సూపర్‌మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే! | Britain Super Market Restrictions On Vegetables Fruits | Sakshi
Sakshi News home page

సూపర్‌మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే!

Published Fri, Feb 24 2023 7:37 AM | Last Updated on Fri, Feb 24 2023 8:32 AM

Britain Super Market Restrictions On Vegetables Fruits - Sakshi

లండన్‌: బ్రిటన్‌లోని ప్రముఖ సూపర్‌మార్కెట్‌ సంస్థలు కొన్ని పండ్లు, కూరగాయల కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సరఫరా కొరత తలెత్తింది. నెల రోజుల వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో సూపర్‌ మార్కెట్‌ యాజమాన్యాలు ఈ చర్యను ప్రకటించాయి.

టమాటాలు, క్యాప్సికం, దోసకాయలు, బ్రకోలి, క్యాలిఫ్లవర్‌ తదితరాల సరఫరా తక్కువగా ఉండటంతో వీటిని ఒక్కో వినియోగదారుకు మూడు వరకే విక్రయిస్తామని టెస్కో, అస్డా, మోరిసన్స్, ఆల్డి సంస్థలు తెలిపాయి. ఆఫ్రికా, యూరప్‌ల్లో ప్రతికూల వాతావరణం, ఇంధన ధరలు పెరగడం, బ్రిటన్, నెదర్లాండ్స్‌లో గ్రీన్‌హౌస్‌ వ్యవసాయంపై ఆంక్షలు కారణంగా పండ్లు, కూరగాయల దిగుబడి, రవాణాపై తీవ్ర ప్రభావం పడింది.
చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement