ఆదిలాబాద్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో చోరీ చేస్తూ ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు.
ఆదిలాబాద్:
ఆదిలాబాద్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో చోరీ చేస్తూ ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. రైతు బజారుకు ఎదురుగా ఉన్న సాగర్ సూపర్ మార్కెట్లోకి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు దర్జాగా ప్రవేశించారు. ఎవరికీ అనుమానం రాకుండా షాపులో చేతికందిన వస్తువునల్లా బురఖాలో వేసుకున్నారు.
వచ్చిన పని ముగించుకుని తిరిగి వెళ్లే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన సూపర్ మార్కెట్ యాజమాన్యం మహిళా ఉద్యోగులతో కిలేడీలను తనిఖీ చేయిస్తే అసలు విషయం బయటపడింది. ఒక్కో మహిళ రూ.10వేల వరకు విలువ చేసే సామానులను దొంగతనం చేసే యత్నం చేసినట్లు తెలిసి యాజమాన్యం ముక్కున వేలేసుకుంది.