సాక్షి, న్యూఢిల్లీ : నిర్ధారణ లేకుండా ఆరోపణలు చేసినందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలు అశుతోష్, రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్‌లు జైట్లీని క్షమాపణలు కోరుతూ తమపై ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. జైట్లీని ఉద్దేశించి ఈ మేరకు కేజ్రీవాల్ లేఖ రాశారు.
‘ 2015 డిసెంబర్‌లో కొందరు వ్యక్తులు అందించిన పత్రాల ఆధారంగా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా మీరు వ్యవహరించిన సందర్భంలో చోటుచేసుకున్న పరిణామాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు, పటియాలా హౌస్ కోర్టు విచారణ పరిధిలో ఉన్నా’యని గుర్తుచేశారు. కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నేనీ ఆరోపణలు చేసినా..ఆ సమాచారం ప్రస్తుతం తాను గుర్తించలేకపోయానని, ఈ ఆరోపణలు చేయడానికి తనను తప్పుదోవపట్టించినట్టు పసిగట్టానని లేఖలో పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్, ఆప్ నేతల క్షమాపణల నేపథ్యంలో అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసును వెనక్కితీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. కేసుపై జైట్లీ వెనక్కితగ్గబోరని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment