New York Supermarket Mass Shooting: Ten Dead In Attack At New York State Supermarket - Sakshi
Sakshi News home page

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి

Published Sun, May 15 2022 8:23 AM | Last Updated on Sun, May 15 2022 4:53 PM

Ten Dead in Attack at New York State Supermarket - Sakshi

న్యూయార్క్‌: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ  కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైనికుడి వేషధారణలో సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నల్లజాతీయులు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు.

చదవండి: (ప్రపంచ సంక్షోభమే.. జి–7 దేశాల ఆందోళన) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement