71 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ మార్టిన్ కంటే ముందు టెస్టుల్లో రిచర్డ్ హడ్లీ, డానియెల్ వెటోరిలు మాత్రమే ఉన్నారు. మరో విషయమేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్‌గా క్రిస్ మార్టిన్ నిలిచాడు. చాలా సందర్భాల్లో ధోనిని ఔట్ చేసిన ఘనత క్రిస్ మార్టిన్ సొంతం. ఇక 40 ఏళ్ల వయసు దాకా క్రిస్ మార్టిన్ క్రికెట్లో కొనసాగాడు. అయితే 35 ఏళ్ల వయసుకు చేరుకోగానే క్రిస్ మార్టిన్ తన పోస్ట్ రిటైర్మెంట్పై ఆలోచనలో పడ్డాడు. అప్పటినుంచే తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేయాలని భావించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేలోపే న్యూజిలాండ్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో ''Four Square'' పేరుతో సూపర్‌మార్కెట్‌ను నెలకొల్పాడు. మొదట చిన్న స్టోర్‌గా ప్రారంభించినప్పటికి 2019లో దానిని బిగ్స్టోర్గా మార్చాడు. ఫుడ్‌స్టఫ్ సహా మార్కెట్లో అవసరమైన అన్ని రకాల రిటైల్ వస్తువులను అందుబాటులో ఉంచాడు. అనతికాలంలోనే కస్టమర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాడు. He took 233 Test wickets for New Zealand - the third highest of all-time for the Blackcaps, but only scored 123 runs in 71 matches! Happy Birthday to Chris Martin! pic.twitter.com/WAzVuktrNO — ICC (@ICC) December 10, 2017 చదవండి: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న! SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే!
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థలు కొన్ని పండ్లు, కూరగాయల కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా కొరత తలెత్తింది. నెల రోజుల వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో సూపర్ మార్కెట్ యాజమాన్యాలు ఈ చర్యను ప్రకటించాయి. టమాటాలు, క్యాప్సికం, దోసకాయలు, బ్రకోలి, క్యాలిఫ్లవర్ తదితరాల సరఫరా తక్కువగా ఉండటంతో వీటిని ఒక్కో వినియోగదారుకు మూడు వరకే విక్రయిస్తామని టెస్కో, అస్డా, మోరిసన్స్, ఆల్డి సంస్థలు తెలిపాయి. ఆఫ్రికా, యూరప్‌ల్లో ప్రతికూల వాతావరణం, ఇంధన ధరలు పెరగడం, బ్రిటన్, నెదర్లాండ్స్‌లో గ్రీన్హౌస్ వ్యవసాయంపై ఆంక్షలు కారణంగా పండ్లు, కూరగాయల దిగుబడి, రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
Banjara Hills: బియ్యం కావాలని దుకాణానికి వచ్చి..
సాక్షి, బంజారాహిల్స్: బియ్యం కావాలని దుకాణానికి వచ్చిన ఓ అగంతకుడు షాపు యజమాని దృష్టి మరల్చి సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనం అపహరించుకుపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో అబ్దుల్ రహీం బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి షాపునకు వచ్చి తనకు రెండు బ్యాగుల బియ్యం కావాలని శాంపిల్ చూపించాలని అడిగాడు. బియ్యం నమూనాలు తీసేందుకు రహీం బ్యాగుల వద్దకు వెళ్లగా.. అదే సమయంలో టేబుల్‌పై ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బయట ఉన్న స్కూటీని అపహరించుకొని క్షణాల్లో అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్!
దేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఉత్పత్తులలో.. ప్రొడక్ట్‌ని బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ముడిసరుకు ఖర్చుల మధ్య గత రెంవత్సరాలుగా ధరలను పెంచిన హెచ్‌యూఎల్ సంస్థ.. ఇటీవల ముడి సరుకు ధరలు అదుపులోకి రావడంతో పలు ప్రాడెక్ట్లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సామాన్యడికి కాస్త ఊరటనిస్తుంది. కాగా కరోనా మొదలుకొని అన్నీ రంగాలు డీలా పడడంతో దాని ప్రభావం చాలా వరకు సామాన్యలపై పడింది. ఈ క్రమంలో ఉద్యోగాల కోత, నిత్యవసరాలు, ఇంధన ధరలు ఇలా అన్ని పెరుగుతూ ప్రజలకు భారంగా మారిన సంగతి తెలిసిందే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ముడిసరుకు ధరలు గరిష్ట స్థాయిలో పెరిగాయి. దీంతో గత నాలుగు త్రైమాసికాల్లో, ఎఫ్ఎంసీజీ కంపెనీలు 8-15 శాతం మేర ధరలను పెంచాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తాజా ప్రకటనతో.. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, రిన్ డిటర్జెంట్ పౌడర్, లైఫ్‌బోయ్ సబ్బు, డోవ్ సోప్ వంటివి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. అయితే, కొందరి డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం, అన్ని ధర తగ్గించిన వస్తువులు ఇంకా మార్కెట్లోకి అందుబాటులో లేదని తెలిపారు. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం: 12వేల మంది ఉద్యోగులు ఇంటికి! -
ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’
Kuwaiti supermarket pulled: మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అక్కడికి సదరు ప్రతినిధిపై బీజేపీ వేటు వేసింది కూడా. తన వ్యాఖ్యల పట్ల నూపుర్ క్షమాపణలు చెప్పింది కూడా. అయినప్పటికీ గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కువైట్‌లోని అల్ అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ భారతీయ ఉత్పత్తులను పక్కనపెట్టింది. నూపుర్ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ ఉత్పత్తులను వాడేది లేదంటూ ఒక ట్రాలిలో ప్యాక్ చేసి పక్కనే పెట్టేశారు. సదరు స్టోర్ సీఈవో ‘ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించం అందుకే భారతీయ ఉత్పత్తులను తొలగిస్తున్నాం’ అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ బీజేపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తీవ్రంగా మండిపడుతోంది. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి. భారత్ నుంచి విదేశాల్లో పని చేస్తున్న మొత్తం 13.5 మిలియన్ల మందిలో.. 8.7 మిలియన్ల మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్క. ఇక భారత్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కువైట్ సుమారు 95 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అదీగాక భారత్ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా గోధుమల ఎగుమతులను నిషేధించిన సమయంలో కూడా కువైట్ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వమని కోరడం గమనార్హం. (చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ) -
కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి
న్యూయార్క్: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ సూపర్ మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైనికుడి వేషధారణలో సూపర్మార్కెట్లోకి ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నల్లజాతీయులు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: (ప్రపంచ సంక్షోభమే.. జి–7 దేశాల ఆందోళన) -
కన్నీరు పెడుతున్న ఉక్రేనియన్లు.. షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్‌పై దాడి..
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 26వ రోజుకు చేరుకున్నాయి. రష్యా బలగాల ధాటికి ఉక్రెయిన్ విలవిలాడుతోంది. రష్యా వైమానిక దాడుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉక్రెయిన్ జనావాసాలే లక్ష్యంగా రష్యా ట్రూప్ దాడులు జరుపుతున్నాయి. కనీస కనికరం లేకుండా బాండు దాడులు చేస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న రెట్రోవిలీ షాపింగ్ మాల్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఆ దాడిలో ఆరుగురు మృతిచెందారు. దాడి కారణంగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మారియపోల్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. నగరంలోని 90 శాతం బిల్డింగ్‌లో ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. ఆ నగరంలో ఇంకా మూడు లక్షల మంది తలదాచుకుంటున్నారు. వాళ్లకు విద్యుత్తు, నీరు, ఆహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Video of a shell hitting a shopping center. The explosion was incredibly strong, the wave blew out the windows in the neighboring houses. pic.twitter.com/Qe5ztF1vLc — NEXTA (@nexta_tv) March 20, 2022 మరోవైపు.. ఖార్కీవ్లో ఓ సూపర్ మార్కెట్‌పై రష్యా బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో షాపులో ఉన్న ఉక్రెయిన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంక్షోభంలో ఉక్రెయిన్‌కు చెందిన మాజీ ఎంపీ భార్య డబ్బును తరలిస్తూ పోలీసులకు చిక్కారు. మాజీ ఎంపీ కొట్విట్స్కీ భార్య భారీ మొత్తంలో ఉక్రెయిన్ నుంచి డబ్బును తరలిస్తుండగా హంగేరిలో బోర్డర్లో పోలీసులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాంబు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Kharkiv: A #Russian shell explodes next to people who are standing in line at the supermarket. pic.twitter.com/QIZkgV4ZLa — NEXTA (@nexta_tv) March 21, 2022 Ukrainian media report that the wife of former MP Kotvytskyy tried to take $28 million and 1.3 million euros out of #Ukraine via #Zakarpattya. The money was found by the #Hungarian border guards and forced to declare it. pic.twitter.com/ZCjDlIxdwB — NEXTA (@nexta_tv) March 20, 2022 -
న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి
Lawyer Accused of Injecting Blood Into Food: కొంతమంది పైశాచికంగా ఎదుటవాళ్ల మీద కోపంతోనూ లేదా ద్వేషంతోనూ వికృతమైన పనులకు ఒడిగడుతుంటారు. అలాంటి పలు ఘటనలు గురించి విన్నాం కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన దుశ్చర్యకు ఒడిగట్టాడు. అది కూడా ఎలా చేస్తున్నాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలు విషయంలోకెళ్తే...లండన్‌లోని వ్యక్తి సూపర్ మార్కెట్లోని ఆహార పదార్థాల్లోకి తన రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సూపర్ మార్కెట్లలోని ఆహార పదార్థాల్లోకి రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. ఈ మేరకు అతను చేస్తున్న పని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో సదరు షాపు వాళ్లు కస్టమర్లను పంపించేసి ఆహార పదార్థాలన్నింటిని పడేశారు. అంతేకాదు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుని నెట్టడం సిరంజీలు విసరడం వంటివి చేశాడు. పోలీసులు ఈ ఘటనల్లో సుమారు 21 సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్‌గా గుర్తించారు. అతను స్వంతంగా లీగల్ కన్సల్టెన్సీని కూడా ఉంది. అయితే సూపర్ మార్కెట్లన్నీ సుమారు రూ.5 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ మేరకు పోలీసులో ప్రతి సీసీ ఫుటేజ్‌ని పరీక్షించి చూడాగా ..ఆపిల్లు, చికెన్ టిక్కా ఫిల్లెట్‌ల ప్యాకెట్లకు అతను రక్తాన్ని ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు విచారణలో అవన్నీ 37 ఏళ్ల క్రితం నాటి ఆహారంగా చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పైగా ఆ సీసీ ఫుటేజ్‌లో అతను ఒక బకెట్లో హైపోడెర్మిక్ సూదులను మోస్తున్నట్లు కూడా కనిపించిందన్నారు. కానీ నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్ మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు లండన్‌లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు ఆ వింత కేసును విచారించింది. అయితే నిందుతుడి తరుఫు న్యాయవాదులు మాత్రం అతని పిచ్చివాడని, మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. మరోవైపు సైక్రియార్టిస్ట్ డాక్టర్లు కూడా అతని మానసిక పరిస్థితి గందరగోళంగా ఉందని కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా చేసిన నేరంగా భావించలేకపోతున్నాం అని చెప్పారు. దీంతో లండన్ కోర్టు అతను ఈ నేరం చేసినప్పుడూ అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో విచారించమని ఆదేశించడం గమనార్హం. (చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!) -
Viral Video: ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా?
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్నాక్ ఐటమ్ చిప్స్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎప్పుడూ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన సామాన్ల లిస్టులో చిప్స్ తప్పనిసరి. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా.. దుకాణాల్లో దొరికే చిప్స్‌ను కొనుక్కొని తింటుంటారు. తాజాగా ఓ మహిళ చిప్స్ ప్యాకెట్లో ఉమ్మివేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ చేసిన పాడు పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిప్స్ ప్యాకెట్లో ఉమ్మిన మహిళ మేకప్ ఆర్టిస్ట్ లిబ్బి బర్న్స్‌గా గుర్తించారు. సంగీతకారుడు హంటర్ హేస్ మాజీ ప్రియురాలు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే తరువాత లిబ్బికి నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఈ క్లిప్‌ను డిలీట్ చేసినప్పటికీ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. వీడియోలో.. అమెరికాలోని నాష్విల్లే కిరాణ దుకాణంలోకి వెళ్లిన లిబ్బి బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్‌ను తెరిచి అందులోంచి ఒకటి తీసుకొని రుచి చూస్తుంది. తనకు నచ్చకపోవడంతో చిప్స్ ప్యాకెట్లో ఉమ్మి మళ్లీ సీల్ చేసే ప్రయత్నం చేసింది. అనంతరం దాన్ని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. అంతేగాదు సీల్ చేసిన వాటర్ బాటిల్ నుంచి కూడా సిప్ తీసుకొని దానిని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. షాప్‌లో నుంచి తీసిన టాయిలెట్ పేపర్‌తో నాలుకను తుడుచుకోవడం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చేస్తున్న ఆమె కెమెరా చూస్తూ నవ్వుతోంది. అయితే ఈ దృష్యాలన్నీంటిని వీడియో తీసిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదు. చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!! ఇంతలో, ఒక వ్యక్తి, లిబ్బి వద్దకు వచ్చి నువ్వు దొంగతనం చేస్తున్నావా అని అడిగాడు, దానికి ఆమె “నేను దొంగతనం చేయడం లేదు. నేను ఆ వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. నేను వాటిని ఎక్కడ ఉంచానో నాకు గుర్తుంది. ఇది నీకు సంబంధించినది కాదు’ అంటూ మండిపడింది. ఇక్కడితో వీడియో ముగియడంతో దీనిని చూసిన నెటిజన్లు.. ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా అంటూ లిబ్బి చర్యలపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇదంతా నిజం కాదని, వినోదం కోసం ఇలా వీడియో చేసిందని చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత, క్రోగర్ షాప్ యాజమాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమ కస్టమర్ల భద్రత మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ‘నాష్విల్లే డివిజన్లోని మా స్టోర్‌కు చెందిన ఓ వీడియో సర్క్యులేట్ అవుతున్నట్లు మాకు తెలిసింది. మేము వెంటనే దర్యాప్తును ప్రారంభించాం. దీని ద్వారా మహిళ వీడియోలో చూపించిన వస్తువులను షెల్ఫ్‌లో ఉంచలేదని తెలిసింది. ఆమె వాటిని కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ వీడియో ఫన్ కోసం తీసినప్పటికీ పలువురిని ఇబ్బందులకు గురిచేస్తోంది. వినియోగదారుల ప్యాకేజింగ్‌ను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలి’ అని తెలిపారు. చదవండి: Funny Video: ‘దండం పెడతా సార్, నన్ను ఇంటికాడ దింపండి, సీరియల్ చూడాలి’ -
సూపర్ మార్కెట్లోకి అనుకోని అతిథి.. జనం హడల్
బ్యాంకాక్: సాధారణంగా మనం సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అక్కడ ఏ బల్లో, పురుగో కనిపిస్తే భయపడి అక్కడి నుంచి పారిపోతుంటాం. అయితే ఎక్కడ నుంచి ప్రత్యక్షమయ్యిందో కానీ ఒక పెద్ద మానిటర్ బల్లి స్టోర్ లోపలికి వచ్చేసింది. దీన్ని చూసిన కస్టమర్లు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. అక్కడి సూపర్ మార్కెట్లో ఒక పెద్ద మానిటర్ బల్లి ప్రవేశించింది. ఇంతటితో ఆగకుండా.. స్టోర్‌లోని షేల్ఫ్లో అటు ఇటు తిరుగుతూ అక్కడి వస్తువులను కింద పడేసింది. కాసేపు అక్కడ గందర గోళ వాతావరణం ఏర్పడింది. అందరు భయంతో అరుస్తూ అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఆండ్రూ మాక్గ్రెగర్ అనే జర్నలిస్ట్ ట్వీటర్ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో..ఎంత భయంకరంగా ఉంది.. మీరేనా షాపింగ్ చేసేది.. పాపం దానిక్కుడా చేయాలనిపించిందేమో..అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
జిల్లా కేంద్రాల్లో జగనన్న మహిళా మార్ట్
సాక్షి, అమరావతి: పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా.. పురపాలకశాఖ మౌలిక వసతులు సమకూర్చేలా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆర్థిక సహకారంతో ఈ మార్టుల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. ఇప్పటికే వైఎస్సార్ జిల్లా పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ విజయవంతమైంది. దీంతో వీటిని అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో దశలవారీగా ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది. డ్వాక్రా మహిళలే యజమానులుగా.. పట్టణ మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే ఈ జగనన్న మహిళా మార్ట్‌కు యజమానులు. ప్రతి పట్టణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య యూనిట్‌గా దీన్ని ఏర్పాటు చేస్తారు. సమాఖ్య సభ్యులు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేస్తారు. తద్వారా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరుతుంది. మెప్మా రూ.3 లక్షలు సమకూరుస్తుంది. మున్సిపాలిటీ స్థలం కేటాయించటమేగాక సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ సహకారంతో భవనం నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాలను కూడా ఈ మార్ట్‌కు వర్తింపజేస్తారు. దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మెప్మా సహకరిస్తుంది. కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్లను తీర్చిదిద్దుతారు. నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని మెప్మా ఏర్పాటు చేస్తుంది. సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుంది. ఈ మార్ట్లు ఆరునెలల్లోనే లాభాల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. సమాఖ్య సభ్యులకు లాభాల్లో వాటాను 6 నెలలకు ఓసారి డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తారు. ఈ మార్ట్‌లో కొనుగోలు చేసే సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తారు. పులివెందులలో నెలకు రూ.10 లక్షల టర్నోవర్ పైలట్ ప్రాజెక్టుగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రారంభించిన జగనన్న మహిళా మార్ట్ విజయవంతమైంది. 25 డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ మార్టు టర్నోవర్ నెలకు రూ.10 లక్షలకు చేరింది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ మార్ట్లను ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లోని సమాఖ్య సభ్యులతో చర్చిస్తోంది. తరువాత దశలో రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్లలో రెండుమూడు చొప్పున ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధే లక్ష్యం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పట్టణ మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం ఈ జగనన్న మహిళా మార్ట్‌లకు రూపకల్పన చేశాం. ఇతర మార్ట్ల కంటే తక్కువ ధరకు, నాణ్యమైన సరుకులను అందించడం ద్వారా ప్రజల ఆదరణ పొందేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. వీటి నిర్వహణపై మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ కూడా ఇస్తాం. – వి.విజయలక్ష్మి, ఎండీ, మెప్మా -
కీ‘లేడీ’ జేబుదొంగ.. వీడియో వైరల్
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఓ లేడీ జేబుదొంగ వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. పలు ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్లాస్టిక్ కవర్ అడ్డుపెట్టి మరి జేబులు కొట్టేస్తోంది. ఈ నెల 23న జరిగిన రెండు దొంగతనలు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మేన్స్ క్లబ్‌లోకి వెళ్లిన మహిళా జేబుదొంగ ఓ వ్యక్తి జేబు కొట్టిసింది. అరగంట వ్యవధిలోనే సూపర్ మార్కెట్లోకి వెళ్లి మరో వ్యక్తి జేబు కొట్టేసింది. దర్జాగా సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళ కేవలం ఒక్క నిమిషంలోనే వ్యక్తి జేబులోంచి పర్సును దొంగిలించిది. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. జీన్స్ టీషర్టులో ధరించిన మహిళ ముఖానికి మాస్కు కట్టుకొని షాప్‌లోకి ప్రవేశించింది. అనంతరం సరాసరి క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లిన మహిళ తనను ఎవరైనా గమనిస్తున్నారా అని పరిశీలించి మెల్లగా తన ముందు ఉన్న వ్యక్తి జేబులోనుంచి పర్సును దొంగిలించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీంతో సదురు జేబుదొంగ బాగోతం బట్టబయలైంది. ఈ దొంగతనం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఆయా షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు.. -
షాపుకు కన్నమేసి యజమానికి క్షమాపణలు
మధురై : సూపర్ మార్కెట్లో 65,000 రూపాయల విలువైన వస్తువులతో పాటు 5000 రూపాయల నగదు దోచుకున్న దొంగ.. షాపు యజమానికి క్షమాపణ చెబుతూ లేఖ రాసి వెళ్లిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. నగరంలోని ఉసిలంపట్టి ప్రాంతంలోని ఓ సూపర్‌మర్కెట్‌లో చోరీ చేసిన దొంగ తాను ఎందుకు నేరానికి పాల్పడవలసి వచ్చిందో కూడా ఆ లేఖలో ప్రస్తావించాడు. ‘చోరీకి పాల్పడినందుకు మన్నించాలి..నేను ఆకలితో ఉన్నాను..మీకు ఈ మొత్తం ఒకరోజు రాబడి అయితే..నాకు మూడు నెలల ఆదాయంతో సమానం. ఈ పని చేసినందుకు మరోసారి క్షమాపణలు’ అంటూ లేఖలో దొంగ రాసుకొచ్చాడు. చదవండి : మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపు : యువకుడి అరెస్ట్ ఉసిలంపట్టి-మధురై రోడ్డులో ఉన్న ఈ సూపర్‌మార్కెట్ యజమాని రాంప్రకాష్ (30). తాను ఈనెల 8న ఉదయం షాపు తెరిచిచూడగానే తన రెండు కంప్యూటర్లు, టీవీ సెట్, 5000 రూపాయల నగదు కనిపించలేదని రాంప్రకాష్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా దొంగ దోచుకెళ్లాడని వెల్లడైంది. ఉసిలంపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ కోసం ఆమాత్రం చేయలేనా: దర్శకుడు
"ఈ సృష్టిలో అందమైనది పువ్వు అయితే తన దృష్టిలో అందమైనది అమ్మ నవ్వు" అంటున్నాడు ఆస్ట్రేలియా దర్శకుడు జాసన్ వాన్ జెండరన్. ఆ నవ్వు కోసం ఏదైనా చేస్తానంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో లాక్డౌన్ అమల్లో ఉంది. అయితే అల్జీమర్స్‌తో బాధపడుతోన్న అతని తల్లి సరుకులు తెచ్చుకుందామంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అమ్మను తీసుకుని బయటకు వెళ్లలేకపోయాడు. అలా అని ఆమె మాటను కాదనలేకపోయాడు. దీంతో కాస్త ఆలోచించి ఓ ఐడియా వేశాడు. ఇంట్లోనే సూపర్ మార్కెట్ పెట్టించాడు. ఆ వృద్ధురాలి కోసం ఆయన భార్యాపిల్లలందరూ దుకాణదారుల అవతారం ఎత్తారు. (చెట్టు లెక్కగలవా ఓ టీచరు! పాఠం చెప్పగలవా..) ఇంకేముందీ జాసన్ తల్లిని తీసుకుని కింది గదిలోకి.. అదే సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అది చూసి ఆ బామ్మ షాక్ అయింది. తనకోసం ఇదంతా చేశారా అని తెలుసుకుని విస్తుపోయింది. కొడుకుతో కలిసి నచ్చిన వస్తువులు తీసుకుంటూ షాపింగ్ చేసింది. చివరగా సంతోషంతో కొడుకుకు సుతారంగా ముద్దు పెట్టింది. ఈ వీడియోను అతను యూట్యూబ్‌లో షేర్ చేశాడు. అమ్మ కోసం భార్య మేఘన్, పిల్లలు ఎవీ, ఆర్త్తో కలిసి హోమ్ మేడ్ సూపర్ మార్కెట్ రూపొందించామని తెలిపాడు. తన పెద్ద కొడుకు లెవీ దీన్నంతటినీ కెమెరాలో చిత్రీకరించాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. (ఐదేళ్లే శిక్ష వేయండి.. లేదంటే చచ్చిపోతాడు!) -
రిలయన్స్ స్మార్ట్ కొత్త స్టోర్.. అన్ని వస్తువులపై
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ తన కొత్త స్టోర్‌ను శుక్రవారం బండ్లగూడా ప్రాంతంలోని హెచ్‌పీ పెంట్రోల్ బంక్ దగ్గర ప్రారంభించింది. ఒకే కేంద్రంలో అనేక రకాల ఉత్పత్తులను కలిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్వేర్, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్రారంభమైన బండ్లగూడా స్టోర్ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 23 కు చేరుకుంది. నాణ్యమైన ఉత్పత్తులు మరియు ఆకర్షణీయమైన ధరల వల్ల స్థానిక ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటుగా వారి రోజువారీ అవసరాలను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిలవనుంది. గత కొన్ని సంవత్సరాలుగా, వినియోగదారుడిపై ప్రత్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్.. వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూపర్ మార్కెట్ కేటగిరీలో విస్తృత శ్రేణిలో ఉత్పత్తులు వినియోగదారులకు అందిస్తూ.. స్థలం పరంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది. రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ప్రత్యేకతలు రిలయన్స్ స్మార్ట్ వినియోగదారులు చెల్లించే మొత్తానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులు అందించడంతో పాటుగా ఎంఆర్పీపై కనీసం 5% డిస్కౌంట్‌ను అన్ని ఉత్పత్తులపై సంవత్సరం పొడవునా అందిస్తోంది. దీంతోపాటుగా రూ.1499 విలువ గల కొనుగోలు చేసినప్పుడు కిలో పంచదారను రూ.9 కనీస ధరతో అందించడం వంటి ఆకర్షణీయ పథకాల వల్ల దేశవ్యాప్తంగా తమ నెలవారి కిరాణ సరుకుల కోసం ఎంచుకోదగిన ఉత్తమమైన సూపర్‌మార్కెట్‌గా రిలయన్స్ స్మార్ట్ నిలుస్తోంది. వీటన్నింటితో పాటుగా, ప్రధానమైన ఉత్పత్తులను, పండ్లు మరియు కాయగూరలపై ప్రతిరోజూ తక్కువ ధరలకే అందిస్తోంది. అయితే ఈ సేవలు హైదరాబాద్‌లోని స్టోర్లలో మాత్రమే లభిస్తాయి. -
స్టోరంతా తిరిగి కొనుక్కునే చాన్స్
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని మద్యం ప్రియులకు ఇక సూపర్ కిక్ ఎక్కనుంది. నవంబర్ నుంచి సూపర్ మార్కెట్ తరహాలో వాక్ఇన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిస్తూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఎక్సైజ్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మేరకు ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటయ్యే వాక్ఇన్ వైన్ షాపులలోకి మద్యం ప్రియులు వెళ్లి స్టోరంతా కలియ తిరిగి వారికి ఇష్టమైనబ్రాండ్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక్క స్పెన్సర్స్ మాల్లోనే ఈ తరహా షాపు ఉంది. కొత్త ఎక్సైజ్ పాలసీతో షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాల్లోనూ వాక్ఇన్ వైన్స్ ఏర్పాటుకు చాన్స్ ఉంది. ఈ దుకాణాలను ఏర్పాటు చేయాలంటే లైసెన్సు ఫీజుతో పాటు స్పెషల్ ఎక్సైజ్ పన్నుకు అదనంగా మరో రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాక్ఇన్ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునేవారు మొత్తంగా రూ.2.30 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నగరంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండగా కొత్త ఎక్సైజ్ పాలసీ సిటీలోని మద్యం ప్రియులకు మరింత మత్తెక్కించేలా ఉంది. పాత షాపులే... హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రస్తుతమున్న షాపులన్నింటికీ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిటీలో షాపులు తగ్గించి శివార్లలో పెంచుతారని భావించినా పాత సంఖ్యనే ఖరారు చేశారు. దీంతో పాటు మద్యం షాపుల టెండర్లో పాల్గొనేందుకు దరఖాస్తు రుసుమును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు విక్రయించి 18న లాటరీ తీయనున్నారు. -
పెద్ద సూపర్ మార్కెట్.. ఎక్కడ చూసినా ఎలుకలే
టోక్యో : జపాన్‌లోని ఓ సూపర్ మార్కెట్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్ మార్కెట్ మూసేశాక ఓ వ్యక్తి బయట నుంచి ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘స్టోర్‌లో పగలు కస్టమర్లు తిరిగినంత స్వేచ్ఛగా.. ఈ టైమ్‌లో ఎలుకలు సంచరిస్తున్నాయి. ఇక్కడే ఇన్ని ఉంటే స్టోర్ మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయో’ అంటూ ఓ సందేశాన్ని కూడా జత చేశాడు. ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్లకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. సరేలే ఇదేదో చిన్న స్టోర్ అనుకుంటే పోరపాటే. ఎందుకంటే.. ఈ స్టోర్ ఆసియా వ్యాప్తంగా వేల సంఖ్యలో బ్రాంచ్‌లు గల ఫ్యామిలీ మార్ట్ సంస్థకు చెందినది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో షిబుయా జిల్లాలో గల ఈ దుకాణాన్ని మూసివేసినట్లు ఫ్యామిలీ మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వినియోగదారులకు క్షమాపణ తెలిపింది. స్టోర్‌లోని ఎలుకలను పూర్తిగా తొలగిస్తామని, వస్తువులను కూడా తీసివేస్తామని ప్రకటించింది. -
వరంగల్‌లో రిలయన్స్ స్మార్ట్ స్టోర్
సాక్షి, వరంగల్ : రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ తన కొత్త స్టోర్‌ను వరంగల్‌లోని బాలసముద్రంలో గల సురేష్‌రెడ్డి ప్రాపర్టీస్‌లో ప్రారంభించింది. ఒకే కేంద్రంలో బహుళవిధమైన ఉత్పత్తులను కలిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్పత్తులు, పండ్లు మరియు కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్వేర్, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్రారంభమైన వరంగల్ స్టోర్ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 15కు చేరుకుంది. 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన వరంగల్ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన డిజైన్ మరియు లేఔట్ కలిగి ఉండి, నాణ్యమైన ఉత్పత్తులు మరియు ఆకర్షణీయమైన ధరల వల్ల స్థానిక ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటుగా వారి దైనందిన అవసరాలను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిలవనుంది. `పవర్ ఆఫ్ 9` పేరుతో కల్పించిన ప్రారంభోత్సవ ఆఫర్ ద్వారా ఉల్లిగడ్డలు, కొబ్బరికాయలు, ప్లాస్టిక్ కంటెయినర్ల సెట్ వంటి అనేక ఉత్పత్తులు కేవలం రూ.9 కే (వీటి మార్కెట్ ధర కనీసం రూ.999 ఉంటుంది) అందించడం వల్ల అనేకమంది వినియోగదారులు ఆకర్షితులు కానున్నారు. -
జీఎంతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: సూపర్ మార్కెట్‌కు వెళితే ఇంటికి కావాల్సిన అన్ని సరుకులు కొనుగోలు చేస్తాం. ఉప్పుపప్పు నుంచి నూనెలు, బిస్కెట్లు, చాక్లెట్లు కూడా అందులో ఉంటాయి. అంతేకాదు.. అల్పాహారం కోసం విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఓట్స్ వంటివి కూడా తీసుకుంటాం. అంతేనా.. ఫారిన్ పళ్లు సైతం కొంటుంటాం. రోజూ కాకపోయినా వారానికోసారి అయినా ఆ తరహా షాపింగ్ ఉంటుంది. అయితే మీరు కొంటున్న ఆహార పదార్థాలను ఒక్కసారి పరిశీలించండి. ఎందుకంటే ఆరోగ్యానికి హాని చేసే జన్యుమార్పిడి పంటల (జీఎం ఫుడ్స్)తో తయారైన ఆహారం నగర మార్కెట్‌ను ముంచెత్తుతోంది. హైదరాబాద్‌లోని పలు మాల్స్, స్టోర్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న నిత్యావసర ఆహార పదార్థాలు, చిన్నపిల్లలు అధికంగా ఇష్టపడే చిరుతిళ్లలో 32 శాతం వరకు జన్యుమార్పిడి పంటల నుంచి తయారైనవేనని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా సోయా, మొక్కజొన్నతో తయారు చేసిన పదార్థాలు ఉన్నాయని, ఇవన్నీ కెనడా, అమెరికా,నెదర్లాండ్స్, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలింది. వీటిలోచాలా వరకు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలేనని సీఎస్ఈ స్పష్టం చేసింది. మార్కెట్లో ఇంత జరుగుతున్నా ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎం ఫుడ్స్ వెల్లువ ఇలా.. మన దేశంలో 2013 నుంచి అక్రమంగా పలు జన్యు మార్పిడి పంటల సాగు మొదలైంది. జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా జన్యుమార్పిడి పత్తి విత్తనాల నుంచి తీసిన నూనెను ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సోయా, మొక్కజొన్న తదితర పంటలతో తయారు చేసిన ఆహార పదార్థాల్లో జన్యుమార్పిడి పంటల ఆనవాళ్లున్నాయి. జన్యుమార్పిడి పంటలు, వాటితో తయారైన పదార్థాలను కట్టడిచేసే విషయంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ చర్యలూ తీసుకోవట్లేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌లో ప్రధానంగా ఉదయం అల్పాహారంగా తీసుకునే ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్ వంటివి సైతం ఉన్నాయని తేలింది. ♦ జీఎం ఫుడ్స్‌లో మూడు రకాలున్నాయి.. జీఎం ఫుడ్స్ ఆనవాళ్లుండీ లేబుల్స్ అతికించని పదార్థాలు ఒకటి కాగా.. ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు మించి జీఎం అవశేషాలున్నవి మరొకటి.. అసలు ఎలాంటి అనుమతుల్లేకుండా విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్ మూడోరకం. ♦ రాజధానిలోని అన్ని సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో చాలావరకు జీఎం ఫుడ్స్ ఆగ్మార్క్ లేబుల్స్ లేకుండానే విక్రయిస్తున్నట్లు తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనంలో దేశంలో సుమారు 65 రకాల జీఎం ఫుడ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 35 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి, మరో 30 దేశీయంగా తయారవుతున్నాయి. ♦ సీఎస్ఈలోని పొల్యూషన్ మానిటరింగ్ ప్రయోగశాలలో పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించగా వీటిలో సుమారు 32 శాతం ఆహార పదార్థాలకు ‘జీఎం–పాజిటివ్’ అని తేలింది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల్లో సుమారు 80 శాతం వరకు జీఎం పాజిటివ్ ఉన్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. అంతేగాక పలు ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై జీఎం ఆనవాళ్లున్నట్లు ఎలాంటి లేబుల్స్ అతికించట్లేదని గుర్తించారు. ♦ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న పలు జీఎం పాజిటివ్ ఆహార పదార్థాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టమైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై ‘జీఎం ఫ్రీ’ అని ఉన్నా.. వాటిలో జీఎం ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆహారంతో ఎన్నో అనర్థాలు మానవుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జీవక్రియ వేగం మందగిస్తుంది. అలర్జీలకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం, కళ్ల సంబంధ వ్యాధులు, శ్వాస, జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. సాంక్రమిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ఫుడ్‌ను కట్టడి చేయాల్సిందే.. రాజధాని మార్కెట్లో ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న అన్నిరకాల జీఎం ఫుడ్స్‌ను నిషేధించాలి. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరించాలి. పలు మాల్స్, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న జీఎం ఫుడ్స్‌పై జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టాలి. జీఎం ఫుడ్స్ కొనుగోలు విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇవి తింటే రోగాలు కొనితెచ్చుకున్నట్లే. – ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, పర్యావరణవేత్త -
ఒక్క అరటిపండు ధర రూ.87000..!
నాటింగ్‌హోమ్ : అరటి పండు.. దాదాపు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తినదగిన అత్యంత చౌకైన ధర కలిగినది. దీనిని పేదవాడి ఆపిల్ అని కూడా అంటారు. మాములుగా అయితే ఒక్క అరటి పండు ధర నాలుగు లేదా ఐదు రూపాయలు ఉంటుంది. మహా అయితే గరిష్టంగా ఓ పది రూపాయలు ఉంటుంది. కానీ యునైటెడ్ కింగ్డమ్లో ఓ మహిళ ఒక అరటిపండును ఏకంగా రూ. 87,000 పెట్టి కొన్నారు. ఎంటీ షాకయ్యారా..? మీలాగే ఆమె కూడా బిల్లు చూసి షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే... యూకేలోని నాటింగ్‌హోమ్ నగరానికి చెందిన బాబీ గోర్డాన్ ఓ సూపర్ మార్కెట్లో ఆన్లైన్ షాపింగ్ చేశారు. మొత్తం బిల్లు 100 పౌండ్లు అయింది. అయితే సూపర్ మార్కెట్ వర్కర్లు పొరపాటున బిల్లును 1000 పౌండ్లుగా వేశారు. దాంట్లో ఒక్క అరటిపండుకే 930.11 పౌండ్లు( రూ. 87,000) బిల్లు వేశారు. బిల్లు చూసి ఆశ్యర్యానికి గురైన బాబీ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే బిల్లు వర్కర్ల పొరపాటు వల్ల అలా జరిగిందని, క్షమించాలని సూపర్ మార్కెట్ యజమాని బాబీని కోరారు. అలాగే తమ మార్కెట్లోని అరటి పండ్లు శుభ్రంగా, తాజాగా ఉంటాయి. మా అరటిపండ్లకు రూ.87,000 ధర పెట్టొచ్చని చమత్కరించారు. -
సిటీ సూపర్ మార్కెట్ అబిడ్స్ షాప్
సాక్షి, సిటీబ్యూరో : నేడు మనం చూస్తున్న సూపర్ మార్కెట్లకు నగరంలో 125 ఏళ్ల క్రితమే పునాది పడింది. ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన భాగ్యనగరం... ఆనాడే అన్ని వస్తువులకు కేంద్రంగా నిలిచింది. సూది నుంచి వాకీటాకీ వరకు ఇక్కడ లభించేవి. ఆర్మేనియా దేశస్థుడు అల్బర్ట్ అబిడ్స్ 1893 ఫిబ్రవరి 20న ‘అల్బర్ట్ అబిడ్స్ అండ్ కో’ పేరుతో దీనిని నెలకొల్పాడు. అల్బర్ట్ అబిడ్స్ 1848 జులై 23న ఆర్మేనియాలో జన్మించాడు. వృత్తిరీత్యా వజ్రాల వ్యాపారి అయిన అల్బర్ట్... ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు విదేశీ దుస్తులు, ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో నిజాం రాజుకు స్టైలిస్ట్‌గా మారాడు. ఇక్కడి ప్రజల జీవనశైలిపై అధ్యయనం చేశాడు. దీంతో నగరంలో దేశవిదేశీ వస్తువులతో షాప్ నెలకొల్పేందుకు నిజాం అనుమతి తీసుకున్నాడు. అప్పటికి నగరం నడుమ జనరల్ పోస్టాఫీస్ ప్రాంతంలో ముస్తఫా బజార్ కొనసాగుతుంది. అక్కడే ‘అల్బర్ట్ అబిడ్స్ అండ్ కో’ పేరుతో షాప్ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు నగరంలో ఆభరణాలు, గడియారాలు, మోటార్‌సైకిళ్లు, స్టేషనరీకి సంబంధించి వేర్వేరు షాపులు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చిందీ షాప్. లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, జ్యువెలరీ, స్టేషనరీ... ఇలా అన్ని రకాల దేశవిదేశీ వస్తువులు ఇందులో లభించేవి. ఇప్పుడున్న సూపర్ మార్కెట్లలో మాదిరి ఒక్క పండ్లు, కూరగాయలు మినహా అన్ని ఉండేవి. ఈ షాప్ ఏర్పాటుతోనే ఆ ప్రాంతానికి అబిడ్స్ అనే పేరొచ్చింది. 1942 వరకు కొనసాగింపు... 1911లో మహబూబ్ అలీఖాన్ మరణించాడు. దీంతో ఆవేదనకు గురైన అల్బర్ట్ షాప్‌ను విక్రయించి స్వదేశానికి వెళ్లిపోయాడు. 1914లో ‘స్టేట్ టాకీస్’ రూ.5లక్షలకు ఈ వ్యాపార సముదాయాన్ని కొనుగోలు చేసింది. స్టేట్ టాకీస్ రెండేళ్లు కొనసాగించిన అనంతరం... ఇందుభాయ్ పటేల్ రూ.7 లక్షలకు దీనిని తీసుకున్నారు. 1942 వరకు ఈ షాప్‌ను నడిపించారు. వ్యాపార సముదాయ నిర్మాణం... 1942 తర్వాత ఇందుభాయ్ పటేల్ దీనిని ప్యాలెస్ టాకీస్‌గా మార్చారు. 1974 వరకు ఇది కొనసాగింది. అనంతరం అదే స్థలంలో కొత్తగా రెండు మినీ ప్యాలెస్‌లు నిర్మించి సినిమా హాళ్లను ఏర్పాటు చేశారు. 1996 వరకు ఇవి కొనసాగాయి. తర్వాత వీటిని కూలగొట్టి 2001లో వ్యాపార సముదాయం నిర్మించారు. ఇక్కడే బిగ్ బజార్, ఇతర షాపులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇందుభాయ్ కుమారుల అధీనంలో ఉంది. -
ఈ దొంగలు రంగంలోకి దిగారో.. సినిమానే ఇక
ఇంగ్లాండ్ : సాధారణంగా సినిమాల్లో మాత్రమే ఇలాంటి సీన్ సాధ్యం అవుతుంది. అది కూడా ఎన్నో టేక్‌లు తీసుకుంటేనో అది కుదురుతుంది. ఇంతకు ఏమిటా సీన్ అనుకుంటున్నారా..! అదో దొంగతనం సీన్. అయితే సినిమా షూటింగ్ ద్వారా తీసింది కాదు.. వాస్తవంగా జరిగిన సీన్.. చక్కగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అదొక సూపర్ మార్కెట్.. దానికి అద్దాలతో ఏర్పాటుచేసిన ప్రవేశం ఉంది. ప్రత్యేకంగా గోడలంటూ ఏమీ లేవు. అందులోనే ఓ ఏటీఎం మెషిన్ కూడా ఉంది. దానిపై దొంగల కన్నుపడింది. ఎలాగైనా దానిని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఏకంగా డిఫెండబుల్ ల్యాండ్ రోవర్ కారును తీసుకున్నారు. అది కూడా ఎత్తుకొచ్చిన కారే. నేరుగా రివర్స్ చేసి సూపర్ మార్కెట్లోకి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రవేశ మార్గం మొత్తం ధ్వంసం అయింది. వెంటనే అందులో నుంచి కొందరు దికి ఏటీఎం మెషిన్ డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. పూర్తయ్యాక దానికి ఒక తాడు కట్టి ల్యాండ్ రోవర్‌తో బయటకు ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత తాడు విప్పేసి అందరు కలిసి ఆ మెషిన్‌ను కారు వెనుకాలే వేసుకొని జంప్ అయ్యారు. అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. దీనిని తాజాగా పోలీసులు విడుదల చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. -
సూపర్ మార్కెట్లో కి‘లేడీలు’
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఓ సూపర్ మార్కెట్లో చోరీ చేస్తూ ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. రైతు బజారుకు ఎదురుగా ఉన్న సాగర్ సూపర్ మార్కెట్లోకి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు దర్జాగా ప్రవేశించారు. ఎవరికీ అనుమానం రాకుండా షాపులో చేతికందిన వస్తువునల్లా బురఖాలో వేసుకున్నారు. వచ్చిన పని ముగించుకుని తిరిగి వెళ్లే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన సూపర్ మార్కెట్ యాజమాన్యం మహిళా ఉద్యోగులతో కిలేడీలను తనిఖీ చేయిస్తే అసలు విషయం బయటపడింది. ఒక్కో మహిళ రూ.10వేల వరకు విలువ చేసే సామానులను దొంగతనం చేసే యత్నం చేసినట్లు తెలిసి యాజమాన్యం ముక్కున వేలేసుకుంది. -
ఊళ్లోకే వచ్చేస్తాయ్... పచ్చటి పొలాలు!
నగరాల్లో ఉన్న పిల్లల్ని బియ్యం ఎక్కడ నుంచి వస్తాయిరా? అని అడగండి... సూపర్ మార్కెట్ నుంచి అని ఠక్కున సమాధానిమిస్తారు. కొంతమందైతే బియ్యం చెట్లకు కాస్తాయి అని అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. నగర జీవితం అంత యాంత్రికమైపోయింది మరి. ఈ సమస్య నెదర్లాండ్స్‌లోనూ ఉన్నట్టుంది. అందుకే నగర జీవులకు పచ్చదనాన్ని పరిచయం చేయడంతోపాటు ఎక్కడో పండిన పంటలను వందల కిలోమీటర్ల దూరం మోసుకొస్తారు కాబట్టి... వాటి ద్వారా పరోక్షంగా పెరిగే కాలుష్యాన్ని తగ్గించాలని స్పేస్ 10 అనే ఆర్కిటెక్చర్ సంస్థ ఈ అద్భుతమైన పచ్చటి గోళాన్ని డిజైన్ చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇదో చిన్నపాటి పొలమనుకోండి. పేరు ‘గ్రో రూమ్’. కాయగూరలు, ఆకు కూరలతోపాటు కొన్ని రకాల ఇతర మొక్కల్ని కూడా దీంట్లో పండిస్తున్నారు. నగరాల్లో ఇలాంటివి వీలైనన్ని ఏర్పాటు చేస్తే అటు కాలుష్యం తగ్గడంతోపాటు ఇటు కాయగూరలపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుందని స్పేస్ 10 అంటోంది. అంతేకాకుండా... కాంక్రీట్ జనారణ్యం మధ్యలో ఇలాంటి పచ్చటి గోళాలు ఉంటే కంటికి కూడా ఇంపుగా ఉంటుందన్నది వీరి అంచనా. కేవలం కాయగూరలు, ఆకు కూరలను పండించడమే కాకుండా ఇందులో ఈ గోళం మధ్యలో కొంతమంది హాయిగా కూర్చుని రిలాక్స్ అయ్యేందుకూ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ నెలలోనే తొలి గ్రో రూమ్ ఏర్పాటు కాగా... చిన్న పిల్లలు కళ్లింత చేసుకుని చూస్తున్నారట., భారతదేశంలో ఇలాంటి వాటి అవసరం ఇప్పట్లో ఉండకపోవచ్చుగానీ... ఇదో ఆసక్తికరమైన ఐడియా అన్నది మాత్రం నిజం! -
‘ప్లాస్టిక్’ బియ్యం!
సూపర్ మార్కెట్ ముందు బాధితుడి ఆందోళన హైదరాబాద్: బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంటూ బాధితులు ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం నాగోలులో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం... బండ్లగూడ శివశంకర్‌కాలనీలో నివాసముండే మంగ శ్రీనివాస్ ఓ టీవీ చానల్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న నాగోలులోని మోర్ సూపర్ మార్కెట్లో 25 కిలోల గజానన్ బ్రాండ్ బియ్యాన్ని రూ.950కు కొనుగోలు చేశాడు. ఆదివారం ఇంట్లో ఈ బియ్యంతో అన్నం వండారు. మధ్యాహ్నం సమయంలో వండిన పాత్రలో అడుగుభాగం గట్టిగా మారి అన్నం ప్లాస్టిక్‌లా సాగింది. దీంతో బాధితులు నాగోలులోని మోర్ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా మాకేం సంబంధం లేదంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులతో మోర్ మార్కెట్ వద్ద ఆందోళనకు సిద్ధం కాగా, షాపు మేనేజర్ వచ్చి బియ్యాన్ని పరిశీలించారు. కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా నుంచి గజానన్ బియ్యాన్ని తెప్పించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్టోర్లలో విక్రయిస్తున్నామని, ఇంతవరకు ఎలాంటి కంప్లయింటూ రాలేదని మేనేజర్ చెప్పారు. అందరి ఎదుటా తమ వద్దనున్న సంచుల్లో నుంచి బియ్యం తెచ్చి వండి చూపించారు. అందులో ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపించలేదన్నారు. అయితే తనకు విక్రయించింది మాత్రం ప్లాస్టిక్ బియ్యమేనంటూ బాధితుడు స్పష్టం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు సురేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా సివిల్‌సప్లైస్ విభాగం విజిలెన్స్ సభ్యులు జగన్మోహన్రెడ్డి తదితరులు మోర్ వద్దకు వచ్చి బియ్యం పరిశీలించారు. కాగా, నగరంలో చైనా నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో ప్లాస్టిక్ ఆనవాళ్లున్నట్లు పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగర మార్కెట్లో చైనా బియ్యం త్వరలో సరఫరా అవుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా, తామిప్పటి వరకూ వాటిని చూడలేదని హయత్‌నగర్‌లోని రైస్‌మిల్లర్ శంకర్‌రెడ్డి చెప్పారు. ఒకవేళ ప్లాస్టిక్ బియ్యం కలిసిన అన్నం తింటే జీర్ణకోశ వ్యాధులు తప్పవంటూ అపోలో ఆసుపత్రి డీఆర్డీఓ డాక్టర్ సమి హెచ్చరిస్తున్నారు. -
సంచలన వార్త
ఇద్దరం టోపీలు ధరించి ఆయన కార్లో బయలుదేరాం. కొద్ది దూరంలో చీకట్లో కారాపి చెప్పాడు. ‘‘ఆ వస్తున్నది జిమ్.’’ డేష్ బోర్డు తెరిచి అందులోని ఓ పెట్టెలోంచి పిస్తోలు గుళ్లని తీసి పిస్తోలు లోడ్ చేసి, మా పక్కనించి వెళ్లే జిమ్ని రెండుసార్లు కాల్చి కారుని ముందుకి పోనిచ్చాడు. మర్నాడు జిమ్ కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూ చేయడానికి సిరిల్ నన్ను పంపాడు. స్థానిక దినపత్రికలో ఖాళీ ఉందని మిత్రుల నించి తెలుసుకున్నాక సెంట్రల్ విల్కి వచ్చాను. సూపర్ మార్కెట్ పై అంతస్థులో వెనక భాగంలో ఉన్న ఆ పత్రికా కార్యాలయానికి వెళ్లి, దాని ఎడిటర్ మిస్టర్ సిరిల్ ఫ్లాగ్‌ని కలిశాను. అది చాలా చిన్న ఆఫీసు. రెండు బల్లలు, నాలుగు కుర్చీలు. వెలిసిపోయిన వాల్ పేపర్. అనేక షెల్ఫుల నిండా కాగితాల కట్టలు. అవి ఆ ఆఫీస్‌కి పత్రికా ఆఫీస్ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ‘‘అతను మాయం అవబట్టి నీకు ఉద్యోగం ఇస్తున్నాను’’ ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే చెప్పాడు. ‘‘ఎవరు?’’ అడిగాను. ‘‘నీ ముందు పనిచేసిన సబ్ ఎడిటర్ కమ్ విలేకరి. నీ డిజిగ్నేషన్ కూడా అదే.’’ ‘‘అతను ఎందుకు మాయం అయ్యాడు?’’ అడిగాను. ‘‘ఎవరికీ తెలీదు. మా పత్రికకి ఇంకో మనిషి అవసరం ఉంది. మొదటగా వచ్చింది నువ్వు. ఇవాల్టి నించే పని ఆరంభించు. అన్నట్లు నీ పేరు?’’ సిరిల్ అడిగాడు. ‘‘గెర్చర్.’’ ‘‘నీకూ పత్రికకీ మధ్య గల సంబంధాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకోవాలి. అది పవిత్రమైంది. దీన్ని కొనసాగించడం ఉత్తమమైన పని. తర్వాతే ఏదైనా. గొర్రెలకి నిత్యం తిండి పెట్టినట్లుగా పాఠకులకి మనం సెన్సేషనల్ వార్తలని ఇస్తుండాలి. మనిషి కుక్కని కరిచాడు లాంటివి. ఐతే అవి ఎవరి నించి సంపాదించామో మాత్రం బయట పెట్టకూడదు. నువ్వు అలా ఒట్టు పెట్టాలి’’ సిరిల్ కోరాడు. ‘‘పెట్టాను’’ నా చేతిని ముందుకి చాపి చెప్పాను. ‘‘మంచిది. దానికి కట్టుబడి ఉండు. లేదా నీకే ప్రమాదం.’’ ఇద్దరం కరచాలనం చేశాం. కొద్ది రోజుల్లో నేను నా ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించడం నేర్చుకున్నాను. ఊళ్లో జరిగేవన్నీ నేను గమనించి వార్తలుగా రాస్తే, వాటిని చదివి మార్చకుండా సిరిల్ ప్రచురించేవాడు. ఐతే ఆ చిన్న ఊళ్లో పెద్ద వార్తలు అరుదు. కొద్ది వారాల తర్వాత ‘అసలీ చిన్న ఊరికి దినపత్రిక అవసరం ఏముంది?’ అని నాకు అనిపించసాగింది. ఆ పత్రికలో ప్రచురితం అయ్యేవన్నీ ఒకే రకం వార్తలు. పుట్టుకలు, విడాకులు, పెళ్లిళ్లు, చావులు, బదిలీలు, యానివర్సరీలు, ఇంకా సినిమా రివ్యూలే. ఒక్కోసారి కొన్ని వారాలు చావు, పుట్టుకల వార్తలు లేకుండానే పత్రిక వెలువడేది. వరదలు, గొడ్డలితో హత్య లాంటివి ఉండేవి కావు. క్రిస్ట్మస్, జీసస్ లాంటి విషయాల మీద బడి పిల్లలతో ఇంటర్వ్యూలు ప్రచురించసాగాం. ‘‘సర్. మన పత్రిక సర్క్యులేషన్ ఐదు వేల నించి నాలుగున్నర వేలకి తగ్గింది’’... ఓ రోజు నేను సిరిల్‌తో చెప్పాను. ‘‘అలాగా? ఐతే మళ్లీ పెంచడానికి ఏదైనా చేయాలి. నువ్వు రాకమునుపు కూడా ఇలా పత్రిక సర్క్యులేషన్‌కి మబ్బులు కమ్మేవి. ఏదో చేసి ఆ మబ్బు లని తొలగిస్తూ వస్తున్నాను’’ చెప్పాడు. ‘‘ఎలా?’’ ఆసక్తిగా అడిగాను. ‘‘ఊహల్ని ఉద్యోగం చేయనివ్వాలి. ఎవరి శవాన్నైనా వెలికి తీసి ఆర్సనిక్ పాయిజన్ ఉందేమో పరిశీలించమని రాయాలి. అయినా వద్దు. ఇది ఇదివరకు ఉపయోగించాం. పద.’’ ఇద్దరం టోపీలు ధరించి ఆయన కార్లో బయలుదేరాం. కొద్ది దూరంలో చీకట్లో కారాపి చెప్పాడు. ‘‘ఆ వస్తున్నది జిమ్.’’ డేష్‌బోర్డు తెరిచి అందులోని ఓ పెట్టెలోంచి పిస్తోలు గుళ్లని తీసి పిస్తోలు లోడ్ చేసి, మా పక్కనించి వెళ్లే జిమ్ని రెండుసార్లు కాల్చి కారుని ముందుకి పోనిచ్చాడు. నిర్ఘాంతపోయిన నాతో చెప్పాడు. ‘‘నీ ఒట్టు గుర్తుందిగా? ఇక పత్రిక అమ్మకాలు పెరుగుతాయి. అన్నట్లు ఈ సెన్సేషనల్ హత్య గురించి చక్కగా రాయి. గుర్తు తెలియని వ్యక్తి లేదా వ్యక్తుల చేతిలో హత్యకు గురయిన గుడ్ ఓల్డ్ జిమ్ గురించి రాయి.’’ మర్నాడు జిమ్ కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూ చేయడానికి సిరిల్ నన్ను పంపాడు. కొద్ది వారాలు నేను భయం భయంగా గడిపానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘‘చూశావా గెర్చర్? పత్రిక సర్క్యులేషన్ పెరగడానికి మనకి మనం ఒక్కోసారి సహాయం చేసుకోవాల్సి వస్తుంది’’... సర్క్యులేషన్ పెరగ్గానే చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ సర్క్యులేషన్ పడిపోయింది. ‘‘పాఠకులకి మేత కోసం మళ్లీ ప్రయత్నించాలి’’ సిరిల్ చెప్పాడు. ఇటీవలే అతని సబ్ ఎడిటర్ మాయం అయ్యాడు. ఇంకోసారి అలా జరగనివ్వడు అనుకున్నాను. అరగంట ఆలోచించి టోపీ పెట్టుకుని సిరిల్ నాకు సౌంజ్ఞ చేసి బయటికి నడిచాడు. ఇద్దరం ఆయన కారెక్కాం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుని దాటే ఓ మహిళని సిరిల్ కారు గుద్దింది! నేను భయంగా సీట్లో వెనక్కి జారగిలబడ్డాను. ‘‘గమనించావా? ఆమె కదులుతోంది. కాని వెనక్కి వెళ్లడం పెట్రోల్ వృథా చేయడమే. కారుని వేగంగా నడిపే టీనేజర్ల మీద ప్రత్యేక వ్యాసం రాయి. నువ్వు అది బాగా రాయగలవు.’’ ఆ వార్త చాలా వారాలు మా పత్రిక సర్క్యులేషన్‌ని నిలిపింది. బ్యూరో ఆఫ్ డ్రైవింగ్ లెసైన్స్లోని లంచగొండితనం మీద నేను రాసిన వ్యాసం సిరిల్‌కి బాగా నచ్చింది. ఓ రోజు అడిగాడు. ‘‘నీకీ ఉద్యోగం బావుందా?’’ బాధ్యతలన్నీ తెలిశాయా?’’ తల ఊపాను. ‘‘ఐతే మళ్లీ పని చూడు. సర్కులేషన్ తగ్గు ముఖం పట్టింది.’’ ఆ సాయంత్రం నేను ఆఫీసులో ఎక్కువసేపు ఉండి పాత సంచికలన్నీ తిరగేయసాగాను. ఆరేళ్ల పిల్ల హత్యల్లాంటి కొన్ని వార్తలు చాలా బాధాకరమైనవి. హాస్పిటల్ని తగలబెట్టిన దోషి. సర్కస్‌లో సింహం బోనుని అజ్ఞాత వ్యక్తి తెరిచాడు. ఆ సింహాన్ని పోలీసులు చంపేలోగా అది నలుగుర్ని చంపింది. ఈ వార్త ఎనిమిది నెలలు సర్క్యులేషన్‌ని నిలబెట్టింది. మిస్టర్ సిరిల్ ఎడిటర్‌స గిల్డ్ నించి మానవీయ కోణంలో వార్తలని రాసినందుకు బహుమతి అందుకునే ఫోటో ఒకటి ఓ సంచికలో ఉంది. ఆ రాత్రంతా నేను నా గదిలో అటు, ఇటు నడుస్తూ సర్క్యులేషన్‌ని ఎలా పెంచాలా అని ఆలోచిస్తూండిపోయాను. అంతదాకా నీటిలో మునిగి చావడం, కిడ్నాపింగ్‌లు ఆ ఊళ్లో జరగలేదు. బాంబు కూడా పేల్లేదు. ఆలోచించి ఆలోచించి అలసటతో నిద్రపోయాను. చివరికి అవి సిరిల్‌కి సూచించాను. మరికొన్ని నెలల తర్వాత మళ్లీ సర్క్యులేషన్ పడిపోసాగింది. ‘‘గెర్చర్. బాంబు పేలిన వార్తమీద పాఠకులకి మొహం మొత్తినట్లుంది. ఈసారి ఏం చేద్దాం?’’ అడిగాడు. ‘‘నాకు ఓ మంచి ఆలోచన వచ్చింది సార్’’ చెప్పాను. ‘‘ఏమిటది?’’ ఆయన అడిగాడు కంగారుగా. ‘‘ఇది’’ కాగితాన్ని ఇచ్చి చెప్పాను. నల్లటి బోల్డ్ లెటర్స్‌లో ‘అవార్డ్ పొందిన పత్రికా సంపాదకుడి హత్య- తన ఆఫీసులోనే.’ ఆయన కంగారుగా లేస్తూంటే బలమైన పేపర్ వెయిట్‌తో ఆయన తలమీద కొట్టాను. మళ్లీ మళ్లీ మళ్లీ. (డొనాల్డ్ హోనిగ్ కథకి స్వేచ్ఛానువాదం) -
సంతసం
సంతా మా ఊరి సంత. వారానికోసారి జోరుగా సాగే ఈ సంత... ఇప్పుడు సిటీ కాలనీల్లోనూ హుషారుగా కొనసాగుతోంది. సూపర్ మార్కెట్లోని గాజుతొట్టెల్లో వాడిపోయి ముఖం వేలాడేసి కనిపించే కూర గాయలకంటే... తాజాదనాన్ని ఇళ్ల నడుమకే మోసుకొచ్చే వారాంతపు మార్కెట్లంటేనే జనం మోజు పడుతున్నారు. ప్రైస్ అటుఇటుగా ఉన్నా ఫ్రెష్‌గా దొరుకుతుండటంతో.. ఈ అంగళ్లవైపే అడుగులు వేస్తున్నారు! - శరాది హైదరాబాద్.. మెట్రో, వాల్‌మార్ట్, క్యూ మార్ట్, స్పెన్సర్స్, బిగ్ బజార్, మోర్ మార్కెట్స్వంటి హంగుల హబ్! అంతర్జాతీయ అంగడికి అద్దం ఇది. గుండు సూది నుంచి గూడుకు కావల్సిన ఫర్నిచర్దాకా అన్నిటినీ ఒక్క చోటే కొలువుదీర్చే ఈ బిగ్ బజార్ల చుట్టూ పట్నవాసులు బాగానే క్యూ కట్టారు కొత్తలో! ఆ వరుసకి సందు చివర మార్కెట్లు.. పచారీ కొట్లు చిన్నబుచ్చుకున్నాయి! ఇప్పుడా పరాయి కల్చర్ పస తగ్గింది. మన సొంత సంతల సంస్కృతి పట్నాల గల్లీల్లో పరుచుకుంటోంది! ఇప్పుడు వారాంతపు అంగళ్లు సిటీ ఇళ్ల అరుగులను ఆక్రమిస్తున్నాయి. పల్లె శోభను పట్నానికి తెస్తున్నాయి! గుండుసూది నుంచి గొంగళ్ల దాకా.. వెజిటబుల్స్తోపాటు ఇతర వస్తువులనూ పేర్చడంలో సూపర్మార్కెట్లకు, మాల్స్కేమీ తీసిపోవు ఈ అంగళ్లు. తాజా కూరగాయలు, ఎండు చేపలు, రొయ్యలు, సీజన్లో దొరికే పళ్లు, అన్ని కాలాల్లో కనిపించే డ్రై ఫ్రూట్స్ ఓ వైపు నోరూరిస్తుంటే గుండు సూదుల నుంచి మొహాన్ని మెరిపించే అద్దాలు, దువ్వెన్లు, బొట్టు, కాటుక, పౌడర్, పెర్ఫ్యూమ్స్, చెంప పిన్నులు, జడ రబ్బర్లు, సవరాలు, చీరలు, రవికెలు మొదలు దుప్పట్లు ఆఖరుకు పల్లెలకే పరిమితమైన గొంగళ్లు సైతం సంతను ఆక్రమిస్తున్నాయి. ఇంకోవైపు ప్లాస్టిక్ మగ్గులు మొదలు టబ్బులు, బకెట్లు, డ్రమ్ముల నుంచి స్టీలు బిందెలు, గిన్నెలు, పింగాణి, గృహ అలంకరణ వస్తువులు ఆకర్షిస్తున్నాయి. ఇంటికి దగ్గరగా అగ్గువ ధరకే దొరుకుతూ... డబ్బుతోపాటు సమయాన్నీ ఆదా చేస్తున్నాయి. చిక్కడపల్లి నుంచి కూకట్పల్లిదాకా.. ఆదివారం నుంచి శనివారం దాకా.. చిక్కడపల్లి నుంచి కూకట్పల్లి దాకా.. మౌలాలి నుంచి గచ్చిబౌలి వరకు.. రోజుకో వాడన వెలుస్తున్నాయి. ‘మా దగ్గర (చిక్కడపల్లి) బుధవారం ఈ అంగడొస్తది. మాలాంటి మిడిల్‌క్లాస్ వాళ్లకు ఇట్లాంటివి ఎంతో ఉపయోగం. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ల ఊర్లో చూస్తుంటిమి ఈ అంగళ్లను. సిటీలనే పుట్టిపెరిగిన మాకు అవి మంచి జ్ఞాపకాలు. ఓ పదేళ్ల కిందటొచ్చిన ఈ మాల్స్ వాటిని మరిపించినయ్. మళ్లీ ఇట్లా మా గల్లీలకే రావడం.. మస్తు సంతోషంగా ఉంది. మాల్స్లల్ల తాజా కూరగాయలే కాదు.. ధరలూ అందుబాటులో ఉండవ్. ఇక్కడ అట్లా కాదు.. ఆకు కూరలదగ్గర్నుంచి అన్నీ తాజాగా దొరుకుతయి... అదీ మా బడ్జెట్‌కి అనుగుణంగా. అక్కడ రెండువందల రూపాయలకు నాలుగు రోజుల కూరగాయలు దొరికితే ఇక్కడ రూ.100కు ఆరు రోజుల కూరలు దొరుకుతాయి. మళ్లీ ఆటో చార్జీలుండవ్’ అంటుంది ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కొండ రాజ్యలక్ష్మి. అయితే చిక్కడపల్లికి కాస్త దూరంలో ఉన్న నల్లకుంట రెగ్యులర్ మార్కెట్లో ఆకుకూరల దుకాణమున్న రవి మాట్లాడుతూ ‘వారానికోరోజు వాడలల్ల అంగళ్లొచ్చి మా గిరాకీని దెబ్బకొడ్తున్నయ్.సిటీ చుట్టుపక్కల ఊర్లనుంచి కూరగాయలు తెస్తరు.. చాలా మటుకు రైతులుంటరు. తక్కువ ధరకే ఇస్తరు. మేమేమో మారు బేరగాళ్లం. మాకు అంత తక్కువ ధరకు పడయ్. గందుకే మా దగ్గర రేట్ ఎక్కువని వస్తలేరు’ అని వాపోయాడు. బెడదలేదు... ‘మాది జాయింట్ ఫ్యామిలీ. ఇద్దరు కొడుకులు, కోడళ్లు.. అందరూ ఉదయం లేవగానే ఆఫీస్‌కి వెళ్లేవాళ్లే. శని, ఆదివారాలు వచ్చాయంటే రెస్ట్ తీసుకుంటారు. మార్కెట్‌కో, మాల్స్కో వెళ్లి కూరగాయలు తెచ్చే ఓపిక ఎవరికీ ఉండదు. ఆ బాధ్యత నాదే. ఇన్నాళ్లు మా ఏరియాకు ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతు బజార్కెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒక్కదాన్నే అన్నన్ని కూరగాయలు మోస్తూ ఆటోచార్జీలు భరిస్తూ తెచ్చుకోవడం భలే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ బాధ లేదు. మా ఏరియాలో ఎవ్రీ ఫ్రైడే సంతొస్తోంది గుమ్మం ముందుకే. ఎవరి హెల్ప్ లేకుండా ఎంచక్కా ఇంటిల్లిపాదికి కావల్సిన కూరలు, పళ్లూ తెచ్చిపడేస్తున్నాను. ఇంట్లోకి అవసరమైన చిన్న చిన్న స్టీల్ సామాను, పూజ సామగ్రీ దొరుకుతుండడంతో బెడదనిపించడంలేదు. ఎక్కువెక్కువ మోసుకెళ్లకుండా హాయిగా రెండు మూడు ట్రిప్పుల్లో తీసుకెళ్తా’ వివరించారు మోతీనగర్కి చెందిన చల్లపల్లి పార్వతి. మంచి డిమాండ్.. మోతీనగర్ వాడసంతలో పూలమ్మె సాలమ్మ ‘పెద్దపెద్ద మార్కెట్లలో మాకు జాగుండదు. మారుబేరానికి కావల్సిన పెట్టుబడీ మా దగ్గర లేదు. కాబట్టి ఇలాంటి అంగట్ల మాకు మంచి డిమాండ్’ అని స్పందించింది. ఫోర్ టు టెన్.. వరకుసాగే ఈ అంగళ్లల్లో వీథి లైట్లు సరిగ్గా లేక మసక చీకటి అటు వ్యాపారస్తులను ఇటు కొనుగోలు దారులను ఇబ్బంది పెట్టేది మొన్నటిదాకా. ‘నెస్సెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అన్నట్టుగా.. ఈ ఇబ్బందిని తొలగించడానికి బ్యాటరీ లైట్స్‌ను అద్దెకిచ్చే వ్యాపారమూ జోరందుకుంది అన్నిచోట్లా. మార్కెట్ మొదలవగానే ఈ లైట్లను ఇచ్చి మార్కెట్ ముగియగానే తీసుకెళ్తారు. ఆరుగంటలకు పది రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు. తాజా కూరలు.. సరసమైన ధరలు.. గుమ్మం ముందే దుకాణం.. ఎగువ, దిగువ, మధ్యతరగతివాళ్లకు ఇంతకన్నా అనుకూలం ఇంకేముంటుంది! అయితే బంజారాహిల్స్ లాంటి పోష్ లొకాటీల్లోనే ముందు ఈ సంతలు దర్శనమివ్వడం కొసమెరుపు! -
సూపర్... షాపింగ్!
జాగ్రత్త సూపర్మార్కెట్లో షాపింగ్ చేయడంలో ఒక సౌకర్యం ఉంటుంది. దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువుల్లో చాలా భాగం ఒకే ప్రదేశంలో దొరుకుతాయి. జాబితా రాసుకోకుండా షాపులో అడుగుపెట్టినా సరే... పోపుల డబ్బాలో ఆవాలు అడుగుకు చేరాయని, ఉప్పు పాకెట్ని ఆసాంతం డబ్బాలో పోసి ప్యాకెట్‌ను పారేశామనీ గుర్తుకు వస్తాయి. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ, సూపర్‌మార్కెట్ మాయాజాలంలో చెప్పలేనన్ని చమత్కారాలుంటాయి. వాటి మాయలో పడితే పర్సుకు చిల్లుపడడంతోపాటు ఇంటినిండా అవసరంలేని వస్తువులు పెరిగిపోతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు... సాధారణంగా తాజా ఉత్పత్తులను లోపలగా పెట్టి పాత సరుకును చేతికందేలాగ పెట్టడం వ్యాపార లక్షణం. కాబట్టి అరల్లో ముందుగా కనిపిస్తున్నవి కాక లోపలగా అమర్చిన వాటిని తీసుకోవాలి. ఒకటి కొంటే మరొకటి ఉచితం... ఆఫర్లో తీసుకున్నప్పటికీ ఎక్స్పైరీ డేట్ లోపు వాటిని ఉపయోగించగలమా లేదా అని చూసుకోవాలి. జామూన్ మిక్స్, కర్జూరాలకు ఈ ఆఫర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏదో ఒకటి రెండు ఉత్పత్తులకు తక్కువ ధర పెట్టి వాటి మీద దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేయడం వ్యాపార సూత్రం. ఆ రెండింటి ఆధారంగా ఆ దుకాణంలో ధరలు తక్కువ అనే అనుకోకూడదు. సూపర్మార్కెట్లో ట్రాలీకి బదులు బాస్కెట్ వాడితే బాస్కెట్ బరువు పెరిగేకొద్దీ అవసరం లేని చోట నిలపకుండా కొనుగోలు ముగించేస్తారు. ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్ చేస్తే మనకు తెలియకుండానే బాస్కెట్లో ఇంటికి అవసరమైన పప్పుదినుసులు, సబ్బులు, షాంపూలకంటే బిస్కట్లు, చాక్లెట్లు, చిప్స్, జ్యూస్, తినుబండారాలే కనిపిస్తాయి. కంటికి కనిపించే ఎత్తులో ఎక్కువ లాభం వచ్చే ఉత్పత్తులను పెట్టి, తక్కువ లాభం వచ్చే వాటిని పై అరల్లో, కింది అరల్లో సర్దుతారు. తల పెకైత్తి, కిందకు దించి కూడా చూసుకోవాల్సిందే. రాత్రి ఆలస్యంగా షాపింగ్ చేస్తే దుకాణంలో రద్దీ ఉండదు. ఆఖరి గంటలో కూరగాయలు, పాలు, బ్రెడ్ వంటి (మరుసటి రోజుకు తాజాదనం కోల్పోయేవి) వాటి ధరలు తగ్గించవచ్చు. -
కేరళలో ‘మయసభ’!
గాల్లోంచి వస్తువులను సృష్టించడం.. కళ్ల ముందే దేనినైనా మాయం చేయడం.. మనిషి తల, శరీరాన్ని ముక్కలుగా చేసి తిరిగి అతికించడం.. ఇదంతా ఇంద్రజాలం (మ్యాజిక్) మహిమ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో, ఎంతో మంది ఇంద్రజాలికులు ప్రదర్శించే ట్రిక్కులన్నింటినీ ఒకే చోట చూడగలిగితే.. బాగుంటుంది కదూ! ఈ అవకాశం మన దేశంలోనే తొలిసారిగా కేరళ రాజధాని తిరువనంతపురంలో అందుబాటులోకి రానుంది. ‘మ్యాజిక్ ప్లానెట్’ పేరిట అకాడమీ ఆఫ్ మ్యాజికల్ సెన్సైస్ దీనిని ఏర్పాటు చేయనుంది. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ‘మ్యాజిక్ ప్లానెట్’ను ప్రపంచ ఇంద్రజాల దినోత్సవమైన అక్టోబర్ 31న ప్రారంభిస్తారు. దీని మస్కట్ ‘హారీ’ని, యానిమేటెడ్ సినిమాను 10న విడుదల చేయనున్నామని మ్యాజిక్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గోపీనాథ్ ముతుకాడ్ వెల్లడించారు. ‘మ్యాజిక్ ప్లానెట్’లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి నుంచి ఇంద్రజాలానికి చెందిన అంశాలతో కూడిన మ్యూజియం, వర్చువల్ సూపర్‌మార్కెట్, షేక్స్పియర్ ‘ది టెంపెస్ట్’ ఆధారంగా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఉంటాయన్నారు. -
ఉల్లి ఉచితం!!
సాక్షి, ముంబై: ఉల్లి.. వంటింట్లో ఉండే సరుకు కాదిప్పుడు... వినియోగదారులను ఆకట్టుకునే అయస్కాంతం..! డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు ‘ఉల్లి పథకం’ను ప్రవేశపెడుతున్నారు. దాదర్‌లోని కొన్ని డిపార్ట్మెంటల్ స్టోర్లు వెయ్యి రూపాయలకుపైగా కొనుగోలు చేస్తే కిలో ఉల్లి ఉచితమంటూ ఫ్లెక్సీలు, బోర్డులు పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయల దరిదాపునకు చేరుకుంది. దీంతో వినియోగదారులు కూడా దుస్తులు, ఎలక్ట్రిక్, గృహావసరాల కోసం ఎవైనా వస్తువులు కొనాలన్నా ముందుగా ‘ఉల్లి బోర్డు’ ఎక్కడుందో చూస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఉల్లి బోర్డు ఉందంటే పరోక్షంగా పదిశాతం డిస్కౌంటు లభించినట్లే. నెలకు సరిపడా కిరాణా సామగ్రిని కొనాలన్నా ఎంతలేదన్నా కనీసం రెండువేలకు పైగానే అవుతుంది. అలాంటప్పుడు రెండు కేజీల ఉల్లి ఉచితం గా ఇచ్చినా రూ.200 మేర కలిసొచ్చే అవకాశముంది. దీంతో ప్రజలు కూడా ఈ ఆఫర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. జేబులు నింపుకుంటున్న చిల్లర వ్యాపారులు... ఉల్లిపాయలు అమ్మే ఓ చిల్లర వ్యాపారి రోజుకు వంద కిలోల ఉల్లి అమ్మితే ఎంత లాభపడేవాడో ఇప్పుడు 30 కేజీల ఉల్లి అమ్మినా అంతే లాభపడుతున్నాడు. వాషిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో కిలో ఉల్లి ధర రూ. 40-50 మధ్య ఉండగా చిల్లర వ్యాపారులు కిలోకు రూ.20-30 పెంచి రూ.70-80లకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉల్లి ధర ఒకలా, దూరమున్న ప్రాంతాల్లో ఉల్లి ధర మరోలా ఉంటుంది. నిజానికి ఈ తేడా ఎప్పుడూ ఉండేదే అయినా ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు చిల్లర వ్యాపారులు భారీ వ్యత్యాసంతో ఉల్లిని విక్రయిస్తున్నారు. క్యాబేజీ ముక్కలే దిక్కు... బార్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఉల్లితో తయారయ్యే వంటకాలను లిస్టులోనుంచి తొలగిస్తున్నా యి. రెస్టారెంట్లలో ప్రత్యేకంగా ఉల్లి ముక్కలను వడ్డించే పరిస్థితి లేదు. ఒకవేళ కావాలని ఎవరైనా డిమాండ్ చేస్తే క్యాబేజీ ముక్కలను కలిపి వడ్డిస్తున్నారు. కొందరైతే నేరుగానే లేదని చెప్పేస్తుండగా మరికొందరు ‘ప్రత్యేకంగా ఉల్లి వడ్డించబడదు’ అని మెనూలో గమనికలు పెడుతున్నాయి. ఇక టిఫిన్ సెంటర్లలో ఉల్లి పకోడి, ఉతప్పా, ఉల్లి దోసె మాయమైంది. అమ్మో... ఎంత మాయో? నిజానికి రాష్ట్రంలో ఉల్లి ఇంతగా ధరలు పెరగాల్సినంత కొరత లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొందరు కావాలనే ఉల్లికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉల్లి ధరలను తగ్గించేందుకు నానా అవస్థలు పడుతున్న ప్రభుత్వం మరి ఇలా కృత్రిమంగా కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకోవచ్చు కదా? అనే అనుమానం కలగడం సహజమే. అయితే కృత్రిమంగా కొరత సృష్టించేవారు ఇప్పడు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఈ విషయమై ఎన్హెచ్ఆర్డీఎఫ్సీ డెరైక్టర్ ఆర్.పి.గుప్తా మాట్లాడుతూ...‘మార్చి నుంచి మే వరకు పుణే, నగర్, షోలాపూర్, నాసిక్ తదితర జిల్లాల్లోని రైతుల నుంచి వ్యాపారులు నేరుగానే కోట్ల రూపాయల విలువ చేసే ఉల్లిని కొనుగోలు చేస్తారు. అయితే వాటిని గోదాముల్లోకి తరలించకుండా రైతుల వద్దే ఉంచుతారు. అందుకు రైతులకు కొంతమొత్తం అద్దె కూడా చెల్లిస్తారు. ఇలా మార్కెట్లోకి సరుకు రాకుండా చేసి కృత్రిమంగా కొరత సృష్టిస్తారు. సరుకు రైతుల వద్దే ఉండడంతో వ్యాపారులపై చర్య తీసుకునేందుకు మార్కెట్శాఖకు వీలుపడదు. సరుకు ధర ఆకాశన్నంటుతున్న తరుణంలో రైతుల వద్ద నిల్వ ఉంచిన ఉల్లిని భారీ ధరకు మార్కెట్‌కు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు ఎప్పుడు వచ్చే లాభం కంటే దాదాపు పదింత లాభం ఎక్కువగా వస్తుంద’న్నారు. త్వరలో చైనా ఉల్లి పెరిగిన ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేం దుకు చైనా నుంచి భారీగా ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి చైనా నుంచి భారత్‌కు రవాణా అయ్యేందుకు సిద్ధంగా ఉందని మార్కెట్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25 వరకు అవి ముంబైకి చేరుకునే అవకాశముందన్నారు. వీటి ధర టన్నుకు 400 డాల ర్లు(అంటే రూ.27,639) ఉండవచ్చని అంచనవేశారు. అంటే కిలో ఉల్లి ధర దాదాపు రూ.28 ఉంటుంది. చైనా సరుకు మార్కెట్లోకి వస్తే ఉల్లి ధర బాగా తగ్గుతుందని చెబుతున్నారు.