
సాక్షి, బెంగళూరు : ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల (46) కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా.. నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను పెట్టారు ఇరోమ్ దంపతులు వీరి ఫోటోలనుతాజాగా విడుదల చేశారు. పిల్లలిద్దరూ 2.15, 2.16 కేజీల బరువుగా ముద్దుగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు శ్రీపాద వినెక్కర్ తెలిపారు.
మల్లేశ్వరంలోని ప్రైవేట్ ఆస్పత్రి క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో సిజేరియన్ ద్వారా ఇరోమ్కు ఇద్దరు పండంటి ఆడబిడ్డలు పుట్టారు. అదీ మాతృదినోత్సవం రోజున ఇద్దరు ఆడబిడ్డలు పుట్టడం విశేషంగా నిలిచింది. దీంతో ఐరన్ లేడీకి అభినందనల వెల్లువ కురిసింది.
మణిపూర్ రాష్ట్రంలో సాయుధబలగాల ప్రత్యేక చట్టం రద్దుచేయాలంటూ 16 ఏళ్ల పాటు నిరాహారదీక్ష చేసి ఇరోమ్ షర్మిల ఐరన్ లేడీగా ఘనతకెక్కారు. దీక్ష విరమణ అనంతరం రాజకీయాల్లో ప్రవేశించినా.. ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. 2017లో గోవాలో పుట్టి బ్రిటీష్ జాతీయత కలిగిన వ్యక్తి డెస్మండ్ కొటిన్హోను ఇరోమ్ షర్మిల వివాహమాడారు.
Comments
Please login to add a commentAdd a comment