
సాక్షి, రాజేంద్రనగర్: నగరంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్‌లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రత్నదీప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ఆ మంటలను చూసి పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది.
ఈ క్రమంలో రత్నదీప్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.