"ఈ సృష్టిలో అందమైనది పువ్వు అయితే తన దృష్టిలో అందమైనది అమ్మ నవ్వు" అంటున్నాడు ఆస్ట్రేలియా దర్శకుడు జాసన్ వాన్ జెండరన్. ఆ నవ్వు కోసం ఏదైనా చేస్తానంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయితే అల్జీమర్స్‌తో బాధపడుతోన్న అతని తల్లి సరుకులు తెచ్చుకుందామంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అమ్మను తీసుకుని బయటకు వెళ్లలేకపోయాడు. అలా అని ఆమె మాటను కాదనలేకపోయాడు. దీంతో కాస్త ఆలోచించి ఓ ఐడియా వేశాడు. ఇంట్లోనే సూపర్ మార్కెట్ పెట్టించాడు. ఆ వృద్ధురాలి కోసం ఆయన భార్యాపిల్లలందరూ దుకాణదారుల అవతారం ఎత్తారు. (చెట్టు లెక్కగలవా ఓ టీచరు! పాఠం చెప్పగలవా..)
ఇంకేముందీ జాసన్ తల్లిని తీసుకుని కింది గదిలోకి.. అదే సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అది చూసి ఆ బామ్మ షాక్ అయింది. తనకోసం ఇదంతా చేశారా అని తెలుసుకుని విస్తుపోయింది. కొడుకుతో కలిసి నచ్చిన వస్తువులు తీసుకుంటూ షాపింగ్ చేసింది. చివరగా సంతోషంతో కొడుకుకు సుతారంగా ముద్దు పెట్టింది. ఈ వీడియోను అతను యూట్యూబ్‌లో షేర్ చేశాడు. అమ్మ కోసం భార్య మేఘన్, పిల్లలు ఎవీ, ఆర్త్‌తో కలిసి హోమ్ మేడ్ సూపర్ మార్కెట్ రూపొందించామని తెలిపాడు. తన పెద్ద కొడుకు లెవీ దీన్నంతటినీ కెమెరాలో చిత్రీకరించాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. (ఐదేళ్లే శిక్ష వేయండి.. లేదంటే చచ్చిపోతాడు!)
Comments
Please login to add a commentAdd a comment