ప్రతీకాత్మకచిత్రం
మధురై : సూపర్ మార్కెట్‌లో 65,000 రూపాయల విలువైన వస్తువులతో పాటు 5000 రూపాయల నగదు దోచుకున్న దొంగ.. షాపు యజమానికి క్షమాపణ చెబుతూ లేఖ రాసి వెళ్లిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. నగరంలోని ఉసిలంపట్టి ప్రాంతంలోని ఓ సూపర్‌మర్కెట్‌లో చోరీ చేసిన దొంగ తాను ఎందుకు నేరానికి పాల్పడవలసి వచ్చిందో కూడా ఆ లేఖలో ప్రస్తావించాడు. ‘చోరీకి పాల్పడినందుకు మన్నించాలి..నేను ఆకలితో ఉన్నాను..మీకు ఈ మొత్తం ఒకరోజు రాబడి అయితే..నాకు మూడు నెలల ఆదాయంతో సమానం. ఈ పని చేసినందుకు మరోసారి క్షమాపణలు’ అంటూ లేఖలో దొంగ రాసుకొచ్చాడు. చదవండి : మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపు : యువకుడి అరెస్ట్
ఉసిలంపట్టి-మధురై రోడ్డులో ఉన్న ఈ సూపర్‌మార్కెట్ యజమాని రాంప్రకాష్ (30). తాను ఈనెల 8న ఉదయం షాపు తెరిచిచూడగానే తన రెండు కంప్యూటర్లు, టీవీ సెట్, 5000 రూపాయల నగదు కనిపించలేదని రాంప్రకాష్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా దొంగ దోచుకెళ్లాడని వెల్లడైంది. ఉసిలంపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment