
సాక్షి, వరంగల్ : రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ తన కొత్త స్టోర్‌ను వరంగల్‌లోని బాలసముద్రంలో గల సురేష్‌రెడ్డి ప్రాపర్టీస్‌లో ప్రారంభించింది. ఒకే కేంద్రంలో బహుళవిధమైన ఉత్పత్తులను కలిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్పత్తులు, పండ్లు మరియు కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్‌వేర్, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
తాజాగా ప్రారంభమైన వరంగల్ స్టోర్ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 15కు చేరుకుంది. 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన వరంగల్ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన డిజైన్ మరియు లేఔట్ కలిగి ఉండి, నాణ్యమైన ఉత్పత్తులు మరియు ఆకర్షణీయమైన ధరల వల్ల స్థానిక ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటుగా వారి దైనందిన అవసరాలను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిలవనుంది. `పవర్ ఆఫ్ 9` పేరుతో కల్పించిన ప్రారంభోత్సవ ఆఫర్ ద్వారా ఉల్లిగడ్డలు, కొబ్బరికాయలు, ప్లాస్టిక్ కంటెయినర్ల సెట్ వంటి అనేక ఉత్పత్తులు కేవలం రూ.9 కే (వీటి మార్కెట్ ధర కనీసం రూ.999 ఉంటుంది) అందించడం వల్ల అనేకమంది వినియోగదారులు ఆకర్షితులు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment