కీ‘లేడీ’ జేబుదొంగ.. వీడియో వైరల్‌ | Viral Video Of A Lady Pickpocket At Kamareddy Supermarket | Sakshi
Sakshi News home page

కీ‘లేడీ’ జేబుదొంగ.. వీడియో వైరల్‌

Published Sat, Dec 26 2020 12:35 PM | Last Updated on Sat, Dec 26 2020 1:26 PM

Viral Video Of A Lady Pickpocket At Kamareddy Supermarket - Sakshi

సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఓ లేడీ జేబుదొంగ వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. పలు ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్లాస్టిక్‌ కవర్‌ అడ్డుపెట్టి మరి జేబులు కొట్టేస్తోంది. ఈ నెల 23న జరిగిన రెండు దొంగతనలు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మేన్స్‌ క్లబ్‌లోకి వెళ్లిన మహిళా జేబుదొంగ ఓ వ్యక్తి జేబు కొట్టిసింది. అరగంట వ్యవధిలోనే సూపర్ మార్కెట్లోకి వెళ్లి మరో వ్యక్తి జేబు కొట్టేసింది. దర్జాగా సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళ కేవలం ఒక్క నిమిషంలోనే వ్యక్తి జేబులోంచి పర్సును దొంగిలించిది. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. జీన్స్‌ టీషర్టులో ధరించిన మహిళ ముఖానికి మాస్కు కట్టుకొని షాప్‌లోకి ప్రవేశించింది. అనంతరం సరాసరి క్యాష్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లిన మహిళ తనను ఎవరైనా గమనిస్తున్నారా అని పరిశీలించి మెల్లగా తన ముందు ఉన్న వ్యక్తి జేబులోనుంచి పర్సును దొంగిలించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీంతో సదురు జేబుదొంగ బాగోతం బట్టబయలైంది. ఈ దొంగతనం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఆయా షాపుల‌ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement