
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024లో అత్యుత్తమ క్యాచ్‌లు నమోదవుతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే ఐదారు కళ్లు చెదిరే క్యాచ్‌లు ఫ్యాన్స్‌కు మతి పోగొట్టాయి. తాజాగా అలాంటి క్యాచే మరొకటి నమోదైంది. కార్డిఫ్ వేదికగా గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గన్ ఆటగాడు మార్నస్ లబూషేన్ మెరుపు క్యాచ్ అందుకున్నాడు.
మేసన్ క్రేన్ బౌలింగ్‌లో బెన్ ఛార్లెస్‌వర్త్ లాంగ్ ఆన్ దిశగా ఆడిన భారీ షాట్‌ను లబూషేన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌గా మలిచాడు. ఓ మోస్తరు ఎత్తులో వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ క్యాచ్‌కు చూసిన వారు పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ క్యాచ్ అని జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్‌ను పట్టిన లబూషేన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
MARNUS LABUSCHAGNE WITH A BLINDER. 🤯💯
- One of the greatest catches ever! pic.twitter.com/ssDsUdg2aU— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024
కాగా, గ్లామోర్గన్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్లోసెస్టర్‌షైర్ గెలుపుకు చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. జోష్ షా ఆండీ గోర్విన్ బౌలింగ్ సిక్సర్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగా.. గ్లోసెస్టర్‌షైర్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. గ్లామోర్గన్ ఇన్నింగ్స్‌లో సామ్ నార్త్‌ఈస్ట్ (46 నాటౌట్) టాప్ స్కోరర్‌గా కాగా.. గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో జాక్ టేలర్ (70) అత్యధిక పరుగులు సాధించాడు.