ఈ దొంగలు రంగంలోకి దిగారో.. సినిమానే ఇక | Thieves Crash Car Into Glass Door | Sakshi
Sakshi News home page

ఈ దొంగలు రంగంలోకి దిగారో.. సినిమానే ఇక

Published Fri, Feb 2 2018 11:23 AM | Last Updated on Fri, Feb 2 2018 3:29 PM

Thieves Crash Car Into Glass Door - Sakshi

దర్జాగా దోచుకుంటున్న దొంగలు

ఇంగ్లాండ్‌ : సాధారణంగా సినిమాల్లో మాత్రమే ఇలాంటి సీన్‌ సాధ్యం అవుతుంది. అది కూడా ఎన్నో టేక్‌లు తీసుకుంటేనో అది కుదురుతుంది. ఇంతకు ఏమిటా సీన్‌ అనుకుంటున్నారా..! అదో దొంగతనం సీన్‌. అయితే సినిమా షూటింగ్‌ ద్వారా తీసింది కాదు.. వాస్తవంగా జరిగిన సీన్‌.. చక్కగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అదొక సూపర్‌ మార్కెట్‌.. దానికి అద్దాలతో ఏర్పాటుచేసిన ప్రవేశం ఉంది. ప్రత్యేకంగా గోడలంటూ ఏమీ లేవు. అందులోనే ఓ ఏటీఎం మెషిన్‌ కూడా ఉంది. దానిపై దొంగల కన్నుపడింది. ఎలాగైనా దానిని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

తమ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఏకంగా డిఫెండబుల్‌ ల్యాండ్‌ రోవర్‌ కారును తీసుకున్నారు. అది కూడా ఎత్తుకొచ్చిన కారే. నేరుగా రివర్స్‌ చేసి సూపర్‌ మార్కెట్‌లోకి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రవేశ మార్గం మొత్తం ధ్వంసం అయింది. వెంటనే అందులో నుంచి కొందరు దికి ఏటీఎం మెషిన్‌ డ్రిల్లింగ్‌ చేయడం మొదలుపెట్టారు. పూర్తయ్యాక దానికి ఒక తాడు కట్టి ల్యాండ్‌ రోవర్‌తో బయటకు ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత తాడు విప్పేసి అందరు కలిసి ఆ మెషిన్‌ను కారు వెనుకాలే వేసుకొని జంప్‌ అయ్యారు. అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. దీనిని తాజాగా పోలీసులు విడుదల చేయగా అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement