![కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/61499870884_625x300.jpg.webp?itok=Jnfcm2vy)
కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ వార్నింగ్‌లో ఎట్టకేలకు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిగొచ్చారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రీతి మీనాకు ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పానని, కలెక్టర్ తనకు సోదరిలాంటిదన్నారు. అనుకోకుండా తన చేయి తాకిందని ఆయన తెలిపారు.
కాగా తనతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించారంటూ కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు. తక్షణమే కలెక్టర్‌కు స్వయంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... కలెక్టర్‌తో మాట్లాడారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
సంబంధిత వార్త...
ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ వార్నింగ్