దేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఉత్పత్తులలో.. ప్రొడక్ట్‌ని బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ముడిసరుకు ఖర్చుల మధ్య గత రెంవత్సరాలుగా ధరలను పెంచిన హెచ్‌యూఎల్ సంస్థ.. ఇటీవల ముడి సరుకు ధరలు అదుపులోకి రావడంతో పలు ప్రాడెక్ట్‌లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సామాన్యడికి కాస్త ఊరటనిస్తుంది.
కాగా కరోనా మొదలుకొని అన్నీ రంగాలు డీలా పడడంతో దాని ప్రభావం చాలా వరకు సామాన్యలపై పడింది. ఈ క్రమంలో ఉద్యోగాల కోత, నిత్యవసరాలు, ఇంధన ధరలు ఇలా అన్ని పెరుగుతూ ప్రజలకు భారంగా మారిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ముడిసరుకు ధరలు గరిష్ట స్థాయిలో పెరిగాయి. దీంతో గత నాలుగు త్రైమాసికాల్లో, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు 8-15 శాతం మేర ధరలను పెంచాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తాజా ప్రకటనతో.. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, రిన్ డిటర్జెంట్ పౌడర్, లైఫ్‌బోయ్ సబ్బు, డోవ్ సోప్ వంటివి ఉత్పత్తుల ధరలు తగ్గాయి.
అయితే, కొందరి డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం, అన్ని ధర తగ్గించిన వస్తువులు ఇంకా మార్కెట్లోకి అందుబాటులో లేదని తెలిపారు. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం: 12వేల మంది ఉద్యోగులు ఇంటికి!
Comments
Please login to add a commentAdd a comment