
గాడ్సే వ్యాఖ్యలపై సాధ్వి క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్న బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సే ఎన్నటికీ దేశభక్తుడు కాలేడని ఆమె వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు.
బీజేపీ సైతం ఆమె వ్యాఖ్యలతో పార్టీ ఏకీభవించదని, ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరడంతో సాధ్వి ప్రజ్ఞా సింగ్ వెనక్కితగ్గారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఆమె క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై ప్రజ్ఞాజీ క్షమాపణలు తెలిపారని ఆమె ప్రతినిధి, బీజేపీ నేత హితేష్ వాజ్‌పేయి ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.