appology
-
‘మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారు’.. రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు అధికార బీజేపీ పార్టీ సభ్యులు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు అందుకు నిరాకరించడంతో కొంతసేపు సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ను బీజేపీ నేతలు ‘భారత్ తోడో యాత్ర’గా పేర్కొనటంపై సోమవారం మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. దేశం కోసం కాంగ్రెస్ స్సాతంత్య్రాన్ని తీసుకొచ్చిందని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ‘కనీసం మీ ఇంట్లోని శునకం అయినా దేశం కోసం చనిపోయిందా? అయినప్పటికీ వారు దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. మేమేమైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. మంగళవారం పార్లమెంట్ మొదలవగానే.. ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు అధికార పార్టీ సభ్యులు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. అటు లోక్‌సభలోనూ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మనం చిన్నపిల్లలమా? రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్. వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్ వెలుపల చేసినట్లు గుర్తు చేశారు. ‘దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు మనల్ని చూసి నవ్వుతున్నారు. సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చెడ్డపేరు తెస్తుంది. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతారు. కనీసం సభాపతి సూచనలను కూట పట్టించుకోవట్లేదు. ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నారు. మన్నం చిన్నపిల్లలమా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్. ఇదీ చదవండి: రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి -
ఢిల్లీ కాంగ్రెస్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పెద్ద పొరపాటు చేశానంటూ..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీకి షాక్ ఇస్తూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహది, పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనితీరు నచ్చడం వల్లే వాళ్లు తాము ఆప్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని అలీ మెహది చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతామన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొన్నారు. పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అలీ మెహది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. తాను పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు చెబుతూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను రాహుల్ గాంధీ నమ్మకస్తుడినైన కార్మికుడిగా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ముస్తఫాబాద్, బ్రిజ్‌పురి కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్‌లు సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. అర్ధరాత్రి 1.25 గంటలకు వీడియో పోస్ట్ చేశారు అలీ మెహది.. చేతులు జోడించి ‘నేను పెద్ద పొరపాటు చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాను. నా తండ్రి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. పలుమార్లు పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. తనతో వచ్చిన కౌన్సిలర్లు సైతం క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేయాలని కోరారు. వీడియో విడుదల చేసిన గంటన్నర తర్వాత మరో ట్వీట్ చేశారు అలీ మెహది. ‘బ్రిజ్‌పురి కౌన్సిలర్ నాజియా ఖాటూన్, ముస్తఫాబాద్ కౌన్సిలర్ సబిలా బేగం, 300 ఓట్ల మార్క్‌తో ఓడిపోయిన బ్లాక్ ప్రెసిడెంట్ అలీమ్ అన్సారీ ఇప్పటికీ రాహుల్ జీ, ప్రియాంక జీలకు నమ్మకమైన కార్మికులు. రాహుల్ గాంధీ జిందాబాద్.’ అని పేర్కొన్నారు. వీడియోలో కనిపించిన మరో ముగ్గురు సైతం ఆప్‌ను కలిశారు. श्री @RahulGandhi जी के जो सच्चे सिपाही होते हैं उन्हें कुछ समय के लिए दिग्भ्रमित किया जा सकता है लम्बे समय के लिए नहीं। शुक्रिया भाई @alimehdi_inc जी का जिन्होंने कुछ पल में ही गलती सुधार ली। आप कांग्रेस के जन्मजात सच्चे सिपाही हो, गलती इंसान से हो जाती है। @INCDelhi pic.twitter.com/UaqMUQGjMZ — Minnat Rahmani (@MRahmaniINC) December 10, 2022 ఇదీ చదవండి: Manneguda Young Woman Kidnap Case: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
దొంగకు చుక్కలు చూపించిన దేవుడు!.. సొత్తు తిరిగిచ్చి క్షమాపణ
భోపాల్: దేవుడి సొత్తును కాజేస్తే రక్తం కక్కుకుని చనిపోవటం, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారని చాలా సినిమాల్లో చూపించారు. కానీ, నిజ జీవితంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆభరణాలను దోచుకుంటున్నారు దొంగలు. అయితే, ఓ దొంగ ఆలయంలో చోరీ చేసిన సొత్తును తిరిగిచ్చేశాడు. దాంతో పాటు తాను తప్పు చేశానని, ఈ దొంగతనం వల్ల తాను చాల ఇబ్బందులు పడ్డానని, తనను క్షమించాలంటూ ఓ లేఖ సైతం రాయటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో జరిగింది. బాలాఘాట్లోని శాంతినాథ్ దిగంబర జైన దేవాలయంలో గుర్తు తెలియని దొంగ అక్టోబర్ 24న చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, దొంగ.. మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద ఉంచాడు. శుక్రవారం నీళ్ల కోసం వెళ్లినవారు సంచిని పరిశీలించగా.. అపహరణకు గురైన వస్తువులు, లేఖ కనిపించాయి. ప్రస్తుతం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘నేను చేసిన పనికి క్షమాపణ కోరుతున్నా. నేను తప్పు చేశా.. క్షమించండి. దొంగతనం చేశాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.’ అని లేఖలో పేర్కొన్నాడు దొంగ. పంచాయతీ వద్ద వదిలివెళ్లిన వస్తువులను స్వాధీనం చేసుకుని దొంగ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్‌తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం! -
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: హత్యలు చేసే కడప వాళ్లకు ఎయిర్‌పోర్టా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు. 'రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన' అని సోమువీర్రాజు అన్నారు. చదవండి: (పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్) ఇదిలా ఉండగా, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు నిర్మించాలన్న ప్రణాళికలో ఉన్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలకు ఎయిర్‌పోర్టులు ఎందుకంటూ వ్యాఖ్యానించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎందుకు? కర్నూలులో ఎయిర్‌పోర్టు.. బస్సులు వెళ్లడానికి దారిలేనటువంటి కర్నూలులో ఎయిర్‌పోర్టు.. రాయలసీమకు ఎయిర్పోర్టులంట.. కడపలో ఎయిర్‌పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు. మేం ఎయిర్‌పోర్టు వేస్తాం. ఏం వేస్తారండి ఎయిర్‌పోర్టు.. మీరు రోడ్లు వెయ్యండి..’ అంటూ రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వీర్రాజు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు మండిపడుతుండడంతో తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గారు. -
‘బహిరంగ క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని సీఎం కలవరు’
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. కాంగ్రెస్ అధిష్టానం నవజోత్ సింగ్ సిద్ధూకి పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సిద్ధూ తనకు క్షమాపణలు చెప్పే వరకు తనను కలిసేది లేదని ఇంతకుముందే అమరీందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థుక్రాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘నవజోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు అనే వార్తలు అవాస్తవం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు లేదు. నవజోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు అమరీందర్ సింగ్ సిద్ధూని కలవరు.. అతడికి సమయం ఇవ్వరు’’ అని స్పష్టం చేశారు. మరోవసై పంజాబ్ మినిస్టర్ బ్రహ్మ్ మోహింద్రా కూడా సిద్ధూని కలవడానికి ఇష్టపడలేదు. ఈ మేరకు ఆయన ‘‘సిద్ధూని పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను. కానీ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసి.. వారిద్దరి మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకునే వారికి నేను సిద్ధూని కలను’’ అని ప్రకటించారు. -
తప్పు ఒప్పుకున్న ట్విట్టర్
న్యూఢిల్లీ: చైనా భూభాగంలో లద్దాఖ్‌ను చూపడం తమ తప్పేనని సామాజిక మాధ్యమం ట్విట్టర్ అంగీకరించింది. తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ రాతపూర్వకంగా పార్లమెంటరీ కమిటీకి క్షమాపణలు తెలిపినట్లు, ఈనెలాఖరుకు ఆ తప్పుని సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ మీనాక్షి లేఖి తెలిపారు. భారత పటాన్ని జియో ట్యాగింగ్‌లో తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ సంతకంతో కూడిన అఫిడవిట్ పార్లమెంటు కమిటీకి సమర్పించారు. డేటా ప్రొటెక్షన్ బిల్లుపై గత నెలలో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ విషయంలో ట్విట్టర్‌పై ఆగ్రహం వెలిబుచి్చంది. ట్విట్టర్ దేశద్రోహానికి పాల్పడిందని, అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌కు నోటీసులు జారీచేశారు. దీంతో కమిటీ ముందు హాజరైన ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు క్షమాపణ కోరారు. అయితే ఇది క్రిమినల్ నేరమని, దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని, ట్విటర్ ఇంటర్నేషనల్ కార్యాలయం అఫిడవిట్ సమర్పించాలని కమిటీ పేర్కొంది. భారత ప్రజల విశ్వాసాలను గాయపర్చినందుకు వారు క్షమాపణ కోరారని, నవంబర్ 30 లోపు ఆ తప్పును సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్టు మీనాక్షి తెలిపారు. -
భారత్‌ను క్షమాపణలు కోరిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ తాను చేసిన తప్పిదానికి భారత్‌ను లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరింది. బుధవారం బీజేపీ ఎంపీ మినాక్షి లేఖీ నేతృత్వంలోని జేపీసీ ముందు ట్విటర్ ప్రతినిధులు హాజరైన క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా మీనాక్షి లేఖీ మీడియాతో మాట్లాడుతూ.. లడఖ్‌ను చైనా భూభాగంలో చూపించినందుకు ట్విటర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరిందని చెప్పారు. భారత పటాన్ని తప్పుగా జియో ట్యాగింగ్ చేయడంపై ట్విటర్ ఇండియా మాతృసంస్థ అమెరికా ఐఎన్‌సీ చీఫ్ ప్రైవసి ఆఫిసర్ డమైన్ కరియన్ అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చారని తెలిపారు. లడఖ్‌ను చైనా భూభాగంలో చూపించి భారతీయుల మనోభవాలను దెబ్బతీసినందుకు తమ తప్పును ఈ నెల 30వ తేదీ నాటికి సవరించుకుంటామని హామీ ఇచ్చినట్లు మీనాక్షి లేఖీ వెల్లడించారు. (చదవండి: ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం) కాగా ఇటీవల ట్విటర్ చైనాకు సంబంధించిన ఓ పోస్టు చేస్తూ లడఖ్‌ను చైనా భుభాగంలో చూపించింది. దీంతో ట్విటర్ తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నించేలా వ్యవహరించిందని పేర్కొంది. అంతేగాక దీనిని దేశ ద్రోహంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ట్విటర్ తప్పిదానికి గల కారణాలేంటో ట్విటర్ మాతృసంస్థ అమెరికా ఐఎన్‌సీ లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని సంస్థ యాజామన్యాన్ని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ట్విటర్ దిగోచ్చి క్షమాపణలు చెప్పింది. (చదవండి: ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’) -
పార్లమెంటరీ కమిటీ ఎదుట ట్విటర్ క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : లేహ్, జమ్ము కశ్మీర్‌లను చైనాలో భాగంగా ప్రత్యక్ష ప్రసారంలో లొకేషన్ ట్యాగ్‌లో చూపడం పట్ల ట్విటర్ ఇండియా గురువారం వ్యక్తిగత సమాచార పరిరక్షణపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట క్షమాపణలు కోరింది. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ కమిటీ సోషల్ మీడియా దిగ్గజం లిఖితపూర్వక క్షమాపణ చెప్పడంతో పాటు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. భారత భూభాగాన్ని చైనాలో భాగంగా చూపుతూ ట్విటర్ భారత సార్వభౌమాధికారం పట్ల అగౌరవం కనబరిచిందని సంయుక్త పార్లమెంటరీ కమిటీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ పొరపాటును తక్షణమే సరిదిద్దామని ట్విటర్ వివరణ ఇచ్చింది. గత వారం వెలుగులోకి వచ్చిన ఈ తప్పిదాన్ని కంపెనీ సత్వరమే పరిష్కరించిందని పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ట్విటర్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. ట్విటర్ వివరణ సరిపోదని పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా పేర్కొందని కమిటీ చీఫ్, పాలక బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్కొన్నారు. లడఖ్‌ను చైనా భూభాగంగా చూపడం నేరపూరిత చర్యతో సమానమని ఆమె స్పష్టం చేశారు. దేశ మ్యాప్‌లో ఇలాంటి తప్పులను ప్రభుత్వం ఏమాత్రం సహించదని ట్విటర్ సీఈఓ జాక్ డార్సీకి రాసిన లేఖలో ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీ పేర్కొన్నారు. చదవండి : షారూక్‌లా అవ్వాలంటే ఏం తినాలి? -
యాడ్ దుమారం : తనిష్క్ స్టోర్‌కు బెదిరింపులు
అహ్మదాబాద్ : ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ తనిష్క్ వివాదాస్పద యాడ్ కలకలం రేపుతోంది. ఈ యాడ్ లవ్ జిహాదీని ప్రోత్సహిస్తోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో యాజమాన్యం దిగివచ్చి యూట్యూబ్ నుంచి ఈ యాడ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వివాదస్పద యాడ్‌పై గుజరాత్‌లోని కచ్ జిల్లాలో తనిష్క్ స్టోర్‌కు బెదిరింపులు వచ్చాయి. ఈ ప్రకటన సరైంది కాదని తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఈ స్టోర్‌కు కొందరు బెదిరింపు కాల్స్ చేశారని పోలీసులు తెలిపారు. స్టోర్ వద్ద ఎలాంటి ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకోలేదని ఈ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి తనిష్క్ గాంధీధామ్ స్టోర్ వద్దకు నిరసనకారులు రాగా, స్టోర్ యాజమాన్యం క్షమాపణలు చెబుతూ నోట్ రాసినట్టు సమాచారం. ఈ యాడ్ సిగ్గుచేటని, దీనికి తమను మన్నించాలంటూ స్టోర్ మేనేజర్ రాసిన క్షమాపణ నోట్‌ను ఆందోళనకారులు స్టోర్‌పై అతికించారు. గత వారం తనిష్క్ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. కాగా, ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు #BoycottTanishq ట్రెండ్ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తనిష్క్ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుందంటూ ట్రోల్ చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు కోరి యాడ్‌ను డిలీట్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. చదవండి : అందుకే ఆ యాడ్ తొలగించాం: తనిష్క్ -
షాపుకు కన్నమేసి యజమానికి క్షమాపణలు
మధురై : సూపర్ మార్కెట్లో 65,000 రూపాయల విలువైన వస్తువులతో పాటు 5000 రూపాయల నగదు దోచుకున్న దొంగ.. షాపు యజమానికి క్షమాపణ చెబుతూ లేఖ రాసి వెళ్లిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. నగరంలోని ఉసిలంపట్టి ప్రాంతంలోని ఓ సూపర్‌మర్కెట్‌లో చోరీ చేసిన దొంగ తాను ఎందుకు నేరానికి పాల్పడవలసి వచ్చిందో కూడా ఆ లేఖలో ప్రస్తావించాడు. ‘చోరీకి పాల్పడినందుకు మన్నించాలి..నేను ఆకలితో ఉన్నాను..మీకు ఈ మొత్తం ఒకరోజు రాబడి అయితే..నాకు మూడు నెలల ఆదాయంతో సమానం. ఈ పని చేసినందుకు మరోసారి క్షమాపణలు’ అంటూ లేఖలో దొంగ రాసుకొచ్చాడు. చదవండి : మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపు : యువకుడి అరెస్ట్ ఉసిలంపట్టి-మధురై రోడ్డులో ఉన్న ఈ సూపర్‌మార్కెట్ యజమాని రాంప్రకాష్ (30). తాను ఈనెల 8న ఉదయం షాపు తెరిచిచూడగానే తన రెండు కంప్యూటర్లు, టీవీ సెట్, 5000 రూపాయల నగదు కనిపించలేదని రాంప్రకాష్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా దొంగ దోచుకెళ్లాడని వెల్లడైంది. ఉసిలంపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజ్యసభ రగడ : క్షమాపణ కోరితే సస్పెన్షన్‌పై పునరాలోచన
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు రాజ్యసభ నుంచి మంగళవారం వాకౌట్ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తొలుత సభ నుంచి వాకౌట్ చేయడా ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభలో తమ ప్రవర్తనపై సస్పెన్షన్‌కు గురైన సభ్యులు క్షమాపణ కోరితే ప్రభుత్వం వారిపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యసభలో విపక్షాల అనుచిత ప్రవర్తనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తాము భావించామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన ట్వీట్‌కు అనుగుణంగా ఎంపీలు ఇలా ప్రవర్తించడం ఏ తరహా రాజకీయమని ఆయన రాహుల్ ట్వీట్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం రాహుల్ ఆమె వెంట విదేశీ పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే. రాజ్యసభ టేబుల్‌పైకి ఎక్కి నృత్యం చేస్తూ కాగితాలను చించివేసిన కాంగ్రెస్ ఎంపీని తాము ఇంతవరకూ చూడలేదని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. కాగా, వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చదవండి : ఎంపీల నిరసన : పోలీసుల ఓవర్ యాక్షన్ -
యోగి వ్యాఖ్యలపై దుమారం
లక్నో : అయోధ్యలో నిర్మించే మసీదు ప్రారంభానికి ఆహ్వానిస్తే తాను హాజరు కాబోనని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యోగి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ శుక్రవారం డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు యోగి ఆదిత్యానాథ్ తాను చేసిన ప్రమాణానికి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించారని ఎస్పీ ప్రతినిధి పవన్ పాండే విమర్శించారు. రాష్ట్రమంతటికీ ఆయన ముఖ్యమంత్రని, హిందువులకు మాత్రమే కాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న హిందూ, ముస్లింలందరికీ ఆయనే ముఖ్యమంత్రని..ఆయన అలా మాట్లాడటం గౌరవం అనిపించుకోదని పాండే అన్నారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అనంతరం యోగి ఆదిత్యానాధ్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఓ యోగి, హిందువుగా తాను మసీదు ప్రారంభానికి వెళ్లనని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రిగా మీరు నన్ను అడిగితే ఏ విశ్వాసం, మతం, కులంతో నాకు ఎలాంటి సంబంధం లేదు..ఒక యోగిగా మీరు నన్ను అడిగితే హిందువుగా మసీదు ప్రారంభానికి వెళ్లబోను..హిందువుగా నా ప్రార్ధనా పద్ధతులను అనుసరించడం నా కర్తవ్యం..అందుకు అనుగుణంగా నడుచుకుంటా’నని యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తాను వాదిని కాదు..ప్రతివాదినీ కాదని అంటూ తనను పిలిచినా పిలవకపోయినా తాను హాజరుకానని..అసులు తనకు అలాంటి ఆహ్వానం అందబోదని ఆయన వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలపై ఎస్పీ మండిపడింది. ఆయన తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. చదవండి : మసీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా? -
వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన విప్లవ్ దేవ్
అగర్తలా : పంజాబీలు, జాట్లపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ వెనక్కితగ్గారు. పంజాబీలు, జాట్లు శారీరకంగా దృఢంగా ఉంటారని, అయితే బెంగాలీలకున్న తెలివితేటలు వారికి ఉండవని విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పంజాబీలు, జాట్లపై కొందరికున్న అభిప్రాయాలను మాత్రమే తాను తేటతెల్లం చేశానని, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని మంగళవారం ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పంజాబీలు, జాట్లను చూసి తాను గర్విస్తానని, వారితో కలిసి తన జీవిత పయనం సాగిందని చెప్పుకొచ్చారు. ‘ ఈ రెండు వర్గాల్లో నాకు పలువురు స్నేహితులున్నారు..నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించాలని వేడుకుంటున్నా..దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబీ, జాట్ సోదరుల పాత్రను నేను ఎప్పటికీ గౌరవిస్తుంటా..ఆధునిక భారత నిర్మాణంలో వీరి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం తాను ఎన్నడూ ఊహించబోన’ని విప్లవ్ దేవ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, అగర్తలా ప్రెస్ క్లబ్లో ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. దేశంలో ప్రతి వర్గానికీ ఓ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెబుతూ బెంగాలీలు తెలివితేటలకు పెట్టింది పేరని..పంజాబీలు, జాట్లు శారీరకంగా బలంగా ఉన్నా తెలివితేటల్లో బెంగాలీలకు సరిపోరని విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పంజాబీని సర్ధార్ అంటారని, వారికి తెలివితేటలు తక్కువగా ఉన్నా చాలా దృఢంగా ఉంటారని వారిని బలంలో ఎవరూ గెలవలేరని, ప్రేమతోనే వారిని జయించాలని అన్నారు. ఇక హరియాణాలో పెద్దసంఖ్యలో ఉండే జాట్లకు తెలివితేటలు తక్కువగా ఉన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జాట్తో ఎవరైనా పెట్టుకుంటే అతడు ఇంటి నుంచి తుపాకీతో బయటకు వస్తాడని అన్నారు. విప్లవ్ దేవ్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దేవ్ వ్యాఖ్యలు బీజేపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్ష నేతలు ఆరోపించారు. ఇక విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన ‘మహాభారతంలో ఇంటర్నెట్ ఉంది.. మే డే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు?.. విద్యావంతులైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆవులను పెంచుకోవాలి.. లేదంటే పాన్‌షాప్ పెట్టుకోవాలి’ వంటి సూచనలు చేసి విమర్శలపాలయ్యారు. చదవండి : బెంగాలీలతో సరితూగలేరు; ఇది సిగ్గుచేటు! -
పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో..
చెన్నై : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తాను చదివిన వార్తాంశాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన వివరణ ఇచ్చారు. పెరియార్‌పై రజనీకాంత్ వ్యాఖ్యలపై ఓ రాజకీయ పార్టీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ తమిళ మేగజైన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ 1971లో సేలంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలతో జరిగిన ర్యాలీలో పెరియార్ పాల్గొంటే ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని వ్యాఖ్యానించారు. తుగ్లక్ పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు చో రామస్వామి ఒక్కరే ఆ వార్తను రాసి దాన్ని ఖండించారని గుర్తు చేశారు. ఆ వార్త కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని కుదిపివేసిందని, ఆ మేగజైన్ కాపీలను ప్రభుత్వ అధికారులు సీజ్ చేయగా, చో రామస్వామి వాటిని పునర్ముద్రించగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని చెప్పుకొచ్చారు. పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలన్న డ్రవిడార్ విదుతులై కజగం (డీవీకే) డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. తాను క్షమాపణ చెప్పనని, వార్తాంశాల్లో వచ్చిన విషయాల ఆధారంగానే తాను మాట్లాడానని అన్నారు. మరోవైపు రజనీకాంత్ క్షమాపణ చెప్పకుంటే థియేటర్లలో ప్రదర్శిస్తున్న ఆయన సినిమా దర్బార్‌ను అడ్డుకుంటామని డీవీకే హెచ్చరించింది. చదవండి : తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం -
లోక్‌సభలో ఆజం ఖాన్ క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, లోక్‌సభ అధ్యక్ష స్ధానంలో కూర్చున్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ సోమవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. రమాదేవి తన సోదరి వంటిదని తాను గతంలోనే పలమార్లు చెప్పానని, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడాలనేది తన అభిమతం కాదని స్పష్టం చేశారు. తాను మాట్లాడే భాష, మేనరిజమ్స్ గురించి పార్లమెంట్లో అందరికీ తెలుసునని, తాను పొరపాటుగా వ్యాఖ్యానిస్తే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కాగా సోమవారం ఉదయం సభ ప్రారంభమయ్యే ముందు ఆజం ఖాన్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రమాదేవిపై చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. సభాధ్యక్ష స్ధానాన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆజం ఖాన్ క్షమాపణను బీజేపీ ఎంపీ రమాదేవి అంగీకరించలేదు. ఆజం ఖాన్ వైఖరి మహిళలను, దేశాన్ని బాధించిందని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతున్నారని, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడే తన పద్ధతి మార్చుకోవాలని రమాదేవి హెచ్చరించారు. -
గాడ్సే వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన ప్రజ్ఞా సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్న బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడు కాలేడని ఆమె వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. బీజేపీ సైతం ఆమె వ్యాఖ్యలతో పార్టీ ఏకీభవించదని, ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరడంతో సాధ్వి ప్రజ్ఞా సింగ్ వెనక్కితగ్గారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఆమె క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై ప్రజ్ఞాజీ క్షమాపణలు తెలిపారని ఆమె ప్రతినిధి, బీజేపీ నేత హితేష్ వాజ్‌పేయి ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. -
నాగేశ్వరరావుకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ప్రభుత్వ వసతి గృహాల్లో బాలికలపై లైంగిక దాడి ఘటనలపై విచారణ జరుపుతున్న అధికారిని బదిలీ చేయడం పట్ల అప్పటి సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేస్తూ ఆయనకు రూ లక్ష జరిమానా విధించింది. నాగేశ్వరరావుతో పాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని ఆయనకూ జరిమానా విధించింది. వీరు చేసినది పొరపాటు కాదని, ఉద్దేశపూర్వకమైన చర్యంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరావు సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను తాను కలలో కూడా ఉల్లంఘించనని పేర్కొన్నారు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేసే ముందు కోర్టు అనుమతి కోరకపోవడం తన తప్పిదమేనని సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు అంగీకరించారు. తన పొరపాటును తాను పూర్తిగా తెలుసుకున్నానని, బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటూ తానెన్నడూ కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అనుమతిలేకుండా తాను షెల్టర్ హోం కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలీ చేసి ఉండాల్సింది కాదని అఫిడవిట్లో ఆయన స్పష్టం చేశారు. కాగా షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయడంపై నాగేశ్వరరావు తీరును గత వారం సుప్రీం కోర్టు ఆక్షేపించింది. న్యాయస్ధానం ఉత్తర్వులతో మీరు చెలగాటమాడారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నాగేశ్వరరావు తీరును తప్పుపట్టారు. -
ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన శాంసంగ్
సియోల్ : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎట్టకేలకు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. తమ ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా కొంతమంది ఉద్యోగులు క్యాన్సర్ బారిన పడుతున్నారని అంగీకరించిన సంస్థ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. తద్వారా దశాబ్ద కాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. తమ ఎల్సీడీ, సెమీ కండక్టర్ కర్మాగారాల్లో కార్మికుల భద్రత కోసం సరియైన రక్షణచర్యలు తీసుకోలేకపోయామని శాంసంగ్ వెల్లడించింది. వ్యాధి బారిన పడిన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని శాంసంగ్ కో ప్రెసిడెంట్ కిమ్ కి నామ్ ప్రకటించారు. అలాగే ఒక్కో బాధితుడికి సుమారు 9లక్షల రూపాయలు (133వేల డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించారు. దీంతో గత పదేళ్లుగా పోరాటం సాగిస్తున్న ఉద్యమకారులు శాంతించారు. తాజాగా శాంసంగ్ క్షమాపణలు చెప్పడంపై ఉద్యమ కారుల్లో ఒకరు, బాధిత మహిళ ఒకరైన హ్వాంగ్ శాంగ్-జి సంతృప్తి వ్యక్తం చేశారు. తన 22 కుమారుడు 2007లో లుకేమియాతో కన్నుమూశాడని వెల్లడించారు. కంపెనీ క్షమాపణ కుటుంబాల బాధను ఏ మాత్రం తీర్చలేదని, నిజానికి సంస్థ ప్రకటించిన పరిహారం కుటుంబాలకు సరిపోదు కానీ, తాము అంగీకరిస్తున్నామన్నారు. ఎందుకంటే తమ బంధువుల మరణంతో , తాము అనుభవించిన వేదన ఎన్నటికీ తీరనిదనీ, చాలా కుటుంబాలది ఇదే పరిస్థితని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దక్షిణ సియోల్‌లోని సువాన్‌లో శాంసంగ్ నెలకొల్పిన సెమీకండక్టర్, ఎల్సీడీ ఫ్యాక్టరీ వివాదానికి దారితీసింది. అనేకమంది అతిప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడుతున్నామంటూ ఉద్యోగులు 2007లో పోరాటానికి దిగారు. దాదాపు 320 మంది ఉద్యోగులు క్యాన్సర్ బారినపడగా, 118 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఫ్యాక్టరీ మూలంగా 16 రకాల క్యాన్సర్లు వ్యాప్తి చెందాయి. అలాగే కొన్ని ఇతర అరుదైన తీవ్ర అనారోగ్యంతోపాటు, గర్భస్రావాలు, కార్మికుల పిల్లలు తీవ్రమైన కంటి రోగాల బారిన పడ్డారని ఉద్యమ కమిటీ వాదించింది. -
మీటూ వివాదంలో మరో నటుడు
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రముఖులు నానా పటేకర్, వికాస్ . మీటూ డిబేట్లో నానుతుండగా ఈ కోవలో నటుడు, చిత్రనిర్మాత రజత్ కపూర్(57) చేరారు. నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఆరోపణల నేపథ్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి మహిళల భయానక అనుభవాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. రజత్ కపూర్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారంటూ తాజాగా జర్నలిస్టు సంధ్యా మీనన్ తన అనుభవాన్ని ట్విటర్ వేదికపై పంచుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన రజత్ కపూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. జరిగినదాని పట్ల మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నానని ట్వీట్ చేశారు. మంచిపనుల ద్వారా జీవితమంతా మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించాను. అయినా నాచర్యల ద్వారా లేదా పదాల ద్వారా బాధపెట్టి వుంటే.. క్షమించండి. దయచేసి క్షమాపణను స్వీకరించమంటూ ట్వీట్ చేశారు. ‘మంచి మనిషిగా ఉండటమే నాకు ముఖ్యం. అలా వుండటానికే ప్రయత్నించాను. ఇకపై మరింత దృఢంగా ప్రయత్నిస్తాను’ అని రజత్ కపూర్‌లో ట్విటర్లో పేర్కొన్నారు. 2007లో ఒక టెలిఫోన్ ముఖ్యాముఖి సందర్భంగా రజత్ కపూర్ వేధింపులకు గురి చేశారని, జర్నలిస్టు సంధ్యా మీనన్ ట్విటర్లో ఆరోపించారు. తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ దాదాపు పదేళ్ల కిందటి అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందనీ, లైంగికంగా వేధించారంటూ మరో మహిళ వెలుగులోకి వచ్చారు. సౌరభ్ శుక్లా ఫోన్ నుంచి కాల్స్ చేస్తూ రజత్ కపూర్ తరచూ తనను వేధింపులకు గురి చేశారని అమెరికాకు చెందిన యువనటి మోడల్, ఆరోపించారు. కపూర్ దుష్ప్రవర్తన గురించి శుక్లాకు తెలుసునని బహుశా ఇద్దరూ కలిసే అమ్మాయిలను మభ్యపెడుతూ ఉండొచ్చన్నారు. I don't even know any more. Filmmaker Rajat Kapoor Two separate and different accounts pic.twitter.com/nBjNOsun3j — Sandhya Menon (@TheRestlessQuil) October 7, 2018 I am sorry from the bottom of my heart- and sad that I was the cause of this hurt to another human being. If there is one thing more important to me than even my work, it is to be a good human being. And I have tried to be that person. And now, I will try harder. — Rajat Kapoor (@mrrajatkapoor) October 7, 2018 -
జైట్లీకి కేజ్రీవాల్ క్షమాపణ లేఖ
-
జైట్లీకి కేజ్రీవాల్ క్షమాపణలు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్ధారణ లేకుండా ఆరోపణలు చేసినందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలు అశుతోష్, రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్‌లు జైట్లీని క్షమాపణలు కోరుతూ తమపై ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. జైట్లీని ఉద్దేశించి ఈ మేరకు కేజ్రీవాల్ లేఖ రాశారు. ‘ 2015 డిసెంబర్లో కొందరు వ్యక్తులు అందించిన పత్రాల ఆధారంగా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా మీరు వ్యవహరించిన సందర్భంలో చోటుచేసుకున్న పరిణామాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు, పటియాలా హౌస్ కోర్టు విచారణ పరిధిలో ఉన్నా’యని గుర్తుచేశారు. కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నేనీ ఆరోపణలు చేసినా..ఆ సమాచారం ప్రస్తుతం తాను గుర్తించలేకపోయానని, ఈ ఆరోపణలు చేయడానికి తనను తప్పుదోవపట్టించినట్టు పసిగట్టానని లేఖలో పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్, ఆప్ నేతల క్షమాపణల నేపథ్యంలో అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసును వెనక్కితీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. కేసుపై జైట్లీ వెనక్కితగ్గబోరని చెబుతున్నారు. -
20 సెకన్లు ముందు వెళ్లిందని..
టోక్యో: రైళ్ల ఆలస్యానికి మనం అలవాటు పడిపోయాం. గంటల తరబడి రైళ్లు ఆలస్యంగా నడవడం మనకు కొత్తేం కాదు.అయితే జపాన్‌లో ఓ రైల్వే కంపెనీ తన రైళ్లలో ఒకటి నిర్ణీత సమయం కంటే కేవలం 20 సెకన్లు ముందుగా వెళ్లినందుకు ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పింది. టోక్యో-సుకుబ నగరాల మధ్య నడిచే సుకుబ ఎక్స్‌ప్రెస్ మినామి నగరేయమ స్టేషన్ వద్ద స్ధానిక సమయం ప్రకారం 9:44:40కు స్టేషన్ నుంచి వెళ్లాల్సిఉండగా, 9:44:20కు వెళ్లిపోయింది. సిబ్బంది టైమ్‌టేబుల్‌ను సరిగ్గా చెక్ చేసుకోకపోవడంతోనే ఈ పొరపాటు చోటుచేసుకుందని కంపెనీ పేర్కొంది. డిపార్చర్ టైమ్‌ను చూసుకోకుండానే సిబ్బంది తదుపరి స్టేషన్ దిశగా రైలును నడిపించారని తెలిపింది. అయితే ప్రయాణీకులెవరూ దీనిపై ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. 20 సెకన్లు ముందుగా వెళ్లినందుకు తలెత్తిన అసౌకర్యానికి మన్నించాలంటూ సదరు రైల్వే సంస్థ ప్రకటన చేయడంతో ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. పలువురు సోషల్ మీడియా వేదికగా కంపెనీ క్షమాపణలపై స్పందించారు. -
కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ వార్నింగ్‌లో ఎట్టకేలకు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిగొచ్చారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రీతి మీనాకు ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పానని, కలెక్టర్ తనకు సోదరిలాంటిదన్నారు. అనుకోకుండా తన చేయి తాకిందని ఆయన తెలిపారు. కాగా తనతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించారంటూ కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు. తక్షణమే కలెక్టర్‌కు స్వయంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... కలెక్టర్‌తో మాట్లాడారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత వార్త... ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ వార్నింగ్